ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం అధికార తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జగన్ దీక్షకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు
వాయిదా పడిన నిరవ ధిక దీక్ష
వైఎస్సార్‌సీపీ నేత ‘బెల్లాన’
చీపురుపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం అధికార తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చునని ఆయన శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధన ఇష్టం లేకనే జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను అణగదొక్కేందుకు చరిత్రలో ఎన్నడూ లేని చట్టాలను వినియోగించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.