సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్‌ఎన్‌వీఆర్ హైస్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్‌వీఎన్‌ఆర్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్‌ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్‌ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment