'43వేల ఎకరాల్లో మొక్కలు' | kimidi mrinalini statement on neeru - chettu programme | Sakshi
Sakshi News home page

'43వేల ఎకరాల్లో మొక్కలు'

Published Tue, Jun 23 2015 1:01 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

kimidi mrinalini statement on neeru - chettu programme

హైదరాబాద్: వచ్చే ఏడాది 43 వేల ఎకరాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించామని గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఈ ఏడాది లక్షా 26 వేల ఎకరాల్లో మొక్కలు నాటినట్టు ఆమె పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరువుల పూడికతీత కోసం రూ.1346 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి చెప్పారు. 'నీరు - చెట్టు' కార్యక్రమం ద్వారా లక్షా 7 వేల చెరువుల్లో పూడిక తీయించనట్టు ఆమె తెలిపారు. అదే విధంగా 15 కోట్ల 6 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని మంత్రి కిమిడి మృణాళిని ఈ సందర్భంగా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement