Minister kimidi mrunalini
-
మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీ..
భోగాపురం : గృహ నిర్మాణ శాఖా మంత్రి మృణాళిని బుధవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండలపరిషత్ కార్యాలయం, సీహెచ్‌సీ, ఆదర్శపాఠశాలలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఉదయం 10.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఆమె ముందుగా ఎయిర్‌పోర్టు విషయమై సుమారు గంటసేపు సీఐ వైకుంటరావు, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, జెడ్పీటీసీ సభ్యురాలు పడాల రాజేశ్వరిలతో ఎంపీపీ చాంబర్లో చర్చించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది విధుల్లో ఉన్నదీ ఆరా తీశారు. 11.30 గంటలైనా ఎంపీడీఓ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీహెచ్‌సీని పరిశీలించి డయేరియూ రోగులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గదుల కొరతపై వైద్యాధికారి వసుధ మంత్రికి వివరించారు. అక్కడ నుంచి ఆదర్శపాఠశాలకు వెళ్లారు. వంటగది లేకపోవడం, ఆహార పదార్థాలు పెట్టేచోట అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వనం - మనం సామాజిక కార్యక్రమం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 29న ప్రారంభం కానున్న వనం-మనం కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమంగా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని మంత్రి మృణాళిని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా విజయనగరం జిల్లాలో 13 లక్షల మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం సహాయం అందక గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోరుున విషయూన్ని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బదులిచ్చారు. -
ఇరుక్కుపోయిన కలెక్టర్!
► పతాక స్థాయికి చేరిన మృణాళిని, స్వాతిరాణి విభేదాలు ► జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో రహస్య సమావేశం ► సీఎం, అశోక్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న చైర్పర్సన్ వర్గం సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. జిల్లాలో చక్రం తిప్పాలని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి ఉవ్విళ్లూరుతుండగా, తాను చెప్పినట్టు జరగాలని మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు. వీరి మధ్య గొడవ కలెక్టర్ ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి, కలెక్టర్‌ను తీరును తప్పుపడుతూ జెడ్పీ చైర్పర్సన్ వర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం, అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం చైర్పర్సన్ ఛాంబర్లో జరిగిన రహస్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని జిల్లా పాలనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి మధ్య ఏడాదిగా పొసగడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య సమీక్ష వారి మధ్య చిచ్చు రేపింది. ఇటీవల కుమారుడ్ని కోల్పోయిన విజయనగరం జెడ్పీటీసీ తుంపల్లి రమణను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీజనల్ వ్యాధులపై ఒక సమీక్ష నిర్వహించాలని తనను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశించినట్టు జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చెబుతున్నారు. ఆ కారణంతోనే ఒక సమీక్ష నిర్వహించాలని జెడ్పీ సీఈఓ, డీఎంఅండ్హెచ్ఓకు చైర్పర్సన్ సూచించారు. ఆమేరకు సమీక్షా తేదీ( జూలై 28)ని ఖరారు చేశారు. అందులో భాగంగా సోమవారం అటు జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జెడ్పీ చైర్పర్సన్ సమాచారం అందించారు. ఆ తర్వాత హైడ్రామా మొదలయింది. అదే రోజు రాత్రి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ జోక్యం చేసుకుని జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఫోన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో సమావేశం నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దన్నారని కలెక్టర్ చెప్పినట్టు తెలిసింది. అయితే, జెడ్పీ చైర్పర్సన్ సమీక్ష రద్దు చేయడం కుదరదని, నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో సమీక్షకు హాజరు కావద్దని అధికారులకు కలెక్టర్ చెప్పినట్టు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఆదేశించినట్టు గుసగుసలు వినిపించాయి. మొత్తానికి సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతి చెందడంతో సమీక్ష చేసేందుకు అవకాశం లేక సంతాపానికి పరిమితమయింది. ఆ తర్వాత జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో టీడీపీ ప్రజాప్రతినిధులతో రహస్య సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మృణాళిని, కలెక్టర్ ఎం.ఎం.నాయక్ లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కలెక్టర్ తనకు పోన్ చేసి సమీక్ష నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దని చెప్పారని, సమీక్ష నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పినట్టు వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని తెలిపారు. ‘ తనతో మాట్లాడే తీరు ఇదేనా...అంతా ఇగోకు పోకూడదని...కలెక్టర్ ఘాటైనా స్వరంతో అన్నారని, తాను కూడా వెనక్కి తగ్గలేదని జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాట్లాడేది ఇలాగేనా అంటూ కలెక్టర్‌తో గట్టిగా మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి జరిగిన పరిణామాల్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లగా అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని, అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి సమీక్ష నిర్వహించాలని, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్టు కూడా స్వాతిరాణి తన అనుయాయులకు వివరించారు. ఈ సందర్భంలో మంత్రి గ్రూపుగా భావిస్తున్న ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తదితరులు వరుసగా కలెక్టర్, మంత్రి తీరును తప్పు పడుతూ మాట్లాడినట్టు తెలిసింది. జగదీష్ కాస్త ఆచితూచి మాట్లాడినా మిగతా ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలిసింది. కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలైతే తేల్చుకుందామనే దోరణితో మాట్లాడారు. చివరిగా వ్యవహారాన్ని సీఎం దృష్టికి, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లి ఏదొకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. -
మంత్రి ఇలాకాలో గ్రూపుల గోల
చీపురుపల్లి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఎంపీపీ, జెడ్పీటీసీ మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కుమ్ములాడుకునే స్థాయిలో విభేదాలు చీపురుపల్లి : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షా త్తూ రాష్ట్ర మంత్రి కిమిడి వృణాళిని సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీకి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాటకు దిగుతున్నారు. జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు మధ్య ఎంతో కాలంగా ఉన్న అంతర్గత విభేధాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పా ర్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కిమి డి వృణాళిని సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ వర్గీయు లు కుమ్ములాటకు దిగే స్థాయికి ఇరువర్గాల మధ్య విబేధాలు పెరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. అయితే తొలి నుంచి ఈ రెండు వర్గాల మధ్య సయో ధ్య అంతంతమాత్రంగానే ఉంది. బయటకు మాత్రం ఇరువర్గాల నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తూ.. వస్తున్నారు. తాజాగా జరిగిన సంస్థాగత ఎన్నికలు ఇరువర్గాల మధ్య బహిరంగ కయ్యానికి వేదికయ్యాయి. పట్టణ పార్టీ అధ్యక్షుని పదవి లో చాలా కా లంగా మండల పార్టీ అధ్యక్షుడు రౌతు నారాయణరా వు కొనసాగుతున్నారు. కొద్ది కాలం క్రితమే పార్టీలోకి వచ్చిన జెడ్పీటీసీ మీసాల వరహా ల నాయుడు తన అనుచరుడు, వార్డు మెంబరు గవిడి సురేష్‌కు ఆ పద వి కావాలని పట్టుబట్టారు. దీన్ని రౌతు వర్గీయులు వ్య తిరేకించారు. దీంతో మంత్రి మృణాళిని ఎదుటే యు ద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరువర్గాలు కిందకు దిగే పరిస్థితులు కనిపించడం లేదు. జెడ్పీటీసీ వర్గీయులు అక్కడితో ఆ గకుండా మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పదవుల కోసం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడంతో విషయం మ రింత వేడెక్కింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలో ఉంటారో ఉండరో తెలియని వారికి ఎలా పద వులు ఇస్తామని, ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్నామని రౌతు వర్గం బహిరంగంగా వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం ఎంతోమంది నాయకులు పార్టీలు మారి తిరిగి వచ్చిన వారేనని, ఏ పార్టీలో ఉన్నామన్నది కా దు, ఉన్న పార్టీ కోసం ఎంతవరకు పని చేస్తున్నామన్నది ముఖ్యమని, అంతేకాకుండా మేజర్ పంచాయతీ తమ చేతిలో ఉందని, ఇక్కడ ఏ పదవి అయినా తమకే సొంతం అంటూ వరహాలనాయుడు వర్గీయులు అం టున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మంత్రి వృణాళిని ఏ విధంగా స్పందిస్తారోనని ఆ పార్టీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రి గారూ....సంస్థాగత ఎన్నికలు జరిపించండి పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఉల్లంఘించిన నేపథ్యంలో మంత్రి మృణాళిని చొరవ తీసుకుని ఆమె సమక్షంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీటీసీ మీసాల వర్గీయులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చే స్తూనే మంత్రి మృణాళిని నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరహాలనాయుడు వర్గీయులు గవిడి నాగరాజు, గవిడి సురేష్, నారాయణరావు, రొ బ్బి గణేశ్‌తో పాటు రఘు పాత్రుని చంద్రశేఖర్, రొబ్బి రమణ, రొబ్బి చిన్ని, ఆదికృష్ణ, శ్రీరాములు, బోడసిం గి సత్యం తదితరులు మాట్లాడారు. చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పట్టణ అధ్యక్షుని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. సోమవారం పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాలు లో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సమావేశానికి ముందు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, దన్నా న రామచంద్రుడు, దన్నాన శ్రీరాములు, రౌతు కాము నాయుడు, రౌతు నారాయణరావు సమక్షంలో పార్టీ మండల అధ్యక్షునిగా రౌతు కామునాయుడును, పట్ట ణ పార్టీ అధ్యక్షునిగా గవిడి సురేష్‌ను నిర్ణయిం చడం జరిగిందన్నారు. అయితే అదే విషయాన్ని మంత్రి మృ ణాళిని సభా వేదికపై చదివి వినిస్తున్న తరుణంలో ఎ న్నికపై రౌతు కామునాయుడు, రౌతు నారాయణరావు అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పట్ట ణ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడో జరిగిపోయిందని, అధిష్టానానికి కూడా పంపించామని వారు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారని, వారికి కూడా ఎప్పుడు ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలియదన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్ర జాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
జిల్లాలు వారీగా శాండ్ ధరలు వుంటాయి:కిమిడి
-
దళారీల నుంచి రైతులకు రక్షణ
రాష్ట్ర మంత్రి మృణాళిని చీపురుపల్లి : రైతులను దళారీల నుంచి రక్షించేందుకే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమి డి మృణాళిని తెలిపారు. గురువారం పట్టణంలోని వెలు గు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏవిధంగా మద్దతు ధర ఇస్తారు? కొనుగోలు విషయంలో ఏ నిబంధనలు పాటిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దళారీలు వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నే రుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే రైతుల నుంచి ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు ద్వారా కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క బస్తాకు స్వయం సహాయక సంఘాలకు రూ. 35 ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 61 కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. ఎ గ్రేడ్ వంద కిలోల ధాన్యానికి రూ. 1400, కామన్ వైరైటీకి రూ. 1360 మద్దతు ధర చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే ఆ ధర లభిస్తుందన్నారు. వరి పండించే రైతుకు కచ్చితంగా మద్దతు ధర లభించాలన్న ఆశయంతో ప్రభుత్వమే ధాన్యం కొ నుగోలు చేస్తుందన్నారు. రైతులు మోసపోకుండా ఉం డేందుకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మిల్లులు వద్ద కూడా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చునని, మద్దతు ధర మాత్రం మి ల్లర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి ఇదే జిల్లాలోని రేష న్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజ నం తక్కువగా ఉంటుందని, ప్రైవేటు వర్తకులు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని స్థానిక విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న పలువురు సర్పం చులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై స్పందిం చిన మంత్రి రైతులకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ బి. రామారావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావు, తహశీల్దార్పెంటయ్య, జెడ్పీటీసీ వరహాలనాయుడు, ఎంపీపీ కాంతమ్మ, పాల్గొన్నారు.