సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నగరంలో పట్టు పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, సీఎం రేవంత్‌ను కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బీఆర్‌ఎస్‌పై బొంతు రామ్మోహన్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్‌ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్‌లో అసంతృప్తి రగిలింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా?
Comments
Please login to add a commentAdd a comment