బొండా కుమారుడి రాంగ్ రైడ్ | vijayawada mla bonda uma's son and gang voilated trafic rools | Sakshi
Sakshi News home page

బొండా కుమారుడి రాంగ్ రైడ్

Published Mon, May 11 2015 2:38 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

ఆదివారం బందరు రోడ్డులో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న రవితేజ, అనుచరుల వాహనాలు - Sakshi

ఆదివారం బందరు రోడ్డులో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న రవితేజ, అనుచరుల వాహనాలు

- ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డేకు రోడ్డుపై రేసుల్లా ర్యాలీలు
- విజయవాడలో బొండా కుమారుల అనుచరుల హల్‌చల్
- ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు
- గతంలో కేసు నమోదైనా తీరు మారని వైనం
 
విజయవాడ:
ఓ ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డే దెబ్బకు విజయవాడ ప్రజలంతా హడలిపోయారు. రోడ్డు మీద రేసుల తరహాలో దూసుకొస్తున్న బైకులు, సెలైన్సర్లు తొలగించిన బైకుల రణగొణ ధ్వనులు, ఆగకుండా మోగుతూనే ఉన్న హారన్లు, రాంగ్ రూట్‌లో కార్ల హల్‌చల్...... దీంతో రోడ్డుపై అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో ఈ భీతావహ పరిస్థితి నెలకొంది.

రవితేజ, అతని స్నేహితులు సాయంత్రం నాలుగు గంటల నుంచి 30 బైకులు, రెండు సుమోలతో హల్‌చల్ చేశారు. మొగల్రాజపురం నుంచి బయలుదేరి బందరురోడ్డు, ఏలూరురోడ్డు, గాయత్రినగర్‌లలో నినాదాలు చేసుకుంటూ తిరిగారు. ఒక్కో బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి వన్‌వేలను, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరుచేయకుండా దూసుకుపోయారు. బైక్‌లకు సెలైన్సర్లు తీసివేయడంతో వాహనాల సౌండ్‌కు, యువకులు చేసే నినాదాలకు ఇతర వాహనచోదకులు బెంబేలెత్తిపోయారు. వ్యాన్‌లకు ఇరువైపులా యువకులు వేలాడుతూ నిలబడినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.

బందరురోడ్డులో వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ వారిని వారించబోగా రవితేజ అనుచరులు వాగ్వాదానికి దిగి వన్‌వేలో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాలేదు. గతంలో బొండా ఉమపెద్ద కుమారుడు సిద్ధార్థ గుంటూరు జిల్లాలో నిర్వహించిన కారు రేసు సందర్భంగా ఓ యువకుడు మృతి చెందిన విషయం విదితమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement