kimidi mrinalini
-
మృణాళినికి పరాభవం
టిక్కెట్ల మాటేమోగానీ... జిల్లాలోని టీడీపీ వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు అమరావతి వేదికగా బహిర్గతమయ్యాయి. సిటింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో టిక్కెట్లు ఇవ్వడానికి వీల్లేదంటూ అక్కడి ఆశావహులు గట్టిగానే నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు పాల్పడిన అక్రమాలను బట్టబయలు చేశారు. ప్రధానంగా చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కాస్త అధినేతకు శిరోభారంగానే పరిణమించింది. ఈ వివాదాల పుణ్యమాని అక్కడి అభ్యర్థిత్వాల ఖరారు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనికి కొనసాగింపుగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకుల సమీక్షకు కూడా ఆశావహులు అన్నిఅస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సిటింగ్ ఎమ్మెల్యేలకు స్వపక్షంలోనే అసంతృప్తి సెగలు గట్టిగా తగులుతున్నాయి. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తారని భావిస్తున్న తరుణంలో సిటింగ్‌లపై అసంతృప్తి సెగలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ బహిరంగంగానే ప్లకార్డులతో డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికిభారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుండగా, గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడుకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ సాక్షాత్తూ ఆయన అన్న కొండబాబు గట్టిగా పట్టుపడుతున్నారు. మృణాళినికి పరాభవం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం వెళ్లిన సిటింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అమరావతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు అమరావతిలో సీఎం సమీక్ష జరుపుతున్న ప్రదేశంలో ‘చీపురుపల్లి ఎమ్మెల్యేగా మృణాళిని వద్దు’ అంటూ రాసిన ప్లకార్డులను చేతబట్టి నినా దాలు కూడా చేశారు. ఆమెపై నియోజకవర్గ నేతల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో మరోసారి అమరావతి సాక్షిగా బయటపడింది. అమరావతి వెళ్లిన నేతలతో చంద్రబాబు సమీక్ష జరపడానికి ముందు ఓ కమిటీతో నేతలు సమావేశమవుతున్నారు. అక్కడే సగం పంచాయితీ పూర్తవుతోంది. వెళ్లిన వారిలో ఆశావహులు తమ దరఖాస్తులను, సిఫార్సులను ఈ కమిటీకి విన్నవిస్తుంటే అసంతృప్తులు మాత్రం తాము వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేకు మళ్లీ టిక్కెట్టు ఇవ్వవద్దని, కాదని ఇస్తే నియోజకవర్గంలో పార్టీకోసం పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. తమ వెంట తీసుకువెళ్లిన నేతల అవినీతి చిట్టాలను ఆ కమిటీకి సమర్పిస్తున్నారు. ఆ కోవలోనే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు టిక్కెట్టు ఎలా ఇస్తారని, ఈ సారి తనకే ఇవ్వాలని అతని సోదరుడు కొండబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరకు పార్లమెంటు సమీక్షకు సన్నాహాలు ఇక అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షను చంద్రబాబు శనివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లినా అదే పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్నారు. కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిటింగ్‌లు కాగా పార్వతీపురం నియోజకవర్గం ఒక్కటే టీడీపీ చేతిలో ఉంది. కురుపాం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కుటుంబం టిక్కెట్టు ఆశిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్ పోటీకి వస్తున్నారు. వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌కు అరకు ఎంపీ టిక్కెట్టు దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. సాలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య సీటు పోరు నడుస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆమె కూడా చినబాబు ద్వారా సీటు పొందాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. భంజ్‌దేవ్‌పై వచ్చిన ఆవినీతి ఆరోపణల చిట్టాలను అస్త్రాలుగా వాడుతున్నారు. పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులుకు పోటీగా ఇటీవల పార్టీలో చేరిన మరో వర్గం నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో సవరపు జయమణి కూడా ఉన్నారు. వీరి పంచాయితీ ఎలా సాగుతుందో వేచి చూడాలి. పైరవీల జోరు ముందురోజు రాత్రికే అమరావతి చేరుకున్న నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వర కూ అసంతృప్తులు, ఆందోళనలు, డిమాండ్లు వ్యక్తీకరిస్తూ గడిపారు. రాత్రికి గానీ చంద్రబాబు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష మొదలుపెట్టలేదు. సమీ క్షకు ముందే జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అసంతృప్తులు చేస్తున్న ఆందోళనలు, ప్రత్యేక సమావేశాల గురించి తెలుసుకున్న చంద్రబాబు అలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని తీవ్రం గా హెచ్చరించారు. ఎవరైనా పార్టీ వ్యతిరేక సమావేశాలు, కార్యక్రమాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రాత్రి జరిగిన సమీక్షలో చంద్రబాబు సిటింగ్‌లకే మరలా అవకాశం ఇవ్వడానికి మొగ్గుచూపారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అశోక్‌గజపతిరాజునే దాదాపుగా ఖరారు చేశారు. విజయనగరం ఎమ్మెల్యే టిక్కెట్టు సిటింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు ఖాయమైనట్టే కనిపిస్తున్నా... అదంత ఈజీ కాదని తెలుస్తోంది. ఈమెను కాపు వర్గీయులు బలపరుస్తుండగా... మిగిలినవారు వ్యతిరేకిస్తున్నారు. అయితే అదితి గజపతి కొద్దిగా అడ్డుపడుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలో ముఖ్యనేతలు మరోసారి సమావేశమై తేల్చాలని నిర్ణయించారు. -
మృణాళిని మాకొద్దు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మృణా ళినికి సొంత పార్టీ నుంచి తిరుగుబావుటా ఎదు రైంది. ఆమెను కొనసాగించవద్దంటూ పార్టీ నాయ కులు తెగేసి చెబుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చేసే అక్రమాలను చూస్తూ ఊరుకోలే మంటున్నారు. గరివిడి జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ నేతృత్వంలో శనివారం చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, టీడీపీ మండలాధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్, గుర్ల జెడ్పీటీసీ భర్త కిరణ్‌రాజు, ఎంపీపీ సోదరుడు వెన్నె సన్యాసినాయుడులు అదే పార్టీకు చెందిన ఎమ్మెల్యే కిమిడి మృణాళినిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయడం చర్చాంశనీయాంశంగా మారింది. చంద్రబాబు జిల్లాకు వస్తున్న సమయంలో ఓ వైపు బొబ్బిలిలో, మరోవైపు చీపురుపల్లిలో సొంత పార్టీల నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో అసమ్మతి పవనాలు వీస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇవీ కారణాలు: నియోజకవర్గంలో ఔట్ సోర్సింగ్ విధానంలో వందలాది ఉద్యోగ నియామకా లు ఎమ్మెల్యే, ఆమె భర్త జరిపారని, గ్రామీణ విద్యుత్ సహకార సం ఘం (ఆర్ఈసీఎస్) లో 30కుపైగా ఉద్యో గ నియామకాల్లో భారీస్థాయిలోడబ్బు వసూలు చేశారన్న ఆరోపణలను సీఎం దృష్టికి అసంతృప్తి వర్గం తీసుకెళ్లింది. ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, ఎమ్మెల్యే భర్త కిమిడి గణపతిరావులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేసుకున్నారని పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించ లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. పద్ధతి ప్రకారం ఫిర్యాదు.. మృణాళినిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కేవలం నోటి మాటలతో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోలేదు. వారంతా పదవులు కలిగిన వారే కావడంతో వారి లెటర్‌హ్యాడ్‌లపై స్వయంగా ఫిర్యాదులు రాసి, అదనపు కాగితాలు కూడా జతచేసి సీఎంకు ఇచ్చారు. చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు ఏకంగా 12 పేజీల్లో ఎంఎల్ఎపై ఫిర్యాదులు లిఖిత పూర్వకంగా అందజేసినట్టు తెలిసింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వీరికి ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బయిటపడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో అసంతృప్తి వర్గాల తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఈ అసంతృప్తి వర్గాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు విడుదలయ్యే నిధులు, ఎన్నికల ప్రయోజనాల్లో భాగంగా అధిష్టానం దృష్టి తమపై పడేలా చేసుకోవడానికి అసంతృప్తి అస్త్రం ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు అసంతృప్తి వెళ్లగక్కుతూ ఇన్నాళ్లూ జనానికి తామేమీ చేయకపోగా స్వప్రయోజనాలే తమ పరమావధి అనే విషయాన్ని బయటపెడుతున్నారు. -
దేశం శ్రేణుల మధ్య ఫేస్బుక్ చిచ్చు
తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఫేస్బుక్ పోస్టింగ్ వివాదస్పదమైంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ అనుచరుల మధ్య యుద్ధం మొదలైంది. చివరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం...దానికి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడం ఒకదాని తరువాత ఒకటి వరుస పరిణామాలు మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న విబేధాలను బయటపెట్టాయి. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి: జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు అనుచరుడు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినిక క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో ఫేస్బుక్ పోస్టింగ్ చేశాడంటూ పోలీసు శాఖ సుమోటోగా దాన్ని భావించి పోస్టు చేసిన అశోక్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొంది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ వర్గీయులు, మహిళలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి పోలీస్‌స్షేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. న్యాయవాది పూచీకత్తుపై అర్ధరాత్రి 12 తరువాత విడుదల చేసిన పోలీసులు బుధవారం ఉదయం స్టేషన్‌కు రావాలని ఎస్ఐ కాంతికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అశోక్‌తో సహా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అశోక్‌తో పాటు జెడ్పీటీసీ వరహాలనాయుడు వర్గీయులు ఎమ్మెల్యే మృణాళిని కార్యాలయంలో పని చేసే ఉద్యోగి బొత్స గోపీనాధ్, ఆర్ఈసీఎస్ చైర్మన్ కారు డ్రైవర్ గవిడి శ్రీనివాసరావు, పిన్నింటి వివేక్, రాకేష్, రామ్స్లపై ఫిర్యాదు చేశారు.ఆ ఐదుగురు తనను సహనం కొల్పోయేలా ప్రేరేపించారని, భయపెడుతున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మరింత వివాదస్పదమైంది. హార్ట్ పేషెంట్ అని చెప్పినా.... ఫేస్బుక్లో పోస్టింగ్ వివాదాన్ని ఎదుర్కొంటున్న కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టారని ఆరోపించాడు. తాను హార్ట్ పేషెంట్‌నని చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదన్నారు. ఫేస్బుక్లో తాను ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టింగ్‌లు పెట్టలేదని చెప్పాడు. ఐదుగురు యువకులు తనను హింసిస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... ఫేస్బుక్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టినందుకు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్‌ను ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చె ప్పారు. ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే ఫిర్యాదు లేకపోయినా చర్యలు ఉంటాయన్నారు. ఆ పోస్టింగ్‌లు తానే పెట్టినట్లు అశోక్ అంగీకరించినట్లు చెప్పారు. మంగళవారం అశోక్ ఇచ్చిన ఫిర్యాదులో నేరం పట్టదగ్గ అంశాలు లేనందున విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
'43వేల ఎకరాల్లో మొక్కలు'
హైదరాబాద్: వచ్చే ఏడాది 43 వేల ఎకరాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించామని గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఈ ఏడాది లక్షా 26 వేల ఎకరాల్లో మొక్కలు నాటినట్టు ఆమె పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరువుల పూడికతీత కోసం రూ.1346 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి చెప్పారు. 'నీరు - చెట్టు' కార్యక్రమం ద్వారా లక్షా 7 వేల చెరువుల్లో పూడిక తీయించనట్టు ఆమె తెలిపారు. అదే విధంగా 15 కోట్ల 6 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని మంత్రి కిమిడి మృణాళిని ఈ సందర్భంగా తెలిపారు. -
60 పంచాయతీల్లో ఉపాధికి గండి !
- కొత్త ఎఫ్‌ఏలను నియమించకపోవడమే కారణం - సెప్టెంబర్ 2 నుంచి కొత్త నియామకాలు నిలిపివేసిన సర్కారు - వలసబాట పడుతున్న జిల్లా వాసులు - కొత్త నియామకాలకు వెల్లువెత్తుతున్న సిఫార్సులు విజయనగరం మున్సిపాలిటీ : వలసలను నివారించి ఉన్న ఊరిలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ హామీ పథకం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోతోంది. వ్యవసాయ పనులు ముగిసిన అనంతరం జిల్లావ్యాప్తంగా గత ఏడాది నవంబర్ నుంచి 34 మండలాల్లో ఉపాధి పనులు పునఃప్రారంభించినప్పటికీ 60 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు దొరకని పరిస్థితి నెలకొంది. కొత్తవారిని ఇంతవరకూ నియమిం చకపోవడంతో పనులు చూపేవారు లేక ఆయా పంచాయతీల వారు ఉపాధి కోసం వలసబాట పట్టే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలోని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం గమనార్హం. ఉపాధి పనుల్లో అవకతవకలకు, అక్రమాల కు పాల్పడినట్టు సామాజిక తనఖీల ద్వారా గుర్తించి, 60 గ్రామ పంచాయతీలకు చెందిన 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను గత ఏడాది విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తవారిని నియమించలేదు సరికదా.. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ నియామకాలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీల్లో వందలాది మంది వేతనదారులు ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో ఒక గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగిస్తే పక్క పంచాయతీలో వారు విధులు నిర్వహించే ఇన్‌ఛార్జి బాధ్యతలతో నెట్టుకొచ్చేవారు. అయితే ఉపాధిలో అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతుండడంతో అధికారులు ఆధునాత పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్‌కు కేటాయించిన సెల్‌ఫోన్ ద్వారానే ఆ వారంలో ఎంతమంది ఉపాధి పనులకు దరఖాస్తులు చేసుకున్నారు..వారికి కల్పించిన పని వివరాలు, ఉపాధి పనికి వచ్చిన వేలిముద్రలతో హైదరాబాద్‌లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వాహకులకు ప్రతి రోజు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పక్క పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ సెల్‌ఫోన్ సదరు గ్రామ పంచాయతీలోని వేతనదారుల సమాచారాన్ని అంగీకరించకుండా ఉండే విధంగా ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నియామకాలకు సిఫార్సుల వెల్లువ ఖాళీగా ఉన్న 60 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల నియామకాలకు అధికార పార్టీ నేతల సిఫార్సులతో డ్వామా అధికారులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష యంలో రాష్ట్ర మంత్రుల సంతకాలు చేసిన సిఫార్సులు లేఖలు అందుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 2 నుంచి కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, మళ్లీ ఆదేశాల వచ్చిన తరువాతనే నియామకాలు చేపడ తామని అధికారులు చెబుతున్నారు. -
ఈ నెలలోనే ఫేకర్ సమస్య పరిష్కరిస్తా..మంత్రి మృణాళిని
గరివిడి : ఈ నెలాకరుకల్లా ఫేకర్ లాకౌట్‌ను ఎత్తివేసే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణాశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణిళినిని ఫేకర్ కార్మికులు కుటుంబ సభ్యుల తో కలిశారు. ఏడు నెలల కిందట ఫేకర్ పరిశ్రమను లాకౌట్ చేయడంతో పస్తులుండాల్సి వస్తోందని కార్మికు లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంతి స్పందిస్తూ, ఈ నెలలో లేబర్ కమిషనర్, కార్మిక శాఖ మంత్రి, ఫేకర్ యాజమాన్యం, కార్మికుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే కార్మికులు కూడా పట్టు విడుపుతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల వైస్ ఎంపీపీ బలగం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. ‘పెద్ద చెరువుకు శాశ్వత ర్యాంప్ నిర్మించాలి’ విజయనగరం మున్సిపాలిటీ : ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే పైడితల్లమ్మ తెప్పోత్సవానికి పెద్ద చెరువు వద్ద శాశ్వత ర్యాంప్ నిర్మించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీవీ రమణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణా శాఖ మంత్రి కిమిడి మృణాళినికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, తెప్పోత్సవానికి సంబంధించి ప్రతి సం వత్సరం పెద్ద చెరువు వద్ద తాత్కాలిక ర్యాంప్ నిర్మించడానికి డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయితే అవసరం తీరాక పట్టించుకోకపోవడంతో ర్యాంప్ పాడవుతోందన్నారు. ఇప్పటికైనా శాశ్వత ర్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల న్నారు. మినర్వా థియేటర్ నుంచి ఆలయం వరకు, అదేవిధంగా మూడు లాంతర్ల జంక్షన్ నుంచి అర్బన్ బ్యాంకు వరకు తాటాకుల పందిరి వేయాలని కోరారు. పండుగ రోజుల్లో మున్సిపల్ కుళాయిల ద్వారా ఆటం కం లేకుండా నీటి సరఫరా చేపట్టాలన్నారు. వీఐపీ పాస్ లు తగ్గించి సామన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
లక్ష్యం కోసం శ్రమించాలి
విజయనగరం అర్బన్ : లక్ష్యం కోసం శ్రమించాలని అప్పుడే లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలను అందుకోగల మని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఇక్కడ క్షత్రియ కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన బడి పిలుస్తోంది .. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. తొలుత కోట వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడకుండా ఏదీ సాధించలేమని.. లక్ష్యాన్ని చేరుకోడానికి కష్టపడాలన్నారు. ఎన్నికలతోనే రాజకీయూలు పోయూయని, వ్యవస్థను నడిపించేందుకు అందరూ కలిసి పని చేయూలన్నారు. పిల్లల దగ్గరకు వెళ్తే సమస్యలు తెలుస్తాయని.. వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. బడి బయట ఉన్న వారందరినీ బడిలో చేర్పించేందుకు ఉద్దేశించిన బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నీతి కథలకో పీరియడ్... ప్రస్తుత సమాజంలో పిల్లలకు నీతి కథలు బోధించాల్సిన అవసరం ఉందని, అందుకో పీరియడ్ కేటారుుంచాలని మృణాళిని అన్నారు. చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలని, ఇందుకు నీతికథలు దోహదపడతాయని చెప్పారు. ఈ తరానికి నీతిని బోధించేందుకు తప్పనిసరిగా ఒక పీరియడ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యతో పాటు బహిరంగ మల విసర్జనపై అవగాహన కల్పించాలన్నారు. దీనికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అన్ని టాయ్లెట్లు పని చేసేలా చూడాలని, నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలసి సూచించారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ జిల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అంద రం కలిసి పని చేయూలని పిలుపునిచ్చారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు గ్రామాల్లో తిరిగి బడి బయట ఉన్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి పంపించేందుకు ఒప్పించాలన్నారు. బడి బయట ఉన్న వారిని, బాల కార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి బడిలో చేర్పించాలని కోరారు. కేజీబీవీల్లో సుమారు 600 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆడ పిల్లలందరినీ చేర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా మంత్రి చేతుల మీదుగా నీడ్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన విద్యాహక్కు చట్టంపై అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, డీఈఓ కృష్ణారావు, పీఓ శారద, డిప్యూటీ ఈఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైతు రుణాలతోపాటే డ్వాక్రా రుణాలూ..!
డ్వాక్రా రుణాల మాఫీకి తాము కట్టుబడి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వొద్దని బ్యాంకర్లను కోరుతామని చెప్పారు. రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నప్పుడే డ్వాక్రా రుణాల మాఫీపై కూడా నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఇకపై పింఛన్ల మంజూరుకు, ఇళ్ల లబ్ధిదార్ల ఎంపికకు ఆధార్‌ను అనుసంధానం చేస్తామని మృణాళిని తెలిపారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, 50 లక్షల ఇళ్ల లబ్ధిదారులపై జియో టెక్నాలజీ ద్వారా విచారణ జరిపించి అక్రమాలు బయటపడ్డాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ విచారణ పూర్తయ్యాక మాత్రమే కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని మృణాళిని అన్నారు.