ప్రేమ పేరుతో వంచించాడు | Lover filed a complaint against her boyfriend in vijayawada | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచించాడు

Published Wed, Sep 3 2014 11:28 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

ప్రేమ పేరుతో వంచించాడు - Sakshi

ప్రేమ పేరుతో వంచించాడు

హైదరాబాద్ :  వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ప్రేమికుడు .... తన ప్రేయసి కొంతకాలంగా దూరం పెడుతున్నాడు. దాంతో అనుమానం వచ్చిన ప్రేమికురాలు కూలీ లాగింది. దాంతో అసలు విషయం బయటపడింది. ప్రేమికుడు.... మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకుంది.

ఇదేంటని ప్రశ్నించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ప్రేమికుడు కట్నం కావాలని షరతు పెట్టడంతో ఆమె పోలీసు స్టేషన్ గడప తొక్కింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై  బాధితురాలు సమాచారం ప్రకారం.... సత్యనారాయణపురానికి చెందిన యువతి(21) నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదువుతోంది.  బృందావన్ కాలనీలో నివాసి మహ్మద్ ఇలియాస్, యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కూడా సన్నిహితులయ్యారు.

ఇలియాస్ ప్రేమికురాలి వద్ద ఖర్చుల కోసం భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. గత ఏడు నెలలుగా ఆమెతో దూరంగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ప్రియుడి తీరుపై ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది.  తాజా ప్రేమ వ్యవహారానికి ఇలియాస్ స్నేహితులు కూడా సహకరించినట్లు తెలుసుకుంది. దీనిపై ఇలియాస్‌ను నిలదీసింది. తనను వివాహం చేసుకోవాలని కోరగా,  పెళ్లాడాలంటే కట్నం ఇవ్వాలని  డిమాండ్ చేశాడు.

దాంతో బాధితురాలు మంగళవారం  చుట్టుగుంటలోని ఇలియాస్ రెండో ప్రేమికురాలి నివాసానికి వెళ్లింది. ఇలియాస్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పి, అన్ని రకాలుగా మోసగించాడని వివరించింది. ఆమెను కూడా మోసం చేస్తాడని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.  అనంతరం బాధిత యువతి  పటమట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇలియాస్ తనను మోసగించాడని ఫిర్యాదు చేసింది. ఇలియాస్‌పై గతంలో సత్యనారాయణపురం స్టేషన్‌లో  కేసు నమోదైనట్లు సమాచారం.  తాజా ఫిర్యాదును కూడా ఆ స్టేషన్‌కే బదిలీ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement