నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు | Mayor bonthu rammohan Surprise inspection at hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు

Published Sat, Mar 26 2016 7:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు

నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు

సికింద్రాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్‌లో కలియతిరిగారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో, నారాయణగూడలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో బొంతు రామ్మోహన్ మాట్లాడ్డారు.

ఈ సందర్భంగా వారి ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా మేయర్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. అయితే మేయర్ మరో రెండు రోజులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాగే అర్థరాత్రుళ్లు తనిఖీలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement