మంత్రి ఇలాకాలో గ్రూపుల గోల | Factionalism in Cheepurupalli TDP | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో గ్రూపుల గోల

Published Wed, Apr 22 2015 2:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

Factionalism in Cheepurupalli TDP

చీపురుపల్లి టీడీపీలో
  భగ్గుమన్న విభేదాలు
 ఎంపీపీ, జెడ్పీటీసీ మధ్య
 తీవ్రస్థాయిలో వర్గపోరు
 కుమ్ములాడుకునే స్థాయిలో విభేదాలు
 
 చీపురుపల్లి : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షా త్తూ రాష్ట్ర మంత్రి కిమిడి వృణాళిని సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీకి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాటకు దిగుతున్నారు. జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు మధ్య ఎంతో కాలంగా ఉన్న అంతర్గత విభేధాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పా ర్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కిమి డి వృణాళిని సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ వర్గీయు లు కుమ్ములాటకు దిగే స్థాయికి ఇరువర్గాల మధ్య విబేధాలు పెరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.
 
  అయితే తొలి నుంచి ఈ రెండు వర్గాల మధ్య సయో ధ్య అంతంతమాత్రంగానే ఉంది. బయటకు మాత్రం ఇరువర్గాల నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తూ.. వస్తున్నారు. తాజాగా జరిగిన సంస్థాగత ఎన్నికలు ఇరువర్గాల మధ్య బహిరంగ కయ్యానికి వేదికయ్యాయి. పట్టణ పార్టీ అధ్యక్షుని పదవి లో చాలా కా లంగా మండల పార్టీ అధ్యక్షుడు రౌతు నారాయణరా వు కొనసాగుతున్నారు. కొద్ది కాలం క్రితమే పార్టీలోకి వచ్చిన జెడ్పీటీసీ మీసాల వరహా ల నాయుడు తన అనుచరుడు, వార్డు మెంబరు గవిడి సురేష్‌కు ఆ పద వి కావాలని పట్టుబట్టారు. దీన్ని రౌతు వర్గీయులు వ్య తిరేకించారు. దీంతో మంత్రి మృణాళిని ఎదుటే యు ద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
 
 అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరువర్గాలు కిందకు దిగే పరిస్థితులు కనిపించడం లేదు. జెడ్పీటీసీ వర్గీయులు అక్కడితో ఆ గకుండా మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పదవుల కోసం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడంతో విషయం మ రింత వేడెక్కింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలో ఉంటారో ఉండరో తెలియని వారికి ఎలా పద వులు ఇస్తామని, ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్నామని రౌతు వర్గం బహిరంగంగా వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం ఎంతోమంది నాయకులు పార్టీలు     మారి తిరిగి వచ్చిన వారేనని, ఏ పార్టీలో ఉన్నామన్నది కా దు, ఉన్న పార్టీ కోసం ఎంతవరకు పని చేస్తున్నామన్నది ముఖ్యమని, అంతేకాకుండా మేజర్ పంచాయతీ తమ చేతిలో ఉందని, ఇక్కడ ఏ పదవి అయినా తమకే సొంతం అంటూ వరహాలనాయుడు వర్గీయులు అం టున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మంత్రి వృణాళిని ఏ విధంగా స్పందిస్తారోనని ఆ పార్టీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
 
 మంత్రి గారూ....సంస్థాగత ఎన్నికలు జరిపించండి
 పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఉల్లంఘించిన నేపథ్యంలో మంత్రి మృణాళిని చొరవ తీసుకుని ఆమె సమక్షంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీటీసీ మీసాల వర్గీయులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చే స్తూనే మంత్రి మృణాళిని నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరహాలనాయుడు వర్గీయులు గవిడి నాగరాజు, గవిడి సురేష్, నారాయణరావు, రొ బ్బి గణేశ్‌తో పాటు రఘు పాత్రుని చంద్రశేఖర్, రొబ్బి రమణ, రొబ్బి చిన్ని, ఆదికృష్ణ, శ్రీరాములు, బోడసిం గి సత్యం తదితరులు మాట్లాడారు.
 
  చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పట్టణ అధ్యక్షుని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. సోమవారం పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాలు లో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సమావేశానికి ముందు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, దన్నా న రామచంద్రుడు, దన్నాన శ్రీరాములు, రౌతు కాము నాయుడు, రౌతు నారాయణరావు సమక్షంలో పార్టీ మండల అధ్యక్షునిగా రౌతు కామునాయుడును, పట్ట ణ పార్టీ అధ్యక్షునిగా గవిడి సురేష్‌ను నిర్ణయిం చడం జరిగిందన్నారు.
 
 అయితే అదే విషయాన్ని మంత్రి మృ ణాళిని సభా వేదికపై చదివి వినిస్తున్న తరుణంలో ఎ న్నికపై రౌతు కామునాయుడు, రౌతు నారాయణరావు అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పట్ట ణ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడో జరిగిపోయిందని, అధిష్టానానికి కూడా పంపించామని వారు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారని, వారికి కూడా ఎప్పుడు ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలియదన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్ర జాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement