లక్ష్యం కోసం శ్రమించాలి | work for aim,says kimidi mrinalini | Sakshi
Sakshi News home page

లక్ష్యం కోసం శ్రమించాలి

Published Sat, Jul 26 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

లక్ష్యం కోసం శ్రమించాలి

లక్ష్యం కోసం శ్రమించాలి

విజయనగరం అర్బన్ : లక్ష్యం కోసం శ్రమించాలని అప్పుడే లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలను అందుకోగల మని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఇక్కడ క్షత్రియ కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన బడి పిలుస్తోంది .. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. తొలుత కోట వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడకుండా ఏదీ సాధించలేమని.. లక్ష్యాన్ని చేరుకోడానికి కష్టపడాలన్నారు. ఎన్నికలతోనే రాజకీయూలు పోయూయని, వ్యవస్థను నడిపించేందుకు అందరూ కలిసి పని చేయూలన్నారు. పిల్లల దగ్గరకు వెళ్తే సమస్యలు తెలుస్తాయని.. వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. బడి బయట ఉన్న వారందరినీ బడిలో చేర్పించేందుకు ఉద్దేశించిన బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
 
నీతి కథలకో పీరియడ్...

ప్రస్తుత సమాజంలో పిల్లలకు నీతి కథలు బోధించాల్సిన అవసరం ఉందని, అందుకో పీరియడ్ కేటారుుంచాలని మృణాళిని అన్నారు. చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలని, ఇందుకు నీతికథలు దోహదపడతాయని చెప్పారు. ఈ తరానికి నీతిని బోధించేందుకు తప్పనిసరిగా ఒక పీరియడ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యతో పాటు బహిరంగ మల విసర్జనపై అవగాహన కల్పించాలన్నారు. దీనికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అన్ని టాయ్‌లెట్లు పని చేసేలా చూడాలని, నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలసి సూచించారు.
 
కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ జిల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అంద రం కలిసి పని చేయూలని పిలుపునిచ్చారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు గ్రామాల్లో తిరిగి బడి బయట ఉన్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి పంపించేందుకు ఒప్పించాలన్నారు. బడి బయట ఉన్న వారిని, బాల కార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి బడిలో చేర్పించాలని కోరారు. కేజీబీవీల్లో సుమారు 600 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆడ పిల్లలందరినీ చేర్పించాలని సూచించారు.

ఇందులో భాగంగా మంత్రి చేతుల మీదుగా నీడ్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన విద్యాహక్కు చట్టంపై అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్‌డీఓ వెంకటరావు, డీఈఓ కృష్ణారావు,  పీఓ శారద, డిప్యూటీ ఈఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement