మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీ..
భోగాపురం : గృహ నిర్మాణ శాఖా మంత్రి మృణాళిని బుధవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండలపరిషత్ కార్యాలయం, సీహెచ్‌సీ, ఆదర్శపాఠశాలలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఉదయం 10.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఆమె ముందుగా ఎయిర్‌పోర్టు విషయమై సుమారు గంటసేపు సీఐ వైకుంటరావు, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, జెడ్పీటీసీ సభ్యురాలు పడాల రాజేశ్వరిలతో ఎంపీపీ చాంబర్‌లో చర్చించారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది విధుల్లో ఉన్నదీ ఆరా తీశారు. 11.30 గంటలైనా ఎంపీడీఓ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీహెచ్‌సీని పరిశీలించి డయేరియూ రోగులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గదుల కొరతపై వైద్యాధికారి వసుధ మంత్రికి వివరించారు. అక్కడ నుంచి ఆదర్శపాఠశాలకు వెళ్లారు. వంటగది లేకపోవడం, ఆహార పదార్థాలు పెట్టేచోట అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వనం - మనం సామాజిక కార్యక్రమం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 29న ప్రారంభం కానున్న వనం-మనం కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమంగా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని మంత్రి మృణాళిని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా విజయనగరం జిల్లాలో 13 లక్షల మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం సహాయం అందక గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోరుున విషయూన్ని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బదులిచ్చారు.