నల్లగొండ : మార్కెట్ వద్ద రైతు కాలర్ పట్టి తీసుకెళ్తున్న పోలీసులు, నల్లగొండ : వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేస్తున్న రైతులు
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తమాషా చేస్తున్నారా.. కొడుకుల్లారా అంటూ బూతుపురాణం లంకించుకుని కర్షకులపై విరుచుకుపడ్డారు. పోలీసుల
తీరుతో కంగుతిన్న అన్నదాతలు భయాందోళనతో పరుగులు తీసినా.. దొరికిన వారిని పిడిగుద్దులతో చొక్కా కాలర్ పట్టుకుని సుమోల్లో కుక్కేశారు.
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ఇటీవల పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించి పంటను కొనడానికి ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో నాలుగు ఐదు రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు విసిగివేశారు. చేసేదేమీ లేక మంగళవారం మార్కెట్ యార్డు ఎదుట ధర్నాకు దిగారు. వెంట నే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు. కనీసం సమాధానం చెప్పే వారు లేకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫి క్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం తెలుసుకుని..
మార్కెట్ యార్డు ఎదుట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్న సమాచారం పోలీసులు తెలుసుకుని టూటౌన్ సీఐ భాషా తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వవచ్చీ రావడంతోనే బూతుపురాణంతో ఊగిపోయిన తీరును చూసిన రైతులు కంగుతిని పరుగులు తీశారు. పంటను కొనుగోలు చేయాలని రోడ్డెక్కితే కొడతారా అంటూ పలువురు రైతులు ప్రశ్నించడంతో పిడిగుద్దులు గుద్దుతూ.. చొక్కా కాలర్ పట్టుకుని సుమోల్లోకి బలవంతంగా నెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కర్షకుల ఆగ్రహం
పోలీసుల తీరుతో బిక్కుబిక్కుమంటూ మార్కెట్ యార్డులోకి పరుగులు తీసి దాక్కున్నారు. గతంలో ఎప్పుడు కూడా ధాన్యం అమ్మకం కోసం వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాల్లో పోలీ సులు రైతులపై జులం ప్రదర్శించిన దాఖలా లు లేవు. వ్యవసాయ శాఖ, మార్కెట్, పోలీసు అధికా రులు రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేయించే వారు. కానీ మంగ ళవారం రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తే పోలీసులతో కొట్టించడం ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పండుగ రోజు కూడా మార్కెట్‌యార్డులోనే పండుకొవాల్సి వస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు.
పత్తాలేని అధికారులుధాన్యం కొనాలంటూ రైతులు ధర్నా చేస్తున్నా కనీసం సమాధానం చెప్పడానికి ఏ ఒక్క శాఖ అధికారి కూడా అక్కడి రాలేదు. అధికారులు పత్తా లేకపోవడం, పోలీసులు తీరును రైతులు నిరసిస్తున్నారు. ఐదారు రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు సమాధానం చెప్పి పంపించాల్సిన సంబం ధిత అధికారులు అడ్రస్ లేకుండా పోయారు. ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాల్సిన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు ఉపక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాతలంటే అంత అలుసా అని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారా..?
ఐదారు రోజుల నుంచి ధాన్యం కొనడం లేదు. విసుగొచ్చి ధర్నా చేస్తే పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారా. రైతులంటే అంత చులకనగా ఉంది. రైతులను పట్టించుకునే వారు లేకుండా పోయారు.– నల్లబోతు మారయ్య, అనంతరం
ఎన్ని రోజులు చూడాలి
ధాన్యం అమ్ముకోవడానికి ఎన్ని రోజులు చూడాలి. తేమ ఉందంటూ పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనాలంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. రైతు బాధలను నాయకులు , అధికారులు పట్టించుకోవడం లేదు.– అండాలు, పిట్టంపల్లి
Comments
Please login to add a commentAdd a comment