
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని షబాబ్ బిల్డింగ్స్ ప్రాంతంలో క్రాంతి అనే వ్యక్తి, అతని అనుచరులు జరిపిన కాల్పుల్లో రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే టప్పాచబుత్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment