Brokerage
-
జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్ వాల్యూమ్స్ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్లకు ఇక ‘ఎక్స్పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు!డెరివేటివ్ ట్రేడింగ్ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్ వన్ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్ 1 నుంచి క్యాష్ మార్కెట్ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్అండ్ఓ వాల్యూమ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి పేర్కొన్నారు.కొన్నేళ్లుగా హవా... గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్ ‘బ్రోకరేజ్’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. రూ. 2,000 కోట్ల చిల్లు... మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్ రేట్ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్ బ్రోకరేజ్ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ పేర్కొనడం విశేషం! సెబీ కీలక మార్పులు... ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్ లిమిట్లను తప్పనిసరిగా పర్యవేక్షించడంబ్రోకరేజీలు ఆప్షన్ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాల తొలగింపు. ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు. ఈ నిబంధనలు నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్అండ్ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్ఫామ్లో డెరివేటివ్ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం. – నితిన్ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎఫ్‌అండ్‌వోలో బ్రోకరేజీల జోరు..
ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజీలను మించి పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలు ఇటీవల రిటైల్ డెరివేటివ్ విభాగంలో జోరు చూపుతున్నాయి. ఫ్యూచర్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో ఏంజెల్‌వన్, మోతీలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకరేజీలను మించుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. రిటైల్ విభాగంలో ఏంజెల్‌వన్ 82 శాతం, మోతీలాల్ ఓస్వాల్ 54 శాతం ఆదాయ వాటాను పొందినట్లు ఒక నివేదిక పేర్కొంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేపట్టిన ఒక పరిశీలన ప్రకారం డిస్కౌంట్ బ్రోకర్స్ ఎన్ఎస్ఈలో అత్యధికంగా జరిగే ఎఫ్‌అండ్‌వో లావాదేవీల జోరుకు కారణమవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో పరిమాణంలో 2022లోనూ ఎన్ఎస్ఈ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్సే్ఛంజీగా నిలిచిన సంగతి తెలిసిందే. రిటైలర్లకు నష్టాలు గత కేలండర్ ఏడాది(2022)లో రిటైల్ ట్రేడర్లు నిర్వహించిన 10 ఎఫ్‌అండ్‌వో ట్రేడ్లలో 9 నష్టాలతోనే ముగిసినట్లు గత నెలలో సెబీ పేర్కొంది. సుమారు రూ. 1.1 లక్షల కోట్ల నష్టాలు నమోదైనట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే డెరివేటివ్ విభాగంలో రిటైల్ ట్రేడర్ల సంఖ్య 500 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వెరసి ఇన్వెస్టర్ల కోసం బ్రోకర్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలు రూపొందించే అదనపు రిస్క్ మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలియజేసింది. టెక్నాలజీపై దృష్టిపెట్టిన ఏంజెల్‌వన్ అతితక్కువ కాలంలోనే 12.89 మిలియన్ కస్టమర్లను పొందడం ద్వారా 2023 జనవరికల్లా అతిపెద్ద బ్రోకరేజీగా ఆవిర్భవించింది. 2022 అక్టోబర్–డిసెంబర్(క్యూ3) కాలంలో సాధించిన రూ. 800 కోట్ల ఆదాయంలో 82 శాతం వాటాను ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారానే పొందింది. ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వరుసగా గత రెండు సంవత్సరాలలో ఎఫ్‌అండ్‌వో వాటా 72 శాతం, 52 శాతంగా నమోదైంది. ఇక ఈ క్యూ3లో మోతీలాల్ ఆర్జించిన రూ. 688 కోట్ల ఆదాయంలో 54 శాతం వాటా ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచే లభించింది. 2019లో 39 శాతంగా నమోదైన ఈ వాటా తదుపరి ఇదేస్థాయిలో కొనసాగుతూ తాజాగా 54 శాతానికి ఎగసింది. మరోవైపు బ్రోకింగ్ రంగంలో రెండో ర్యాంకులో ఉన్న జిరోధా డెరివేటివ్ విభాగం నుంచి 20 శాతమే పొందింది. ఈ సంస్థ 7 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోకింగ్‌లో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి 75 శాతం పరిమాణాన్ని సాధిస్తోంది. అప్‌స్టాక్స్, 5పైసా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితరాలు సైతం డిస్కౌంట్ బ్రోకింగ్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. కాగా.. పూర్తిస్థాయి బ్రోకింగ్ సేవలందించే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌అండ్‌వో నుంచి 20 శాతం ఆదాయాన్ని అందుకుంది. ఈ బాటలో 8.7 మిలియన్ కస్టమర్లను కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్‌నుంచి 20 శాతం ఆదాయాన్నే పొందింది. డెరివేటివ్స్‌లో రిటైలర్లు సెబీ పరిశీలన ప్రకారం గతేడాది(2022)లో టాప్–10 బ్రోకర్ల ద్వారా 45 లక్షలకుపైగా రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించారు. 2019లో నమోదైన 7.1 లక్షమందితో పోలిస్తే ఈ సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. ఇటీవల కొత్త ఇన్వెస్టర్లు, యువత అత్యధికంగా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేపడుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో 36 శాతం 20–30 మధ్య వయసువారు కావడం గమనార్హం! 2019లో వీరి సంఖ్య 11 శాతమే. -
స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తారా..! అయితే మీకో గుడ్‌న్యూస్..!
స్టాక్స్ మార్కెట్స్‌లో ట్రేడింగ్ చేసే వారికోసం ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ ధని స్టాక్స్ లిమిటెడ్ సరికొత్త ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ధని స్టాక్స్‌ను లాంచ్ చేసింది. ఈక్విటీ, ఎఫ్&ఓ, ఇంట్రా-డే, డెలివరీతో సహా అన్ని విభాగాలలో ట్రేడర్స్‌కు జీరో బ్రోకరేజీతో సేవలను అందించనుంది. ధని యాప్..! ఒక క్లిక్‌తో లాగిన్.. ట్రేడర్స్‌ను దృష్టిలో ఉంచుకొని ధని స్టాక్స్ లిమిడెట్ కంపెనీ ధనీ యాప్‌లో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను జత చేసింది. ఒక క్లిక్‌తో ట్రేడర్స్ లాగిన్ అయ్యే విధంగా యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను 'లెస్ ఈజ్ మోర్' అనే థీమ్‌తో రూపొందించారు. ఈ యాప్‌తో ట్రేడర్స్‌కు స్టాక్స్ విషయంలో అయోమయాన్ని తగ్గిస్తూ, ట్రేడింగ్ అనుభవాన్ని మరింత సరళంగా చేయనుంది. కొత్తగా ట్రేడింగ్ చేసే వారికోసం అకౌంట్ ఓపెనింగ్, వార్షిక మెయింటెనెన్స్‌పై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. దాంతో పాటుగా ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ ప్రాసెస్‌ను ట్రేడర్స్‌కు ధని అందించనుంది. సరికొత్త UI/X డిజైన్‌తో ట్రేడింగ్ సంక్లిష్టతను వన్-క్లిక్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్, రియల్ టైమ్ కోట్స్, ఇన్-డెప్త్ స్టాక్ అనాలిసిస్, అనుకూలీకరించదగిన వాచ్‌లిస్ట్‌లు, ఐపీవో పెట్టుబడుల వంటి అంశాలను మరింత సులభతరం చేస్తుంది. దీంతో ట్రేడర్స్‌కు ట్రేడింగ్ సరళీకృతం అవుతోందని ధని స్టాక్స్ సీఈవో దివ్యేష్ షా అభిప్రాయపడ్డారు. చదవండి: ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్.. -
Realty: ఒక్క హైదరాబాద్‌లో రూ.264 కోట్ల బ్రోకరేజ్ ఆదా! మరి దేశ వ్యాప్తంగా?
రియల్టీ సెక్టార్‌కి సంబంధించి ఆన్లైన్ సేవలు ఉపయోగించుకోవడం ద్వారా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.264 కోట్ల రూపాయల బ్రోకరేజీ అమౌంట్ ఆదా అయ్యింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో ఈ మొత్తం ఏకంగా రూ.2,874 కోట్లుగా ఉంది. తాజా సర్వేలో రియల్టీలో బ్రోకరేజీ అమౌంట్‌కి సంబంధించిన వివరాలు లభించాయి. 7 నగరాల డేటా సాధారణంగా ఎవరైనా మనకు ప్రాపర్టీ లావాదేవీలో మధ్యవర్తిత్వం వహిస్తే బ్రోకరేజ్ చార్జీ చెల్లిస్తుంటాం. ఈ బ్రోకరేజీ అమౌంట్ భారీగానే ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొద్ది మంది, గృహిణులు, నిరుద్యోగులు కూడా రియల్టీలో సంధానకర్తలుగా వ్యవమరిస్తుంటారు. అయితే రియల్టీ బ్రోకరేజీలో ఎంత ఆదాయం వస్తుంది ? క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందనే అంశాలపై నిర్థిష్టమైన వివరాలు లేవు. తాజాగా ఈ అంశాలకు సంబంధించిన వివరాలను నోబ్రోకర్ డాట్ కామ్ వెల్లడించింది. ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాలలో 21 వేల మంది కస్టమర్లతో పాటూ, నోబ్రోకర్.కామ్‌లోని 16 మిలియన్ మంది వినియోగదారుల డేటాను విశ్లేషించి నివేదికను రూపొందించింది. ఈ సంస్థ నోబ్రోకరేజ్ కంపెనీ ఎలాంటి చార్జీ లేకుండా ఉచితంగా సేవలందిస్తుంది. దేశవ్యాప్తంగా గతేడాది దేశవ్యాప్తంగా రూ.2,874 కోట్ల బ్రోకరేజ్ వ్యయం ఆదా అయిందని నోబ్రోకర్ డాట్ కామ్ తెలిపింది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో రూ.787 కోట్లు, ముంబైలో రూ.653 కోట్లు, చెన్నైలో రూ.497 కోట్లు, పుణేలో రూ.424 కోట్లు, హైదరాబాద్‌లో రూ.264 కోట్లు, ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.250 కోట్ల బ్రోకరేజ్‌ను ఆదా చేసింది. ఈ వివరాల ప్రకారం ప్రాపర్టీ కొనుగోలు సందర్భంగా బెంగళూరు, ముంబై, పూనేలు వంటి నగరాలు ఐటీపై ఎక్కువగా ఆధారపడుతుండగా ఢిల్లీ, హైదరాబాద్‌లు ఇంకా బ్రోకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పని ప్రదేశాలకు దగ్గరగా వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండటం, డెవలపర్ల ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా సొంతంగా ఉండేందుకు ఇళ్లు కొనాలని భావించే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 43 శాతం మంది వినియోగదారులు ఈ ఏడాది పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది. 84 శాతం మంది కస్టమర్లు సొంతింటి కొనుగోలు కోసం ఇదే సరైన సమయమని భావిస్తున్నారని పేర్కొంది. 80 శాతం మంది పని ప్రదేశాలకు దగ్గర ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు. 78 శాతం మంది ప్రధాన నగరంలో కేంద్రీకృతమై ఉండాలనుకుంటున్నారు. నిర్మాణాలు ఆలస్యం అవుతుండటం, నిధుల మళ్లింపు నేపథ్యంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు 78 శాతం కస్టమర్లు భావిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణ గృహాలకే.. పాక్షిక లాక్డౌన్, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణాలు తగ్గాయి. దీంతో ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. వెకేషన్, లైఫ్ స్టయిల్ కోసం వ్యయం చేస్తుండేవారు. ఈ సొమ్ముతో కొంత ఎక్కువ విస్తీర్ణం ఉండే గృహాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రాపర్టీలను కొనాలని 15 శాతం మంది శోధిస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 4 శాతం, 2019తో పోలిస్తే 8 శాతం అధికం. అంతక్రితం సంవత్సరం 29 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే కొనుగోళ్లు.. గతేడాది 33 శాతం వృద్ధి రేటు నమోదయింది. 