సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపైనే దాష్టీకానికి దిగారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మేకలపల్లిలో స్కూల్ కమిటీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వ్యవహరించలేదని హెచ్‌ఎం గోవిందప్పపై సోమందేపల్లి టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం మాదే.. జాగ్రత్తగా ఉండాలంటూ టీచర్‌ను హెచ్చరించారు. టీడీపీ నేత సిద్ధలింగప్ప వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, మరోవైపు చిరుద్యోగులపై కూడా టీడీపీ నాయకులు ప్రతాపం చూపుతున్నారు. ఎమ్మెల్యే పీఏ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన అనిల్, బాలక్రిష్ణ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విభాగంలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కూ లేదు. అయితే అధికార టీడీపీ నాయకులు ఆ ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ రంగు పులిమి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని నియమించేందుకు పావులు కదిపారు.
ఎమ్మెల్యే పీఏ ద్వారా ఆదేశాలు అందుకున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులు ఇక నుంచి విధులకు రావొద్దని కార్మికులకు తెలిపారు. 2004 నుంచి పనిచేస్తున్న తనను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని వాటర్‌మెన్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉద్యోగంతోనే తాను భార్య, కుమారుడిని పోషించుకునేవాడినని, ఇప్పుడు జీవనం ఎలా సాగించాలో తెలియడం లేదని అన్నాడు.
2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు.

Comments
Please login to add a commentAdd a comment