కుషాయిగూడ: తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మేయర్ బొంతు రాంమోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీ‹Ùరావుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన వారికి కాకుండా ఉద్యమ నాయకులు, పార్టీ అభ్యున్నతి కోసం అహరి్నశలు కష్టపడ్డవారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. నగర మేయర్‌గా గ్రేటర్ అభివృద్దితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కలి్పస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment