‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం | Vigilance Enquiry on Neeru-Chettu Scheme, Says Peddireddy Ramachandra Reddy | Sakshi
Sakshi News home page

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

Published Thu, Jul 25 2019 11:04 AM | Last Updated on Thu, Jul 25 2019 12:25 PM

Vigilance Enquiry on Neeru-Chettu Scheme, Says Peddireddy Ramachandra Reddy - Sakshi

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. నీరు-చెట్టు నిధులను టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు. మరో సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నీరు-చెట్టులో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ పథకం కింద రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఈ నిధులను దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. నీరు-చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి  స్పష్టం చేశారు. నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని, ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారి నుంచి సొమ్ము తిరిగి రాబడతామని ఆయన వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement