రాష్ట్ర మంత్రి మృణాళిని
చీపురుపల్లి : రైతులను దళారీల నుంచి రక్షించేందుకే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమి డి మృణాళిని తెలిపారు. గురువారం పట్టణంలోని వెలు గు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏవిధంగా మద్దతు ధర ఇస్తారు? కొనుగోలు విషయంలో ఏ నిబంధనలు పాటిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దళారీలు వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నే రుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే రైతుల నుంచి ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు ద్వారా కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఒక్కొక్క బస్తాకు స్వయం సహాయక సంఘాలకు రూ. 35 ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 61 కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. ఎ గ్రేడ్ వంద కిలోల ధాన్యానికి రూ. 1400, కామన్ వైరైటీకి రూ. 1360 మద్దతు ధర చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే ఆ ధర లభిస్తుందన్నారు. వరి పండించే రైతుకు కచ్చితంగా మద్దతు ధర లభించాలన్న ఆశయంతో ప్రభుత్వమే ధాన్యం కొ నుగోలు చేస్తుందన్నారు.
రైతులు మోసపోకుండా ఉం డేందుకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మిల్లులు వద్ద కూడా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చునని, మద్దతు ధర మాత్రం మి ల్లర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి ఇదే జిల్లాలోని రేష న్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజ నం తక్కువగా ఉంటుందని, ప్రైవేటు వర్తకులు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని స్థానిక విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న పలువురు సర్పం చులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై స్పందిం చిన మంత్రి రైతులకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ బి. రామారావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావు, తహశీల్దార్‌పెంటయ్య, జెడ్పీటీసీ వరహాలనాయుడు, ఎంపీపీ కాంతమ్మ, పాల్గొన్నారు.
దళారీల నుంచి రైతులకు రక్షణ
Published Fri, Nov 28 2014 3:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement