రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ ఈశ్వర్‌కుమార్
విజయవాడలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు.
కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment