Buy grain centers
-
రైతులపై ఖాకీ జులుం..!
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తమాషా చేస్తున్నారా.. కొడుకుల్లారా అంటూ బూతుపురాణం లంకించుకుని కర్షకులపై విరుచుకుపడ్డారు. పోలీసుల తీరుతో కంగుతిన్న అన్నదాతలు భయాందోళనతో పరుగులు తీసినా.. దొరికిన వారిని పిడిగుద్దులతో చొక్కా కాలర్ పట్టుకుని సుమోల్లో కుక్కేశారు. నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ఇటీవల పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించి పంటను కొనడానికి ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో నాలుగు ఐదు రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు విసిగివేశారు. చేసేదేమీ లేక మంగళవారం మార్కెట్ యార్డు ఎదుట ధర్నాకు దిగారు. వెంట నే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు. కనీసం సమాధానం చెప్పే వారు లేకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫి క్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని.. మార్కెట్ యార్డు ఎదుట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్న సమాచారం పోలీసులు తెలుసుకుని టూటౌన్ సీఐ భాషా తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వవచ్చీ రావడంతోనే బూతుపురాణంతో ఊగిపోయిన తీరును చూసిన రైతులు కంగుతిని పరుగులు తీశారు. పంటను కొనుగోలు చేయాలని రోడ్డెక్కితే కొడతారా అంటూ పలువురు రైతులు ప్రశ్నించడంతో పిడిగుద్దులు గుద్దుతూ.. చొక్కా కాలర్ పట్టుకుని సుమోల్లోకి బలవంతంగా నెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కర్షకుల ఆగ్రహం పోలీసుల తీరుతో బిక్కుబిక్కుమంటూ మార్కెట్ యార్డులోకి పరుగులు తీసి దాక్కున్నారు. గతంలో ఎప్పుడు కూడా ధాన్యం అమ్మకం కోసం వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాల్లో పోలీ సులు రైతులపై జులం ప్రదర్శించిన దాఖలా లు లేవు. వ్యవసాయ శాఖ, మార్కెట్, పోలీసు అధికా రులు రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేయించే వారు. కానీ మంగ ళవారం రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తే పోలీసులతో కొట్టించడం ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పండుగ రోజు కూడా మార్కెట్‌యార్డులోనే పండుకొవాల్సి వస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. పత్తాలేని అధికారులుధాన్యం కొనాలంటూ రైతులు ధర్నా చేస్తున్నా కనీసం సమాధానం చెప్పడానికి ఏ ఒక్క శాఖ అధికారి కూడా అక్కడి రాలేదు. అధికారులు పత్తా లేకపోవడం, పోలీసులు తీరును రైతులు నిరసిస్తున్నారు. ఐదారు రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు సమాధానం చెప్పి పంపించాల్సిన సంబం ధిత అధికారులు అడ్రస్ లేకుండా పోయారు. ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాల్సిన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు ఉపక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాతలంటే అంత అలుసా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారా..? ఐదారు రోజుల నుంచి ధాన్యం కొనడం లేదు. విసుగొచ్చి ధర్నా చేస్తే పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారా. రైతులంటే అంత చులకనగా ఉంది. రైతులను పట్టించుకునే వారు లేకుండా పోయారు.– నల్లబోతు మారయ్య, అనంతరం ఎన్ని రోజులు చూడాలి ధాన్యం అమ్ముకోవడానికి ఎన్ని రోజులు చూడాలి. తేమ ఉందంటూ పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనాలంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. రైతు బాధలను నాయకులు , అధికారులు పట్టించుకోవడం లేదు.– అండాలు, పిట్టంపల్లి -
దళారీల నుంచి రైతులకు రక్షణ
రాష్ట్ర మంత్రి మృణాళిని చీపురుపల్లి : రైతులను దళారీల నుంచి రక్షించేందుకే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమి డి మృణాళిని తెలిపారు. గురువారం పట్టణంలోని వెలు గు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏవిధంగా మద్దతు ధర ఇస్తారు? కొనుగోలు విషయంలో ఏ నిబంధనలు పాటిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దళారీలు వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నే రుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే రైతుల నుంచి ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు ద్వారా కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క బస్తాకు స్వయం సహాయక సంఘాలకు రూ. 