మృణాళిని మాకొద్దు.! | TDP ZPTC And Activists Rejects kimidi Mrinalini In Cheepurupalli Vizianagaram | Sakshi
Sakshi News home page

మృణాళిని మాకొద్దు.!

Published Mon, Aug 13 2018 1:30 PM | Last Updated on Mon, Aug 13 2018 1:30 PM

TDP ZPTC And Activists Rejects kimidi Mrinalini In Cheepurupalli Vizianagaram - Sakshi

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని

సాక్షిప్రతినిధి, విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మృణా ళినికి సొంత పార్టీ నుంచి తిరుగుబావుటా ఎదు రైంది. ఆమెను కొనసాగించవద్దంటూ పార్టీ నాయ కులు తెగేసి చెబుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చేసే అక్రమాలను చూస్తూ ఊరుకోలే మంటున్నారు. గరివిడి జెడ్పీటీసీ, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బలగం కృష్ణ నేతృత్వంలో శనివారం చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, టీడీపీ మండలాధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్, గుర్ల జెడ్పీటీసీ భర్త కిరణ్‌రాజు, ఎంపీపీ సోదరుడు వెన్నె సన్యాసినాయుడులు అదే పార్టీకు చెందిన ఎమ్మెల్యే కిమిడి మృణాళినిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయడం చర్చాంశనీయాంశంగా మారింది.  చంద్రబాబు జిల్లాకు వస్తున్న సమయంలో ఓ వైపు బొబ్బిలిలో, మరోవైపు చీపురుపల్లిలో సొంత పార్టీల నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో అసమ్మతి పవనాలు వీస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది.

ఇవీ కారణాలు: నియోజకవర్గంలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో వందలాది ఉద్యోగ నియామకా లు ఎమ్మెల్యే,  ఆమె భర్త జరిపారని,  గ్రామీణ విద్యుత్‌ సహకార సం ఘం (ఆర్‌ఈసీఎస్‌) లో 30కుపైగా ఉద్యో గ నియామకాల్లో భారీస్థాయిలోడబ్బు వసూలు చేశారన్న ఆరోపణలను సీఎం దృష్టికి అసంతృప్తి వర్గం తీసుకెళ్లింది. ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ దన్నాన రామచంద్రుడు, ఎమ్మెల్యే భర్త కిమిడి గణపతిరావులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేసుకున్నారని పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించ లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు.

పద్ధతి ప్రకారం ఫిర్యాదు..
మృణాళినిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కేవలం నోటి మాటలతో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోలేదు. వారంతా పదవులు కలిగిన వారే కావడంతో వారి లెటర్‌హ్యాడ్‌లపై స్వయంగా ఫిర్యాదులు రాసి, అదనపు కాగితాలు కూడా జతచేసి సీఎంకు ఇచ్చారు. చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు ఏకంగా 12 పేజీల్లో ఎంఎల్‌ఎపై ఫిర్యాదులు లిఖిత పూర్వకంగా అందజేసినట్టు తెలిసింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వీరికి ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బయిటపడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో అసంతృప్తి వర్గాల తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఈ అసంతృప్తి వర్గాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు విడుదలయ్యే నిధులు, ఎన్నికల ప్రయోజనాల్లో భాగంగా అధిష్టానం దృష్టి తమపై పడేలా చేసుకోవడానికి అసంతృప్తి అస్త్రం ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు అసంతృప్తి వెళ్లగక్కుతూ ఇన్నాళ్లూ జనానికి తామేమీ చేయకపోగా స్వప్రయోజనాలే తమ పరమావధి అనే విషయాన్ని బయటపెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement