నీరు–చెట్టు.. అవినీతి పుట్ట | Corruption anthill water - tree .. | Sakshi
Sakshi News home page

నీరు–చెట్టు.. అవినీతి పుట్ట

Published Tue, Jul 26 2016 10:05 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

నీరు–చెట్టు.. అవినీతి పుట్ట - Sakshi

నీరు–చెట్టు.. అవినీతి పుట్ట

కడప రూరల్‌ :
ప్రతి పనిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి..అర్హులకు ఏమాత్రం సంక్షేమ పథకాలు అందడం లేదు..పాలకులు ఇష్టానుసారంగా ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అబివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల్లో అమలవుతున్న  పథకాలు, జరుగుతున్న అక్రమాలపై వాడి వేడిగా చర్చ సాగింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులు హార్టికల్చర్‌ కిందికి వస్తారా? లేదా అగ్రికల్చర్‌ కిందికి వస్తారా? అనేది నేటికీ తెలియకపోవడం దారుణమన్నారు. దీంతో వారు నష్టపరిహారం పొందలేక ఇబ్బందులకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ఇరిగేషన్‌ పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ వివరాలను తెలియపరచాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈని ప్రశ్నించారు. దీనికి ఎస్‌ఈ సమాధానం చెప్పలేకపోయారు. అవినీతిని నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తప్పనిసరిగా టెండర్ల ద్వారానే పనులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా విద్యుత్‌కు సంబంధించి 50 యూనిట్లకు బదులుగా 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఇవ్వాలన్నారు. అలాగే వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా కావడం లేదన్నారు. అలాగే సబ్‌స్టేషన్లలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి పాలకుల సూచనల మేరకే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపించారు. అలాకాకుండా మెరిట్‌ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో చెన్నూరు మినహా దాదాపు అన్ని ప్రాంతాలలో నీటి కొరత ఉందని, ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు గృహాలు దెబ్బతినగా,
మరికొన్ని కూలిపోయాయని పేర్కొన్నారు. వాటి మరమ్మతులకు, గృహాల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.  అధికారులు స్పందించి అర్హులకు తక్షణమే పింఛన్లు దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు.


రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నీరు–చెట్టు పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా చెక్‌డ్యాముల వ్యవహారంలో అవినీతి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపై కూడా జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఏ పథకమైనా అటు తిరిగి, ఇటు తిరిగి జన్మభూమి కమిటీల వద్దకు రావడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప శాసనసభ్యులు ఎస్‌బీ అంజద్‌బాషా మాట్లాడుతూ నీరు–చెట్టు పేరుతో బుగ్గవంకలో చేపట్టిన పనుల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపించారు. టెండర్ల ద్వారా కాకుండా ఇష్టమొచ్చిన వారికి పనులు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే కడప నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

గ్రామసభల ద్వారా పనులు చేపట్టాలి – ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

అడ్డగోలుగా కాకుండా గ్రామసభల ద్వారా పనులు చేపట్టాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు.లాగే అర్హులకు సంక్షేమ ఫలం దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్‌ ప్రకారం తప్పనిసరిగా నడుచుకోవాలన్నారు. అందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే అందరి ఆమోదం మేరకు విచారణ చేపట్టడానికి తీర్మానం చేపడతామన్నారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌తో పరిశీలన – కలెక్టర్‌
పలు ప్రాంతాల్లో జరిగిన అవినీతి పనులపై చర్చకు వచ్చింది. వీటిపై వాదోపవాదాలు సాగాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన అన్ని పనులపై సెంట్రల్‌ విజిలెన్స్‌ చేత పరిశీలన చేయిస్తామన్నారు. ఎక్కడైతే అవినీతి జరిగిందని బహిర్గతమవుతుందో అక్కడ కఠిన చర్యలు చేపడుతామన్నారు. అలాగే అవినీతిపై వచ్చిన కథనాలపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులుగా పోరుమామిళ్లలో ఇటీవల డంపింగ్‌యార్డు ప్రారంభోత్సవ సభలో ప్రొటోకాల్‌ను పాటించలేదనే దానిపై కూడా స్పందించారు. తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలన్నారు. పోరుమామిళ్లలో జరిగిన సంఘటనకు సంబంధించి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ అంటే మండలంలోని అధికారులకు లెక్కే లేకుండా పోయిందని గాలివీడు ఎంపీపీ రెడ్డెన్న ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటి..?       
ప్రభుత్వ పథకాలపై జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు నిలదీశారు. అందుకు జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ వాటి వివరాలను తెలుపాలని పీడీని కోరగా, ఆన్‌లైన్‌లో అర్హులైన వారు ఇంకా 13 వేలకు పైగా ఉన్నారని, వారందరికీ పింఛన్లు అందాల్సి ఉందన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ వారందరికీ తక్షణమే పింఛన్లు ఎందుకు మంజూరు కావడం లేదని నిలదీశారు. జిల్లా యంత్రాంగం స్పందించి అర్హుౖలñ న వారికి వెంటనే పింఛన్‌ అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వానికి ఒక నివేదిక పంపుతామని తెలిపారు. పక్కాగృహాల మంజూరులో కూడా వివక్ష కొనసాగుతోందని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క అర్హునికి అందేలా చూడాలని వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గూడూరు రవి, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ రమేష్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుబ్బరాజు, పోరుమామిళ్ల ఎంపీపీ చింతా విజయ్‌ప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement