విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగులు, పాలవలస విక్రాంత్.
వంగర: గ్రామాల్లో నీరు–చెట్టు పథకం పనుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌లు ధ్వజమెత్తారు. వంగరలో పార్టీ కార్యకర్త కాంబోతుల నర్సమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను శనివారం వారు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు సూచించిన నీటి వనరులను ఎంపిక చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు.
ఈ పనుల్లో నాణ్యత పాటించలేదని, అధికారులు కూడా నాయకులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వంగర మండలంలో వైఎస్‌ఆర్ సీపీ అభిమానులు, క్యాడర్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి కుడి కాలువ ద్వారా సాగునీటి సరఫరా జరగలేదని, రైతు రుణాలు కొత్తగా మంజూరుకు నోచుకోక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, వంగర,రేగిడి,రాజాం మండల అధ్యక్షులు కరణం సుదర్శనరావు, వావిలపల్లి జగన్మోహనరావు, లావేటి రాజగోపాల్, టంకాల అచ్చెంనాయుడు, బండి నర్శింహులు, వంజరాపు విజయ్‌కుమార్, నల్ల కృష్ణ, గేదెల రామకృష్ణ, భగవతి, బెవర అప్పలనాయుడు, దుర్గప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.