నెలాఖరులో సీఎం పర్యటన
Published Mon, Apr 24 2017 12:32 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
– నీరు–చెట్టు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
కర్నూలు (అగ్రికల్చర్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలిసింది. జిల్లాలో సీఎం నీరు–చెట్టు కార్యక్రమాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త కలెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ముఖ్యమంత్రి పర్యటనకు అవకాశం ఏర్పడింది.
Advertisement
Advertisement