35 ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 61 కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. ఎ గ్రేడ్ వంద కిలోల ధాన్యానికి రూ. 1400, కామన్ వైరైటీకి రూ. 1360 మద్దతు ధర చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే ఆ ధర లభిస్తుందన్నారు. వరి పండించే రైతుకు కచ్చితంగా మద్దతు ధర లభించాలన్న ఆశయంతో ప్రభుత్వమే ధాన్యం కొ నుగోలు చేస్తుందన్నారు. రైతులు మోసపోకుండా ఉం డేందుకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మిల్లులు వద్ద కూడా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చునని, మద్దతు ధర మాత్రం మి ల్లర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి ఇదే జిల్లాలోని రేష న్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజ నం తక్కువగా ఉంటుందని, ప్రైవేటు వర్తకులు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని స్థానిక విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న పలువురు సర్పం చులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై స్పందిం చిన మంత్రి రైతులకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ బి. రామారావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావు, తహశీల్దార్పెంటయ్య, జెడ్పీటీసీ వరహాలనాయుడు, ఎంపీపీ కాంతమ్మ, పాల్గొన్నారు. -
టార్పాలిన్.. సొమ్ము తినేసెన్
* రూ.42 లక్షలకు రెక్కలు * అస్మదీయుల కోసం అధికారుల ఆరాటం ఏలూరు సిటీ : ఒక వస్తువు కొనాలంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆ వస్తువు ధర ఏ దుకాణంలో ఎంత ఉందో వాకబు చేస్తారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అత్తసొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా ఏకంగా రూ.42 లక్షలను తమ వారి జేబుల్లో వేసేందుకు సిద్ధమైపోయారు. ఇదీ అవినీతి అసలు కథ ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆయా కేంద్రాలకు ప్లాస్టిక్ టార్పాలిన్స్ సమకూర్చాలని నిర్ణయించింది. ఇక్కడే అధికారులు తమ చేతివాటాన్ని పక్కాగా ప్రదర్శించారు. మార్కెట్లో నాణ్యమైన ప్లాస్టిక్ టార్పాలిన్ రూ.4,200కు లభిస్తోంది. అధికారులు మాత్రం ఏకంగా దానిధర రూ.5,500కు కోట్ చేసిన టెండరుదారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు. గతంలోనూ ఇంతకంటే తక్కువ ధరకే ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయగా, కుదరదని చెప్పి దాన్ని రద్దు చేశారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకే తొలి టెండర్‌ను రద్దుచేసి రెండోసారి టెండర్లు పిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3,264 ప్లాస్టిక్ టార్పాలిన్స్ అవసరం ఉంది. ఇది ఒక్కొక్కటి 129 సైజులో ఉండాలని నిర్దేశించారు. నాణ్యతతో కూడిన ఈ సైజు టార్పాలిన్ ధర మార్కెట్లో రూ.4,200 ఉంది. వీటి కొనుగోలు కోసం సివిల్ సప్లైస్, మార్కెటింగ్, తూనికలు-కొలతలు, డీఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. అక్టోబర్ 30న తొలిసారి టెండర్లు పిలవగా 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు దాఖలు చేశారు. ఒంగోలుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్కు రూ.4,908 ధర కోట్ చేస్తూ టెండర్ సమర్పించారు. అధికారులు ఆ ధర అధికమంటూ దానిని రద్దు చేశారు. ఈనెల 11న మరోసారి టెండర్లు పిలవగా, ఐదుగురు దరఖాస్తులు సమర్పించారు. వారిలో యూనివర్సల్ ట్రేడర్స్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్‌ను రూ.4,600కు, అమలాపురానికి చెందిన రుద్ర ఏజెన్సీస్ రూ.5,500కు సరఫరా చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాయి. అయితే, అధికారులు రూ.5,500 ధరను కోట్ చేసిన రుద్ర ఏజెన్సీస్ టెండర్‌ను ఆమోదించారు. మార్కెట్లో రూ.4200లకే దొరుకుతున్న టార్పాలిన్‌ను కాంట్రాక్టర్ నుంచి రూ.5,500కు కొనేందుకు నిర్ణయించడం ద్వారా ఒక్కో టార్పాలిన్‌పై అదనంగా రూ.1,300 చొప్పున రూ.42 లక్షలను గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మార్కెటింగ్ ఏడీ కిషోర్‌ను వివరణ కోరగా, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా వాటర్ ప్రూఫ్ టార్పాలిన్ కావాలని సివిల్ సప్లైస్ అధికారులు చెప్పారన్నారు. జిల్లా అధికారుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించామని, ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు.