public movement
-
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్ చీఫ్
‘ట్రాక్టర్ పరేడ్‌ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు. ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్ ఢిల్లీ డీసీపీ సందీప్ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
‘కశ్మీర్’పై ప్రజా ఉద్యమం
లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ (జేయూడీ) హఫీజ్ సయీద్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్య్రం సాధించటానికి పాకిస్తాన్లో ప్రజా ఉద్యమం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 297 రోజుల గృహ నిర్బంధం అనంతరం ఈ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు గురువారం అర్ధరాత్రి దాటాక విడుదలయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘కశ్మీర్ గురించి మాట్లాడనీయకుండా చేయడానికే నన్ను 10 నెలలు గృహనిర్బంధంలో ఉంచారు. నేను కశ్మీరీల కోసం పోరాడుతాను. వారికి స్వాతంత్య్రం వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాను. కశ్మీర్‌కు స్వాతంత్య్రాన్ని కోరుకునే పాకిస్తానీలను ఏకం చేసి ఆ కల నెరవేరేందుకు ప్రయత్నిస్తాను’అని పేర్కొన్నాడు. అలాగే శుక్రవారం ఓ మసీదులో సయీద్ మతోపన్యాసం చేస్తూ..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత్‌తో మైత్రి కోసం ప్రయత్నించి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించాడు. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో పలుచోట్ల మారణహోమం సృష్టించి ఆరుగురు అమెరికన్లు సహా 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా హఫీజ్ సయీద్ ఈ దాడికి ప్రణాళిక రచించాడు. ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు భారత్ ఆధారాలు అందజేయడంతో ఈ ఏడాది జనవరి 31న సయీద్‌తో పాటు మరో నలుగురిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. సయీద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేస్తూ ఇతని తలపై అమెరికా కోటి డాలర్ల నజరానా కూడా ప్రకటించింది. అరెస్టు చేయాలి: అమెరికా హఫీజ్ సయీద్ చేసిన నేరాలకు అతణ్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అమెరికా కోరింది. ‘లష్కరే తోయిబా స్థాపకుడు సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం మాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికన్లు సహా వందలాది మంది ప్రజలను లష్కరే తోయిబా అన్యాయంగా చంపేసింది. సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఆస్ట్రేలియాలో పాదయాత్ర
-
ప్రజా ఉద్యమంగా ‘నీరు-చెట్టు’
కర్లాం (చీపురుపల్లి రూరల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రజా ఉద్య మంలా చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభి వృ ద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని పిలుపు నిచ్చారు. గురువారం ఆమె కర్లాం గ్రా మంలో నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలి పారు. చెట్లు తరిగిపోవడంతో ఉష్ణోగత్ర పెరిగిపోతుందన్నారు. రాష్ట్రంలో 25. 5 శాతం మాత్రమే పచ్చదనం ఉందని, 35 శాతం ఉంటేనే వర్షాలు సక్రమంగా కురుస్తాయని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచే ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అం తకుముందు పీహెచ్సీ ఆవరణంలో మొ క్కలు నాటారు. అనంతరం మోదుగులపేట రోడ్డును పరిశీలించిన మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మా ట్లాడి కర్లాం గ్రామానికి బస్సు సౌకార్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎం నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, డ్వామా పీడీ ప్రశాంతి, డీఆర్డీఏ పీడీ ఢిల్లీరావు, పాల్గొన్నారు. మంత్రి దృష్టికి సమస్యలు గ్రామానికి చెందిన యువకులు స్థానికం గా ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు వస్తేనే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని, లేకపోతే పట్టించుకునే నాథుడే లేరన్నారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదన్నారు. అలాగే తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని, వెటర్నరీ ఆస్పత్రి లేదని తెలిపా రు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. -
డిండి ఎత్తిపోతలపై ప్రజా ఉద్యమం
కార్యాచరణ సిద్ధం చేసిన కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్, ఎంపీ నేతృత్వంలో మండలాల వారీగా నిరసనలు నక్కలగండిని ‘‘డిండి ఎత్తిపోతల పథకం’’గా వర్ణించాలని పిలుపు దేవరకొండ : డిండి ఎత్తిపోతల పథకం (నక్కలగండి ప్రాజెక్టు) సాధనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రూపుది ద్దుకుని రూ.3కోట్లతో సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు.. ప్రభుత్వ ఆమోదముద్ర పడే సమయంలో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంనుంచి దీనిపై క్లారిటీ తీసుకునేందుకు కాంగ్రెస్ ప్ర ణాళిక రూపొందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జూరాల-పాకాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ఈ ప్రాజెక్టు చేపట్టడంపై సంకోచిస్తు న్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ నేనావత్ బాలునాయక్‌ల నేతృత్వంలో మండలాల వారీగా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని టీఆర్ఎస్ పనికిమాలిన ప్రాజెక్టు అని వర్ణించిన నాటినుంచి ప్రారంభమైన మాటల సెగ ఇంకా చల్లారడం లేదు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావించిన జిల్లా కాంగ్రెస్ నేతలు దీనికి ప్రభుత్వ ఆమోద ముద్ర పడేంత వరకు ఉద్యమించాలని భావిస్తున్నారు. ఇటీవల జిల్లాపరిషత్‌లో జరిగిన వివాదంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయన్న కాంగ్రెస్ నేతల అనుమానం తారాస్థాయికి చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకం ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఉద్యమాలు చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమం ముందుకు సాగుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రతినిధులు చాకచక్యంగా నక్కలగండి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉందని, నిధులు విడుదల చేస్తామని పేర్కొంటున్నప్పటికీ.. ప్రస్తుతం తాము అడిగేది డిండి ఎత్తిపోతల పథకం అని పేర్కొన్నారు. నక్కలగండి అంటే ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్‌గా భావిస్తూ దానికి నిధులు అందజేస్తామని పేర్కొంటున్నారని, ఈ విషయంపై ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న జెడ్పీ చైర్మన్ బాలునాయక్ నక్కలగండి నుంచి మిడ్ డిండి ద్వారా డిండికి నీటిని అందించే ప్రాజెక్టు (డిండి ఎత్తిపోతల పథకం) అని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును నక్కలగండి ప్రాజెక్టుగా వర్ణించకుడా ఁ్ఙడిండి ఎత్తిపోతల పథకం**గా అభివర్ణించాలని నేతలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన బాలునాయక్ కాంగ్రెస్ చేపట్టబోయే ప్రజా ఉద్యమం గురించి వివరించారు. మరో వారం, పది రోజుల్లో మండలాల వారీగా ప్రణాళికను రూపొందించి ప్రజలు, రైతుల మద్దతుతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపడతామని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథ కం.. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వంనుంచి స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. - నేనావత్ బాలునాయక్, జెడ్పీచైర్మన్ -
ప్రజా ఉద్యమంపై పీడీ యాక్టా?
బలభద్రపురం (బిక్కవోలు), న్యూస్‌లైన్ :కాలుష్య కర్మాగారాల వల్ల ప్రజలకు హాని జరుగుతుందని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ధ్వజ మెత్తారు. కేపీఆర్ సంస్థ నిర్మిస్తున్న కా లుష్య కారక, థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పో రాటం చేస్తున్న పడాల వెంకటరామారెడ్డిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దొంతమూరు నుంచి పాదయాత్ర చేపట్టి బలభద్రపురం వంతెన వద్ద సుమారు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ స్మగ్లర్లు, సంఘ విద్రోహ శక్తులు, దారుణమైన నేర చరిత్ర కలిగిన వారిపై ప్రయోగించే పీడీ యాక్ట్‌ను కలెక్టర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో రాము చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న రాము హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్టు కలెక్టర్ నిరూపించగలరా అని సవాల్ విసిరారు. అయితే కలెక్టర్ ఇచ్చిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను ఆగమేఘాలపై సీఎం కూడా ఆమోదించినట్టు తమకు తెలిసిందని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ప్రజలు 11 నెలలుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాసి ఉద్యమ నేతలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఉద్యమ నేత కాకర్ల సూరిబాబు మాట్లాడుతూ కలెక్టర్ ప్రారిశ్రామిక వేత్తలకు అండగా ఉండడాన్ని దుయ్యబట్టారు. కలెక్టర్ అయి ఉండి ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం దృష్టిలో ఉంచుతున్నామని, మొదటిది పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసిన రామును విడుదల చేయాలన్నారు. ఉద్యమకారులపై ఇప్పటివరకు ఉన్న కేసులను ఎత్తివేయాలని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే కేపీఆర్ సంస్థలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. కేపీఆర్ సంస్థలు నిర్మిస్తున్న పరిశ్రమలకు పరిసర గ్రామాలైన ఆర్ఎస్ పేట, నల్లమిల్లి పంచాయతీలతో సంస్థ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించాలన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అనపర్తి సీఐ కోనాల నాగమోహనరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ న్యాయబద్ధమైన ఈ డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాడతామని, ఉద్యమకారులకు అందుబాటులో ఉంటామని చెప్పారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నేత బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమానిదే అంతిమ విజయం అవుతుందన్నారు. పార్టీ అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో విజయం సాధించే వరకూ పోరాడుతామన్నారు. ఆందోళన సమయంలో అనపర్తి వైపు నుంచి వస్తున్న 108కు, అత్యవసర వైద్యం కోసం రాయవరం వైపు వెళ్లే ఆటోకు ఆందోళనకారులు దారిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పి.కె.రావు, విప్పర్తి వేణుగోపాలరావు, కర్రి శేషారత్నం, సబెళ్ల కృష్ణారెడ్డి, వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటతడి పెట్టిన సునీత తన భర్త రాము ప్రజల కోసం పోరాటం చేస్తూ, జైలు పాలు కాగా, అదే సమయంలో తన కుమార్తె పుష్పవతి కావడంతో జైలుకు వెల్లి తండ్రితో అక్షింతలు వేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని సునీత కంటతడి పెట్టారు. ఇప్పుడు సంక్రాంతి పండగ సమయంలోనూ అక్రమంగా జైలుపాలు చేసి వేధిస్తున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్సార్ సీపీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు.