ప్రజా ఉద్యమంగా ‘నీరు-చెట్టు’ | Chandrababu Naidu launches 'Neeru-Chettu' program | Sakshi
Sakshi News home page

ప్రజా ఉద్యమంగా ‘నీరు-చెట్టు’

Published Fri, Feb 20 2015 1:32 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

Chandrababu Naidu launches 'Neeru-Chettu' program

కర్లాం (చీపురుపల్లి రూరల్) :    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రజా ఉద్య మంలా చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభి వృ ద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని పిలుపు నిచ్చారు. గురువారం ఆమె కర్లాం గ్రా మంలో నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలి పారు. చెట్లు తరిగిపోవడంతో ఉష్ణోగత్ర పెరిగిపోతుందన్నారు. రాష్ట్రంలో 25. 5 శాతం మాత్రమే పచ్చదనం ఉందని, 35 శాతం ఉంటేనే వర్షాలు సక్రమంగా కురుస్తాయని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచే ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అం తకుముందు పీహెచ్‌సీ ఆవరణంలో మొ క్కలు నాటారు. అనంతరం మోదుగులపేట రోడ్డును పరిశీలించిన మంత్రి ఆర్‌టీసీ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మా ట్లాడి కర్లాం గ్రామానికి బస్సు సౌకార్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎం నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, డ్వామా పీడీ ప్రశాంతి, డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీరావు, పాల్గొన్నారు.
 
 మంత్రి దృష్టికి సమస్యలు
 గ్రామానికి చెందిన యువకులు స్థానికం గా ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు వస్తేనే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని, లేకపోతే పట్టించుకునే నాథుడే లేరన్నారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదన్నారు. అలాగే తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని, వెటర్నరీ ఆస్పత్రి లేదని తెలిపా రు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement