Surprise inspection
-
పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ గురువారం సాయంత్రం పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రధాని మోదీ అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను తనిఖీ చేశారు. నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడారు. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో కల్పించే వివిధ సదుపాయాలను ఆయన పరిశీలించారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత నవంబర్‌కే ఇది పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీనిని మరికొద్ది రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. -
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు
సాక్షి, తిరుపతి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పును స్వయంగా పరిశీలించారు. మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగిపోయినవీ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్ టీటీడీ షరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్‌కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగారు. వాసన బాగా రావడం లేదని వీటిని ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని చైర్మన్ ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెరిపించి నెయ్యి వాసన చూశారు. నెయ్యి నాణ్యతగా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీవారి సేవకులు జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ఛైర్మన్ చూశారు. జీడిపప్పు నాణ్యత ఎలా ఉందని, సేవ ఎన్ని రోజులు చేస్తారు, ఎక్కడి నుంచి సేవకు వచ్చారు అని శ్రీవారి సేవకులతో మాట్లాడారు. స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు ఏటా రూ. 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేశానని ఆయన వివరించారు. సరుకులు టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. -
ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతున్న కేంద్రాల్లో పలువురు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన మాల్ ప్రాక్టీస్ కథనంపై అధికారులు స్పందించారు. ప్రాక్టికల్స్ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను పరిశీలించారు. ఏ కళాశాల నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ప్రాక్టికల్స్ అంటే ఏమిటి.. ఏడాదికి మొత్తం ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయని పలువురు విద్యార్థులను ప్రశ్నించారు. అయితే ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాక్టికల్స్ జరుగుతున్న కేంద్రాలకు ప్రైవేట్ కళాశాలలకు చెందిన వ్యక్తులు ఎందుకొస్తున్నారని ఆర్ఐఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. ప్రాక్టికల్స్‌లో స్కిల్ పర్సన్ల పాత్ర ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వారు పరీక్షలు జరుగుతున్న గదికి ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు సహకరించారని రుజువైతే అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని అన్ని కళాశాలలను తనిఖీ చేస్తామన్నారు. జేసీ – 2 కమలకుమారి తనిఖీలు నగరంలోని కేఏసీ, డీకేడబ్ల్యూ కళాశాలలను కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ – 2 కమలకుమారి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాక్టికల్స్ జరుగుతున్న అన్ని గదులను పరిశీలించారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి హెచ్చరించారు. స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని కళాశాలలు డబ్బులు వసూలు చేసినట్లు తనకు ఫిర్యాదు అందిందని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కళాశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. జంబ్లింగ్ విధానంలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్ బోర్డు కార్యదర్శి అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలు, కళాశాలలపై ఫీజుల నియంత్రణకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ అమలు బాధ్యతను కమిషన్‌కు అప్పజెప్పిందన్నారు. వచ్చే నెల నుంచి కళాశాలలను తనిఖీ చేసి లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఐఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆగ్రహం ప్రాక్టికల్స్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై కలెక్టర్ శేషగిరిబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. పసిగట్టిన ఇంటర్ బోర్డు అధికారులు అన్ని కేంద్రాల్లో గేట్లు మూయించారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని కేంద్రాల వద్ద పోలీసుల పహారా కనిపించింది. -
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం ఆపరేషన్ ముస్కాన్ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 794 బృందాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేపట్టాయి. పోలీసులు, చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపారు. బాలబాలికల అదృశ్య ఘటనలు, చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఘటనలపై పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,774 మంది పిల్లలను గుర్తించగా వారిలో బాలురు 2,378, బాలికలు 396 మంది ఉన్నారు. వారిలో చిరునామా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిరునామా దొరకని వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంసీఐకి చెందిన నలుగురు వైద్యుల బృందంలో మెడికల్ కాలేజీలోని వసతిగృహాలు, ల్యాబోరేటరీలు, లైబ్రరీ, జిమ్, సెమినార్ హాళ్లతోపాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. పెంచిన మెడికల్ సీట్లకు అనుగుణంగా వసతులు, మౌళిక సదుపాయాలపై ఆరా తీశారు. కాలేజీ, ఆస్పత్రుల్లో ప్రాంగణాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయాలతోపాటు ఇన్షేషెంట్ వార్డులను పరిశీలించారు. ప్రతిరోజు జరిగే శస్త్రచికిత్సలు, జననాలు, మరణాలు, అవుట్ పేషెంట్లుకు చెందిన రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి, కళాశాలల్లోని వసతులు, మౌళిక సదుపాయాలపై ఎంసీఐ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్యులు, ట్యూటర్లు, సిబ్బంది కొరతపై కొంత మేర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటకీ రాష్ట్రాలు విడిపోయినా, వైద్యుల విభజన జరగలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వైద్యులు, సిబ్బంది తెలంగాణకు రానున్నారని, అలాగే ఇక్కడి నుంచి మరికొంతమంది ఏపీకి వెళ్ల్లనున్నారని, త్వరలోనే సమస్య అధిగమిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ అధికారులు సర్ధిచెప్పినట్లు తెలిసింది. మంగళవారం కూడా ఎంసీఐ తనిఖీలు కొనసాగుతాయని గాంధీ కాలేజీ ప్రిన్సిపాల్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ మహేష్చంద్రలు తెలిపారు. -
మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీ..
భోగాపురం : గృహ నిర్మాణ శాఖా మంత్రి మృణాళిని బుధవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండలపరిషత్ కార్యాలయం, సీహెచ్‌సీ, ఆదర్శపాఠశాలలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఉదయం 10.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఆమె ముందుగా ఎయిర్‌పోర్టు విషయమై సుమారు గంటసేపు సీఐ వైకుంటరావు, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, జెడ్పీటీసీ సభ్యురాలు పడాల రాజేశ్వరిలతో ఎంపీపీ చాంబర్లో చర్చించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది విధుల్లో ఉన్నదీ ఆరా తీశారు. 11.30 గంటలైనా ఎంపీడీఓ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీహెచ్‌సీని పరిశీలించి డయేరియూ రోగులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గదుల కొరతపై వైద్యాధికారి వసుధ మంత్రికి వివరించారు. అక్కడ నుంచి ఆదర్శపాఠశాలకు వెళ్లారు. వంటగది లేకపోవడం, ఆహార పదార్థాలు పెట్టేచోట అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వనం - మనం సామాజిక కార్యక్రమం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 29న ప్రారంభం కానున్న వనం-మనం కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమంగా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని మంత్రి మృణాళిని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా విజయనగరం జిల్లాలో 13 లక్షల మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం సహాయం అందక గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోరుున విషయూన్ని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బదులిచ్చారు. -
పాలన పల్లెలకు చేరాలి
రాజధానికే పరిమితం కారాదు కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించండి జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులకు సీఎం సూచన బెంగళూరు: జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శులు రాజధానిలోని కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణుల చెంతకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసే దిశగా పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును పర్యవేక్షించినప్పుడే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడి విధానసౌధలో జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘కలెక్టర్లు, జిల్లా సీఈఓలుగా పనిచేసిన అనుభవం ఉందన్న కారణంతోనే మిమ్మల్ని జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులుగా నియమించాము. మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించండి. తద్వారా పాలన వేగవంతం కావడంతో పాటు పాలనా వ్యవహరాల్లో మరింత పారదర్శకతను తీసుకురావచ్చు’ అని సూచించారు. ఇక ఇదే సందర్భంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సరిగ్గా విధులు నిర్వర్తించని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలని, అప్పుడే ఇతర ఉద్యోగుల్లోనూ భయం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘దళారుల’ ప్రాబల్యం పెరిగిపోతోందని ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయని, అందులోనూ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో ఇది మరింత విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి..... మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని విద్యార్థినుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ పురుషోత్తమ్‌ను తక్షణమే సస్పెండ్‌చేయాలని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి భరత్‌లాల్ మీనాను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ‘ఇటీవల నేను మైసూరులో పర్యటించినపుడు మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని ఓ విద్యార్థిని తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి కన్నీరు పెట్టుకుంది. అక్కడ నెలకొన్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయండి. మూడేళ్లలో అతను విద్యార్థినుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేసి తిరిగి విద్యార్థినులకు అందజేయండి’ అని అధికారులను ఆదేశించారు. -
నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు
సికింద్రాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో కలియతిరిగారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో, నారాయణగూడలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో బొంతు రామ్మోహన్ మాట్లాడ్డారు. ఈ సందర్భంగా వారి ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా మేయర్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. అయితే మేయర్ మరో రెండు రోజులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాగే అర్థరాత్రుళ్లు తనిఖీలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. -
బాన్సువాడలో 25 బైక్‌లు స్వాధీనం
బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): బాన్సువాడ మండలం రాజారామ్దుబ్బ, ఎర్రమనుగుట్ట కాలనీల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 25 దొంగిలించిన బైక్‌లను స్వాధీనంచేసుకున్నారు. ఈ తనిఖీల్లో బాన్సువాడ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రన్న కానుకల గౌడన్లు ఆకస్మిక తనిఖీలు
-
ఇక నుంచి ప్రతీ వారం హాస్టల్ నిద్ర
అంగన్వాడీ, పీహెచ్‌సీల్లోనూ ఆకస్మిక తనిఖీలు హన్మకొండ ఆనంద నిలయంలో బస చేసిన కలెక్టర్ హన్మకొండ : వసతి గృహాల్లోని సమస్యలు తెలుసుకోవడానికే హాస్టల్ నిద్ర చేస్తున్నట్టు కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో అధికారులు గురువారం హాస్టల్ నిద్ర చేయగా, హన్మకొం డ బాలసముద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృ హం(ఆనంద నిలయం)లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు హాస్టళ్లను సందర్శించడం ద్వారా సమస్యలు తెలుస్తాయ ని.. తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతీవారం హాస్టల్నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా త నిఖీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, మొదటిసారి కు రవిలో హాస్టల్ నిద్ర చేశానని, ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల హన్మకొండలో చేయాల్సి వచ్చిందని వివరించారు. హాస్టల్ బాగుంది... ‘ఆనంద నిలయం వసతి గృహం బాగుంది. హాస్టల్ గదులకు పెయింట్ వేయించడంతో అందంగా కనిపిస్తోంది. అన్ని హాస్టళ్లను ఇదేతీరుగా తయారు చేయిస్తాం. ఇతర హాస్టళ్ల వార్డెన్లను ఇక్కడకు పిలిపించి చూ పించాలి. ఇందుకు ఏర్పాట్లు చేయండి’ అని సమాచా ర శాఖ ఏడీ జగన్‌కు కలెక్టర్ కరుణ ఈ సందర్భంగా సూచించారు. హాస్టల్ నిద్ర చేపట్టిన కలెక్టర్ ఆనంద నిలయం వద్దకు రాత్రి 9.15 గంటల కు చేరుకున్నా రు. వాహనంలో కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన అనంతరం 9.20 గంటలకు హాస్టల్లోకి ప్రవేశించారు. హాస్టల్ గదులను పరిశీలించి బాగున్నాయని కితాబి చ్చారు. విద్యార్థులతో మాట్లాడి ఏం చదువుతున్నారని ప్రశ్నించ గా.. ఆహారపదార్థాల్లో కల్తీపై చదువుతున్నామని తెలిపారు. ధనియాల పొడిలో రంపపుపొడి కలుపుతున్నట్లు ఉందని చెబుతూ పుస్తకాన్ని చూపించారు. ఆ తర్వాత ఒక్కో గదిని కలియతిరిగిన ఆమె విద్యార్థులను ఏం చదువుతున్నారు, ఏ పాఠశాలలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు ఐదో తరగతి విద్యార్థిని షియోని పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమె కలెక్టర్‌కు చాక్లెట్ ఇవ్వగా.. కలెక్టర్ శుభాకాంక్ష లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినులతో పాటలు పాడించిన కలెక్టర్ వారితో తన సెల్ఫోన్లో సెల్ఫీలు దిగారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. -
గస్తీ సిబ్బందికి ‘నేర’ పరీక్ష
పాత నేరస్తులపై నిత్యం నిఘా క్షేత్రస్థాయి సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యత నగరంలోని ఎంఓ క్రిమినల్స్ జాబితా సిద్ధం నేరస్తుల వివరాలు అప్డేట్ వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు రోటీన్‌గా సాగిపోతున్న గస్తీ విధానాలను సమగ్రంగా మార్చడానికి నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే ఎంఓ క్రిమినల్స్‌ను పర్యవేక్షించే బాధ్యతల్ని బ్లూకోల్ట్స్, రక్షక్‌లకు అప్పగించారు. వచ్చేవారం నుంచి ఆకస్మిక తనిఖీల ద్వారా వీరి పనితీరును పరీక్షించాలని కొత్వాల్ నిర్ణయించారు. మంగళవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన కొన్నేళ్ల గణాంకాలు, నేరాలను విశ్లేషిస్తే అధిక శాతం పాతవారి ‘పని’గానే తేలింది. వీరిపై కన్నేసి ఉంచితే నేర నిరోధం సాధ్యమని ఉన్నతాధికారులు భావించారు. దీనికోసం ‘ఎంఓ క్రిమినల్స్ డేటాబేస్’ రూపొందించారు. - సాక్షి, సిటీబ్యూరో ఠాణాల వారీగా వివరాలు.. నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన దశాబ్ద కాలంలో 50 వేలకు పైగా నేరగాళ్లు అరెస్టయ్యారు. వీరిలో దాదాపు 30 వేల మంది పదేపదే ఒకే తరహా నేరాలు చేసి చిక్కిన వారున్నారు. పోలీసు పరిభాషలో వీరిని ‘ఎంఓ క్రిమినల్స్’గా పరిగణిస్తారు. వీరికి సంబంధించి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో డేటాబేస్ రూపొందింది. దీనిపై దృష్టి పెట్టిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి నేరగాళ్లపై నిఘాకు దాన్నే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ 30 వేల మంది వివరాలను విశ్లేషించి వారు నివసిస్తున్న ప్రాంతాల వారీగా జాబితా రూపొందించి వాటిని క్షేత్రస్థాయిలోని రక్షక్, బ్లూకోల్డ్స్ సిబ్బందికి అందించారు. నిత్యం ‘సందర్శించాల్సిందే’.. ఠాణాల వారీగా గస్తీ తిరిగే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బంది ఇకపై నిత్యం కచ్చితంగా తమ పరిధిలోని ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు. ఆ నేరగాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అతడి జీవన సరళి.. కదలికల వివరాలు సేకరించడంతో పాటు సమీపంలో ఉండే బంధువులు, స్నేహితుల ఇళ్లకూ వెళ్లి ఆరా తీయాలని ఆదేశించారు. 30 వేల ఎంఓ క్రిమినల్స్ వివరాలను జోనల్, నేరం ప్రాతిపదిన విడిగా ప్రత్యేక జాబితాలు రూపొందించారు. వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు ఎంఓ నేరగాళ్లపై నిఘా కోసం తెరిచే సస్పెక్ట్ షీట్స్ సాధారణంగా వారు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని ఠాణాలో ఉంటాయి. అయితే, కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేయట్లేదు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఇతడి విషయం తెలియట్లేదు. ఎంఓ క్రిమినల్స్ డేటా అప్డేట్ చేస్తున్న అధికారులు ఇలాంటివి గుర్తించినపుడు ఆయా షీట్స్‌ను పాత నేరగాళ్లు పంజా విసురుతున్న ప్రాంతాల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నారు. గస్తీ సిబ్బంది బీట్ల వారీగా తమ ప్రాంతంలో నివసిస్తున్న అందరి నేరగాళ్లను ‘సందర్శించడానికి’ ఉన్నతాధికారులు వారం రోజుల గడువిచ్చారు. ఆ తరవాత కొత్వాల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ఎవరైనా హఠాత్తుగా ఓ గస్తీ బృందం దగ్గరకు వెళ్లి జాబితాలోని ఓ నేరగాడి ఇంటికి తీసుకెళ్లమనో, అతడి ప్రస్తుత వ్యవహారాలు చెప్పమనో కోరతారు. ఇందులో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కొత్వాల్ హెచ్చరించారు. చిరునామా మారితే అప్డేట్.. ఈ నిందితుల్ని ఒక్కోసారి ఒక్కో ఠాణా అధికారులు అరెస్టు చేస్తుంటారు. అలా అరెస్టయిన సందర్భంలో వీరు పేర్లు, చిరునామాలు మార్చి చెప్తుంటారు. ఈ లోపాన్ని సరిచేయడానికి రికార్డుల్లో ఉన్న చిరునామాలో సదరు పాత నేరగాడు లేకుంటే.. ఆ విషయాన్ని అధికారులకు తెలిపి స్థానిక పోలీసుల సాయంతో కొత్త చిరునామా గుర్తించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిదే. చిరునామా సరైనదై, ఆ నేరగాడు వరుసగా కొన్ని రోజుల పాటు అందుబాటులో లేకుంటే ఇప్పటికీ నేరాలు చేస్తున్నట్లు అనుమానించి ప్రత్యేక జాబితాలో చేర్చి దర్యాప్తు చేపడతారు.