చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు బరితెగింపుకు పాల్పడ్డారు. చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.
నీరు-చెట్టు కింద పనుల్నీ ఒకే వర్గానికీ కేటాయిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై జేఈ జమునాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.