Cheepurupalli
-
విజయనగరం: చీపురుపల్లి YSRCP అసెంబ్లీ అభ్యర్థి బొత్స నామినేషన్
-
అందరి చూపు వైఎస్సార్సీపీ వైపే..
చీపురుపల్లి(గరివిడి): జిల్లాలో అందరి చూపు వైఎస్సార్ సీపీవైపే. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తుండడంతో టీడీపీ శ్రేణులు పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నాయి. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధికలగడం, జనబలం మెండుగా ఉండడంతో వైఎస్సార్సీపీలో చేరి ప్రజలకు సేవచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే కోవలో గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నెపురి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బద్రి పాపినాయుడు, మందాడి రాంబాబు, బద్రి లక్ష్మీనారాయణ, కిరాల రాము, పిసిని భవాని, బెల్లాన లక్ష్మిలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో శుక్రవారం చేరాయి. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల గుర్తుకొస్తారని, అనంతరం వారివైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట, సుఖాలను పంచుకోవడం సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు నైజమన్నారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో 600 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా, మళ్లీ ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్, జేఎన్టీయూ వర్సిటీ మంజూరు చేసి ప్రజల చిరకాల కలను సీఎం సాకారం చేశారన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, చీపురుపల్లి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీలు గుడివాడ శ్రీరాములునాయుడు, సర్పంచ్ తమ్మినాయుడు, బార్నాల సూర్యనారాయణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో జోరుగా చేరికలు టీడీపీని వీడుతున్న శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన వెదుళ్లవలస టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన జెడ్పీచైర్మన్, ఎంపీ -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి
చీపురుపల్లి రూరల్: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాటేసిన కాలువ
ఇద్దరు చిన్నారులూ ఐదోతరగతి చదువుతున్నారు. మంచి స్నేహితులు. ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సెలవుపెట్టారు. సరదాగా ఆటల్లో నిమగ్నమయ్యారు. సైకిల్‌పై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. దుస్తులు ఒడ్డున పెట్టి స్నానం కోసం దిగబోయారు. అంతే.. కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరినీ అందని లోకాలకు తీసుకుపోయింది. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. సాక్షి, చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఇజ్జరోతు సతీష్(9) ఖరీదు గౌరీ శంకర్(9) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తోటపల్లి కాలువలో పడి మృతిచెందారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన వీరు పాఠశాలకు సెలవుపెట్టారు. ఆటల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో సైకిల్‌పై తోటపల్లి కాలువ వైపు వెళ్లారు. ఇద్దరూ దుస్తులు తీసి ఒడ్డున పెట్టారు. స్నానానికి దిగబోయి కాలువలో పడిపోయారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం కాలువలోని నీటిలో తేలి ఉండడాన్ని అటువైపుగా వస్తున్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు దిగి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒడున రెండు జతల దుస్తులు కనిపించడంతో మరో విద్యార్థి ఉండొచ్చని భావించి కాలువలో దిగి వెతికారు. కాలువలోని బురదలో కూరుకుపోయిన మరో చిన్నారి మృతదేహం కనిపించడంతో గగ్గోలు పెడుతూ బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మరణంలోనూ వీడని స్నేహం.. వారిద్దరు చిన్నారులు మంచి స్నేహితులు. ఒకటే వయస్సు. మృత్యువులోనూ స్నేహం వీడలేదు. మృతుల్లో సతీష్ తల్లిదండ్రులు శంకరరావు డ్రైవర్ కాగా తల్లి అరుణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తోంది. వీరికి సతీష్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక బిడ్డను మృత్యువు కాటేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వారు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి గౌరీ శంకర్ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నంలు అగ్రహారం గ్రామం రోడ్డు సమీపంలో చిన్నపాటి టిఫిన్ దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. అల్లారుముద్దుగా సాకుతున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో భోరున విలపిస్తున్నారు. దేవుగా ఎందుకిలా చేశావు.. నీకు మేము ఏం అన్యాయం చేశావు... మా పిల్లలను తీసుకుపోయావంటూ ఏడ్చిన తీరు అక్కడివారిని కలచివేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
బాబోయ్... బాలయ్య
-
బాబోయ్... బాలయ్య
సాక్షి, విజయనగరం: చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీరంగం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య వ్యవహారశైలి సొంత పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. వీధి రౌడీలా కంటే హీనంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను చూసి టీడీపీ నేతలే అదిరిపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ‘ఫైటింగ్’పై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా వచ్చిన బాలకృష్ణ.. ఒక్కసారిగా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో కార్యకర్తలు ఫొటో తీసుకోవడానికి ఎగబడ్డంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆయన ఓ కార్యకర్త వెంటపడ్డారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టించి అతడిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లతో తన్ని విశ్వరూపం ప్రదర్శించారు. అక్కడితే ఆగకుండా తిట్ల దండకం మొదలెట్టారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన ప్రచారం చేస్తే నాలుగు ఓట్లు వస్తాయనకుంటే... కార్యకర్తలపై దాడి చేయడం ద్వారా ఉన్న ఓట్లు కూడా పోయేట్టు ఉన్నాయని తలలు పట్టుకుంటున్నారు. (చదవండి: బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..) -
చీపురుపల్లిలో నామినేషన్ వేసిన బొత్స
-
ఒక అసెంబ్లీ... ఇద్దరు ఎమ్మేల్యేలు...
సాక్షి, అమరావతి: ఎన్నికలు మొదలైన తొలి దశకంలో కొన్నిచోట్ల ద్విసభ్య (ఇద్దరు సభ్యుల) నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో ఒకటి ఎస్సీలకు, మరొకటి జనరల్‌కు కేటాయించేవారు. అప్పట్లో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండేచోట్ల ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యేవారు. 1962 ఎన్నికల నుంచి ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. శ్రీకాకుళం, అదే జిల్లాలో పాతపట్నం ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, శృంగవరపుకోట ద్విసభ్య స్థానాలు ఉండేవి. విశాఖ జిల్లాకు వస్తే.. పాడేరు (అప్పట్లో గొలుగొండ), నర్సీపట్నంలో ఈ స్థానాలు ఉండేవి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు (అప్పట్లో పల్లిపాలెం. 2009లో రద్దయిన నియోజకవర్గం), కాకినాడ, అమలాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాలు ద్విసభ్య జాబితాలో ఉండేవి. పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే.. కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం ఉండేవి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ (అప్పట్లో దివి), ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం (ప్రస్తుతం కోవూరు), నెల్లూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు ద్విసభ్య స్థానాలుగా ఉండేవి. కడప జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని, అనంతపురం జిల్లా గుంతకల్లు, కల్యాణదుర్గం, హిందూపూర్, ధర్మవరం, చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకునేవారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉండేది. గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా ద్విసభ్య నియోజకవర్గం లేకపోవటం గమనార్హం. గుర్తుందా! 1967కి ముందు విశాఖ నగరం మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 1967లో ఇది విశాఖ–1, విశాఖ–2 స్థానాలుగా విడిపోయింది. 2009లో ఆ రెండు నియోజకవర్గాలు రద్దవగా, పునర్విభజనతో విశాఖ (తూర్పు), విశాఖ (పశ్చిమ), విశాఖ (దక్షిణం), విశాఖ (ఉత్తరం) నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అదే ఏడాది పరవాడ నియోజకవర్గం రద్దవగా, ఆ స్థానంలో గాజువాక ఏర్పాటైంది. 1955, 62 ఎన్నికల్లో కొండకర్ల నియోజకవర్గం ఉండేది. 1967లో అది రద్దయ్యింది. 1962 ఎన్నికల్లో బొడ్డం నియోజకవర్గం ఉండేది. ఆ తరువాత రద్దయ్యింది. 1955 ఎన్నికల్లో గూడెం (ఎస్టీ) నియోజకవర్గం ఉండేది. 1962 ఎన్నికల్లో అది చింతపల్లి (ఎస్టీ)గా మారింది. 2009 పునర్విభజనలో చింతపల్లి రద్దయి, ఆ స్థానంలో అరకు (ఎస్టీ) ఏర్పాటైంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైన గొలుగొండ 1967లో రద్దయ్యి, పాడేరు (ఎస్టీ) ఏర్పాటైంది. 1967లో ఏర్పడిన జామి నియోజకవర్గం 1978లో రద్దయి పెందుర్తి నియోజకవర్గం తెరపైకి వచ్చింది. -
రెబల్‌తో బోణీ..
సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్‌రాజ్‌కు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ మద్దతు తెలిపారు. -
టీడీపీలో రె‘బెల్స్’
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది.అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ప్రకటించిన ఏడింట్లో అప్పుడే రెండుచోట్ల రెబల్స్‌పుట్టుకొచ్చారు. అందులో ఒకచోట అప్పుడే నామినేషన్‌కూడా వేసేశారు. ఇంకా ప్రకటించాల్సిన రెండింటి విషయంలోనూ వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.అక్కడ కూడా రెబల్స్‌కు అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఇన్ని వివాదాలు తలెత్తితే... ఇక ముందు ముందు ఎలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటాయోనన్నసందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో నామినేషన్ల పర్వం రెబల్స్‌తో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలోనే తడబడుతున్న అధికార పార్టీ ఇప్పటికీ జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గానికి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేకపోతోంది. నాదంటే నాదేనంటూ సీటు కోసం ఈ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నా వారికి అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో తాము వద్దన్న వారికే మరలా టిక్కెట్టు ఇవ్వడంపై తీవ్ర మనస్థాపానికి గురైన టీడీపీ అసంతృప్త నేతలు రెబల్స్‌గా మారుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది. చీపురుపల్లిలో రెబల్‌గా త్రిమూర్తులురాజు చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరాజు సోమవారం రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. త్రిమూర్తులు ఏపీజీవీబీ మేనేజర్, ఆ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో బొత్స సత్యనారాయణపై గద్దె బాబూరావు ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ మృణాళికి పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఇలాగే రెబల్‌గా నామినేషన్ వేశారు. కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అశోక్‌గజపతిరాజు బుజ్జగించి నామినేషన్ వెనక్కుతీసుకునేలా చేశారు. తీరా అశోక్ ఎంపీ అయిన తర్వాత మాటతప్పి త్రిమూర్తులు రాజును మోసం చేశారు. ఐదేళ్లుగా ఇస్తామన్న ఎమ్మెల్సీగానీ, మరే ఇతర పదవిగానీ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుబట్టారు. చివరి నిమిషం వరకూ పోరాడారు. అయినా మళ్లీ పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో మరలా రెబెల్ అవతారం ఎత్తారు. ఈ పట్టుదల చివరి నిమిషం వరకూ ఉంటుందో... లేక అధిష్టానం ఆదేశాలతో విరమించుకుంటారో చూడాలి. ఈసారి పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం పదవి కోసమే ఈ డ్రామాలనే విషయం జనానికి అర్థమై, ఇప్పటి వరకూ ఆయనపై ఉన్న గౌరవాన్ని కోల్పోవాల్సి ఉంటుందని ఆయన వర్గీయులే అభిప్రాయపడుతున్నారు. గజపతినగరంలోనూ అదే తీరు... జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి గజపతినగరం సమస్యాత్మకంగా మారింది. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు వ్యతిరేకంగా అతని సోదరుడు కొండబాబు రెబల్‌గా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్టుపై కూడా అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతోంది. ఇక్కడ కూడా పతివాడ నారాయణస్వామినాయుడు లేదా అతని కుమారుడు అప్పలనాయుడుకు టిక్కెట్టు ఇస్తే టీడీపీలో రెబల్స్ పుట్టుకొచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ప్రశ్నార్థకంగా గీత భవితవ్యం విజయనగరంలో దాదాపుగా టిక్కెట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించుకున్న అశోక్ గజపతి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అదితిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నానని, ఆమెకు కొత్త గనుక వెనకుండి ప్రచారం చేయాలని గీతను కోరారు. తాను ఉండగా ఇదేమిటని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందనే నమ్మకం ఉందని సమాధానం చెప్పి గీత వెనుదిరిగారు. విజయనగరం టిక్కెట్ల ఖరారు బాధ్యతను అశోక్‌కే చంద్రబాబు అప్పగించినందున ఆయన తన కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేగాదు పార్టీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా తన కుమార్తె నామినేషన్ వేసే తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌గా పోటీలో నిలబడాలని గీత వర్గీయులు పట్టుబడుతున్నారు. ఆమె కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనూ సంప్రదింపులు జరుపుతున్నటికీ టీడీపీతో తెరవెనుక పొత్తుల నేపధ్యంలో అశోక్ కుమార్తెకు వ్యతిరేకంగా గీతకు జనసేన టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు. -
పార్టీ ప్రకటనకు ముందే రెబల్‌గా నామినేషన్..
-
తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్..
సాక్షి, అమరావతి: నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు తొలి రోజే తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెబల్స్ నామినేషన్ల పర్వం ఓ వైపు.. పార్టీలో అసమ్మతి నేతల మరోవైపు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మెజారిటీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులే నెలకొనడం టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. రెబల్స్‌ను బుజ్జగించాలని చూస్తున్న టీడీపీ నేతల ప్రయత్నాల ఫలించడంలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి త్రిమూర్తులు రాజు... విజయనగరం: జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్‌పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్‌ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులు రాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం తన నివాసంలో సమావేశమయ్యారు. కిమిడి మృణాళిని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దన్న పార్టీ పట్టించేకోలేదన్నారు. మూడు రోజులుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. (విజయనగరం టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు) త్రిమూర్తులు రాజు నిర్ణయానికి పార్టీలోని మెజారిటీ ప్రజలు అండగా నిలిచారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఓడిపోయేవారికి టికెట్ ఇచ్చిందని.. అందుకే పార్టీని బ్రతికించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు త్రిమూర్తులు రాజు వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు రాజును ఎలాగైనా బుజ్జగించి.. పోటీలో లేకుండా చేయాలనే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ ప్రకటనకు ముందే రెబల్‌గా నామినేషన్.. అనంతపురం: కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండటంతో.. పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్‌గా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే నామినేషన్ వేయడంపై ఆయన వ్యతిరేక వర్గం భగ్గుమంటుంది. హనుమంతరాయ చౌదరి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ తరఫున టికెట్ వచ్చినా.. రాకపోయిన పోటీ చేసి తీరుతానని హనుమంతరాయ చౌదరి స్పష్టం చేశారు. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తాం.. గుంటూరు: తాడికొండ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్‌కు కేటాయించకపోవడం ఆయన వర్గం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్ కేటాయించాలని సీఎం నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడికొండ టికెట్ మాల్యాద్రికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్ ఇవ్వకపోతే.. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి అండతోనే మాల్యాద్రికి సీటు ఇచ్చారని విమర్శిస్తున్నారు. మల్యాద్రి ముసుగులో రాజధానిలో అవినీతికి పాల్పడాలని సుజనా చూస్తున్నారని ఆరోపించారు. మాల్యాద్రిని గ్రామాల్లోకి కూడా రానివ్వమని టీడీపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. తూర్పు గోదావరిలో అసంతృప్త జ్వాలలు.. తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన పలువురు అసంతృప్త నేతలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో వంతల రాజేశ్వరి ఎంపికపై విలీన మండలాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పులపర్తి నారాయణమూర్తికి పి గన్నవరం టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. -
టీడీపీకి గట్టి షాక్ తగిలింది
-
ప్రజాసంకల్పయాత్ర 279వ రోజు చీపురుపల్లి నియోజకవర్గం
-
మృణాళిని మాకొద్దు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మృణా ళినికి సొంత పార్టీ నుంచి తిరుగుబావుటా ఎదు రైంది. ఆమెను కొనసాగించవద్దంటూ పార్టీ నాయ కులు తెగేసి చెబుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చేసే అక్రమాలను చూస్తూ ఊరుకోలే మంటున్నారు. గరివిడి జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ నేతృత్వంలో శనివారం చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, టీడీపీ మండలాధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్, గుర్ల జెడ్పీటీసీ భర్త కిరణ్‌రాజు, ఎంపీపీ సోదరుడు వెన్నె సన్యాసినాయుడులు అదే పార్టీకు చెందిన ఎమ్మెల్యే కిమిడి మృణాళినిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయడం చర్చాంశనీయాంశంగా మారింది. చంద్రబాబు జిల్లాకు వస్తున్న సమయంలో ఓ వైపు బొబ్బిలిలో, మరోవైపు చీపురుపల్లిలో సొంత పార్టీల నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో అసమ్మతి పవనాలు వీస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇవీ కారణాలు: నియోజకవర్గంలో ఔట్ సోర్సింగ్ విధానంలో వందలాది ఉద్యోగ నియామకా లు ఎమ్మెల్యే, ఆమె భర్త జరిపారని, గ్రామీణ విద్యుత్ సహకార సం ఘం (ఆర్ఈసీఎస్) లో 30కుపైగా ఉద్యో గ నియామకాల్లో భారీస్థాయిలోడబ్బు వసూలు చేశారన్న ఆరోపణలను సీఎం దృష్టికి అసంతృప్తి వర్గం తీసుకెళ్లింది. ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, ఎమ్మెల్యే భర్త కిమిడి గణపతిరావులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేసుకున్నారని పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించ లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. పద్ధతి ప్రకారం ఫిర్యాదు.. మృణాళినిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కేవలం నోటి మాటలతో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోలేదు. వారంతా పదవులు కలిగిన వారే కావడంతో వారి లెటర్‌హ్యాడ్‌లపై స్వయంగా ఫిర్యాదులు రాసి, అదనపు కాగితాలు కూడా జతచేసి సీఎంకు ఇచ్చారు. చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు ఏకంగా 12 పేజీల్లో ఎంఎల్ఎపై ఫిర్యాదులు లిఖిత పూర్వకంగా అందజేసినట్టు తెలిసింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వీరికి ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బయిటపడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో అసంతృప్తి వర్గాల తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఈ అసంతృప్తి వర్గాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు విడుదలయ్యే నిధులు, ఎన్నికల ప్రయోజనాల్లో భాగంగా అధిష్టానం దృష్టి తమపై పడేలా చేసుకోవడానికి అసంతృప్తి అస్త్రం ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు అసంతృప్తి వెళ్లగక్కుతూ ఇన్నాళ్లూ జనానికి తామేమీ చేయకపోగా స్వప్రయోజనాలే తమ పరమావధి అనే విషయాన్ని బయటపెడుతున్నారు. -
విసిగిపోయే ప్రాణాలు తీశాడు..
చీపురుపల్లి: భార్య ప్రవర్తనతో విసిగి వేసారిన భర్త ఆలోచన మారిపోయింది. తాను డబ్బులు ఇస్తానని చెప్పినా రాకుండా ప్రియుడితో కలిసి వాహనంపై తిరుగుతోందన్న సమాచారంతో మరింత రగిలిపోయాడు. చివరకు ప్రియుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దర్జాగా వస్తున్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. అంతే కోపం కట్టలు తెంచుకుని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లారీతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆ ఇద్దరినీ హతమార్చాలని భావించాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో పోలీసుల విచారణలో తేలిన అంశమిది. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్యామలరావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న తవిటయ్య భార్య రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్యను పలుమార్లు తవిటయ్య హెచ్చరించాడు. అయినా రమణమ్మ భర్త మాట పెడచెవిన పెట్టింది. ఈ నెల 6వ తేదీన హుజూరాబాద్ నుంచి పర్లాకిమిడికి సిమెంట్ లోడు తీసుకువస్తున్న తవిటయ్య తన భార్య రమణమ్మకు ఫోన్ చేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకు సుభద్రాపురం వస్తే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అలాగే అని చెప్పిన రమణమ్మ మధ్యాహ్నం ఒంటి గంట అయినా సుభద్రాపురం చేరుకోలేదు. ఇంతలో తవిటయ్య ఇంటికి ఫోన్ చేస్తే కుమార్తె ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎప్పుడో బయిలుదేరిపోయిందని తెలిపింది. వెంటనే తవిటయ్య చీపురుపల్లిలో ఉండే తన సహచరులకు ఫోన్ చేస్తే రామకృష్ణతో కలిసి బండిపై వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన తవిటయ్య సుభద్రాపురం నుంచి చీపురుపల్లి వైపు లారీలో వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై తన భార్య రమణమ్మ ప్రియుడు రామకృష్ణతో రావడం చూశాడు. వెంటనే వారిని హతమార్చాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనాన్ని లారీతో బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించిన తవిటయ్యపై 302,304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి ఎస్సైలు టి.కాంతికుమార్, శ్రీనివాస్ ఉన్నారు. -
కనకమహలక్ష్మి ఆలయంలో చోరీ
అమ్మవారి ఆలయంలో దొంగలు చీపురుపల్లి : కోర్కెలు తీర్చే కల్పవల్లి, చీపురుపల్లి ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగుచూడడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఆలయంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే దొంగలు గర్భగుడిలోకి సైతం ప్రవేశించినప్పటికీ ఎలాంటి బంగారు ఆభరణాలు లభించకపోవడంతో దేవాదాయశాఖ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దేవాదాయశాఖ మేనేజర్ జి.శ్రీరామ్మూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి దూరంగా ఉన్న అమ్మవారి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం గొళ్లెం స్క్రూలు విప్పి లోపలికి ప్రవేశించారు. అక్కడ నుంచి గర్భగుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి గొళ్లెం తొలగించి లోపలకి ప్రవేశించారు. అయితే వారికి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో అమ్మవారి విగ్రహంపైనున్న రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై దేవాదాయ శాఖ మేనేజర్ జి. శ్రీరామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి దూరంగా ఆలయం ఉండడంతో బంగారు ఆభరణాలు ఆలయంలో ఉంచడం లేదని మేనేజర్ తెలిపారు. -
ఆకలి తీర్చండి..
చీపురుపల్లి/గరివిడి: నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల ఆకలి మంటలు తీర్చాలని సీఐటీయూ ప్రతినిధులు అంబల్ల గౌరునాయుడు, జంపన విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. ఆకలియూత్ర పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు, మహిళలు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు పాదయూత్ర చేపట్టారు. అనంతరం పట్టణంలోని కొత్త గవిడివీధిలో గల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ ఎస్.రాఘవులు, ఎస్సై టి.కాంతికుమార్ నేతృత్వంలో పోలీసులు కార్మికులు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి పరిశ్రమలు తెరిపించాలి.. కార్మికుల జీవితాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజిన్ కార్యదర్శి అంబల్ల గౌరునాయుడు మాట్లాడుతూ, రెండేళ్లుగా గరివిడిలో ఫేకర్ పరిశ్రమ మూతపడిందన్నారు. దీంతో వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉన్న ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఈ విషయూన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం మంత్రి మృణాళిని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, నానిబాబులకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. -
స్వాహాపై లోకాయుక్తకు...
చీపురుపల్లి: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా మండలంలో బొప్పాయి సాగుకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక నిధుల్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బెల్లాన రవి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులను రక్షించి, అర్హులకు అందజేయాల్సిన తెలుగుదేశం నాయకులే స్వాహాకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. బొప్పాయి సాగు ప్రోత్సాహకాల్లో రూ.కోటి వరకు స్వాహా జరిగిందని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని ముందుగానే ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లినప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు. పైగా ఏడీ ప్రసాద్ ఈ విషయం తన దృష్టికి రాలేదని పత్రికలకు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బొప్పాయి సాగు చేసుకునే అర్హులైన రైతులకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో ఉద్యానవనశాఖ అధికారులు భూములు లేని వారికి, బొప్పాయి మొక్కలు నాటని వారికి, గ్రామాల్లో లేని వ్యక్తులకు ప్రోత్సాహక నిధులు జమ చేయడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీని వెనుక తెలుగుదేశం నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. రాబోయే గ్రీవెన్స్ సెల్‌కు అర్హులైన రైతులతో వెళ్లి కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లనున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కోరాడ సిమ్మినాయుడు, రేవల్ల సత్తిబాబు, కర్రోతి శరత్, కరణం ఆది తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంలో ఫిర్యాదు ఇదిలా ఉండగా ప్రోత్సాహకాల్లో జరుగుతున్న అక్రమాలపై చాలా రోజుల క్రితమే ఉద్యానవనశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పి.కె.పాలవలస గ్రామానికి చెందిన రెల్లి వెంకటేశ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బొప్పాయి సాగుకు ఉద్యానవనశాఖ అధికారులు ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆ శాఖ ఏడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. భూములు లేని రైతులకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఏయే రైతులకు, ఎంతమంది రైతులకు బొప్పాయి ప్రోత్సాహక నిధులు ఇస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని మార్చి 31న సమాచార హక్కు చట్టంద్వారా సమాచారం కోరినట్లు ఆయన తెలిపారు. 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు వివరాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామంలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయిటపడతాయని చెప్పారు. -
విద్యార్థిని అదృశ్యంపై మంత్రి ఫైర్
చీపురుపల్లి (విజయనగరం) : చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యంపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ వేంకటేశ్వర రావు, టీచర్ రజనీ కుమారిలపై సస్పెన్షన్ విధించారు. అదృశ్యానికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. -
ఆదాయంలో రిజిస్ట్రేషన్ శాఖ దూకుడు
గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం ఇలా ఉంది. నెల్లిమర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం కోటీ 86 లక్షల రూపాయలు. కాగా రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. 268.92 శాతంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.39 లక్షలు. రూ.71 లక్షల ఆదాయం సాధించింది. చీపురుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం 2.49 కోట్ల రూపాయలు కాగా, రూ.4.320 కోట్ల రాబడితో మూడోస్థానంలో నిలిచింది. సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం రూ.3.12 కోట్లు కాగా.. రూ.5.19 కోట్లు సాధించింది. గజపతినగరం కార్యాలయం లక్ష్యం 3.44 కోట్ల రూపాయలు కాగా.. రూ.5 కోట్లు సంపాదించింది. విజయనగరం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.16.53 కోట్లు కాగా.. రూ.23 కోట్ల రెండు లక్షల ఆదాయంసాధించి 139.26 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. తెర్లాం కార్యాలయ లక్ష్యం ఒక కోటీ34 లక్షల రూపాయలు కాగా.. కోటీ 83 లక్షల రూపాయలు సంపాదించింది. కొత్తవలస కార్యాలయం లక్ష్యం 11 కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కాగా.. 14.96 కోట్ల రూపాయల ఆదాయంతో 134.86 శాతం పొంది ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కాగా.. నాలుగు కోట్ల 37 లక్షల రూపాయలు సాధించింది. పార్వతీపురం కార్యాలయం లక్ష్యం ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు కాగా, రూ.6 కోట్ల 82 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.25.37 కోట్లు కాగా రూ.27.21 కోట్లు సాధించి 107 శాతం ఆదాయంతో 11వ స్థానంలో నిలిచింది. బొబ్బిలి కార్యాలయం లక్ష్యం 7.98 కోట్ల రూపాయలు కాగా 8.52 కోట్లు సంపాదించింది. విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. లక్ష్యం 24.79 కోట్ల రూపాయలు కాగా.. రూ.23.45 రూపాయలు మాత్రమే సంపాదించింది. 94.58 శాతం ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వందశాతం నుంచి 200 శాతం పైబడి ఆదాయం సాధించడం విశేషం. -
ఆస్పత్రిలో కేంద్రమంత్రి ఆకస్మిక తనిఖీలు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9.30 లకు మంత్రి ఆరోగ్య కేంద్రానికి రాగా ఒక్క వైద్యుడూ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వైద్యులు రావాల్సి ఉంది. ఇక్కడ మొత్తం ఆరుగురు వైద్యులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మంత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంకు వెళ్లారు. -
టీడీపీకి ‘ప్రత్యేకం’గా ఇష్టం లేదు
జగన్ దీక్షకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు వాయిదా పడిన నిరవ ధిక దీక్ష వైఎస్సార్సీపీ నేత ‘బెల్లాన’ చీపురుపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం అధికార తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చునని ఆయన శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధన ఇష్టం లేకనే జగన్మోహన్రెడ్డి దీక్షను అణగదొక్కేందుకు చరిత్రలో ఎన్నడూ లేని చట్టాలను వినియోగించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు జగన్మోహన్రెడ్డి దీక్ష వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.