
సాక్షి, అనంతపురం: ఏసీబీ దాడుల్లో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వివరాలు.. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ దివాకర్‌రెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా సురేష్ తన సేవలను కొనసాగించాడు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడంటూ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సురేష్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు సురేష్ ఇంట్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment