సాక్షి, విజయవాడ: కరకట్టపై చంద్రబాబు నివాసం(లింగమనేని గెస్ట్‌హౌస్) జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. లింగమనేని రమేష్‌తోపాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతివ్వాలని సీఐడీ కోరగా.. వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను జప్తు చేయడంతోపాటు నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేయడానికి అనుమతినిచ్చింది.
ఈ ఆస్తులను తాము విక్రయించబోయని సెక్షన్ 8 ప్రకారం అఫిడవిట్‌లు దాఖలు చేసుకునేందుకు ప్రతివాదులకు కోర్టు అవకాశం ఇచ్చింది. కాగా కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment