సాక్షి, విజయవాడ: 2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను దిగమింగినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్‌లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులని ఏసీబీ అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్‌లో సబార్డినేట్లగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు.
సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్ వర్డులని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుంచి ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ పీఏగా పనిచేస్తూ ధనరాజు అలియాస్ నాని అక్రమాలకి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించిన ఏసీబీ రూ. కోటి పైనే అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు గుర్తించారు. ఏడెనిమిదేళ్లుగా సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment