ఇక నుంచి ప్రతీ వారం హాస్టల్ నిద్ర
అంగన్‌వాడీ, పీహెచ్‌సీల్లోనూ ఆకస్మిక తనిఖీలు
హన్మకొండ ఆనంద నిలయంలో బస చేసిన కలెక్టర్
హన్మకొండ : వసతి గృహాల్లోని సమస్యలు తెలుసుకోవడానికే హాస్టల్ నిద్ర చేస్తున్నట్టు కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో అధికారులు గురువారం హాస్టల్ నిద్ర చేయగా, హన్మకొం డ బాలసముద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృ హం(ఆనంద నిలయం)లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు హాస్టళ్లను సందర్శించడం ద్వారా సమస్యలు తెలుస్తాయ ని.. తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతీవారం హాస్టల్‌నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా త నిఖీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, మొదటిసారి కు రవిలో హాస్టల్ నిద్ర చేశానని, ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల హన్మకొండలో చేయాల్సి వచ్చిందని వివరించారు.
హాస్టల్ బాగుంది...
‘ఆనంద నిలయం వసతి గృహం బాగుంది. హాస్టల్ గదులకు పెయింట్ వేయించడంతో అందంగా కనిపిస్తోంది. అన్ని హాస్టళ్లను ఇదేతీరుగా తయారు చేయిస్తాం. ఇతర హాస్టళ్ల వార్డెన్లను ఇక్కడకు పిలిపించి చూ పించాలి. ఇందుకు ఏర్పాట్లు చేయండి’ అని సమాచా ర శాఖ ఏడీ జగన్‌కు కలెక్టర్ కరుణ ఈ సందర్భంగా సూచించారు. హాస్టల్ నిద్ర చేపట్టిన కలెక్టర్ ఆనంద నిలయం వద్దకు రాత్రి 9.15 గంటల కు చేరుకున్నా రు. వాహనంలో కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన అనంతరం 9.20 గంటలకు హాస్టల్‌లోకి ప్రవేశించారు. హాస్టల్ గదులను పరిశీలించి బాగున్నాయని కితాబి చ్చారు. విద్యార్థులతో మాట్లాడి ఏం చదువుతున్నారని ప్రశ్నించ గా.. ఆహారపదార్థాల్లో కల్తీపై చదువుతున్నామని తెలిపారు. ధనియాల పొడిలో రంపపుపొడి కలుపుతున్నట్లు ఉందని చెబుతూ పుస్తకాన్ని చూపించారు. ఆ తర్వాత ఒక్కో గదిని కలియతిరిగిన ఆమె విద్యార్థులను ఏం చదువుతున్నారు, ఏ పాఠశాలలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు ఐదో తరగతి విద్యార్థిని షియోని పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమె కలెక్టర్‌కు చాక్లెట్ ఇవ్వగా.. కలెక్టర్ శుభాకాంక్ష లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినులతో పాటలు పాడించిన కలెక్టర్ వారితో తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు దిగారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు.