సాలూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం వల్ల ప్ర జా ధనం వృథా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. గురువారం ఆ యన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేవలం నర్సరీ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని, వారికి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో నీరు-మీరు, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా వర్షాకాలంలో నాటిన 100 మొక్కల్లో కనీసం 5 కూడా బతికాయా అని ప్రశ్నించారు.
వర్షాకాలంలో నాటితేనే పరిస్థితి అలాగుంటే వేసవి లో నాటిన వాటి ప రిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇందిరజలప్రభ, సామాజిక అటవీ మొక్కల పెంపకం ద్వారా అడవులు, రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయా ల వద్ద, ఇంటికో మొక్క అంటూ నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో చెప్పాల న్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో మొక్కలు నాటితేనే ఫలితం ఉంటుందని, అలా కా కుండా వేసవిలో నాటితే ఎండి పోతాయని చెప్పా రు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేసే నిర్ణయాలు విరమించుకోవాలని ఆయన హి తువు పలికారు.
‘నీరు-చెట్టు’తో ప్రజా ధనం వృథా
Published Fri, Feb 20 2015 1:30 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement
Advertisement