37 శాతం మంది రెండు పడక గదులకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన ఆన్లైన్ వినియోగం.. ఇంటి కొనుగోళ్లలో 73 శాతం, అద్దె గృహాలకు 55 శాతం మంది వాస్తును ఫాలో అవుతున్నారు. కరోనా తర్వాతి నుంచి ప్రాపర్టీ విజిట్స్, ఎంపిక, లావాదేవీలలో ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రాపర్టీ కొనుగోళ్ల కంటే అద్దెల కోసం వీడియో వాక్‌త్రూల వినియోగం పెరిగింది. గది లోపలి పరిమాణం, లే–అవుట్ విస్తీర్ణాలు, ఓవర్ వ్యూల వంటివి అద్దెదారులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని నోబ్రోకర్.కామ్ కో–ఫౌండర్ సౌరభ్ గార్గ్ తెలిపారు. గతేడాది 77 శాతం మంది వీడియో వాక్‌త్రూ ప్రాపర్టీలను వీక్షించారని, దీంతో ఈ విభాగంలో గణనీయమైన వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో 53 శాతం మంది భూ యజమానులు అద్దెలను తగ్గింపు లేదా మాఫీ చేశారు. ఢిల్లీ, పుణే నగరాలలో గరిష్టంగా 58 శాతం అద్దెలను తగ్గించారని తెలిపారు. దీపావళి తర్వాతి నుంచి 46 శాతం మంది అద్దెలను పెంచారని తెలిపారు. రియల్టీకే మొగ్గు స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాలలో ప్రాపర్టీనే అత్యంత సురక్షితమైన, అధిక రాబడి మార్గంగా ఎదిగింది. గతేడాది ఇన్వెస్ట్మెంట్స్ ఎంపికలలో తొలిస్థానంలో స్థిరాస్తి రంగం నిలవగా.. సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో స్టాక్స్, గోల్డ్‌లు నిలిచాయి. అత్యంత క్షీణ స్థితిలో బిట్‌కాయిన్ నిలిచింది. 76 శాతం మంది భారతీయులు రియల్టీనే ఉత్తమ పెట్టుబడి సాధనమనే ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారని నోబ్రోకర్ రియల్ ఎస్టేట్ రిపోర్ట్ తెలిపింది. చదవండి: రియల్టీ మెరుగైన పెట్టుబడి సాధనం -
టీసీఎస్ క్యూ1 ఫలితాలపై బ్రోకరేజ్‌ల వైఖరి ఏమిటి..?
దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్యూ1 ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి టీసీఎస్ షేరు 0.75శాతం లాభంతో రూ.2221.65 వద్ద స్థిరపడింది. కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే కోవిడ్-19 ప్రభావంతో వ్యాపారంలో తీవ్ర అంతరాయాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. అధిక వ్యాల్యూయేషన్ ఉత్పన్నం కావడం అనేక బ్రోకరేజ్ సంస్థలకు అందోళ కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థలు క్యూ1 ఫలితాలపై మిశ్రమ వైఖరిని వెల్లడించాయి. ‘‘సీక్వెన్షియల్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 5.2శాతం క్షీణిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అయితే అన్యూహంగా ఈ క్యూ1లో ఆదాయం 6.9శాతంగా క్షీణతను చవిచూడటం గమనార్హం.’’ అని ఎమ్కే బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మంచి వ్యాల్యూయేషన్లు ఇటీవల షేరులో అప్‌మూవ్‌ను కలిగించాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో షేరు రానున్న రోజుల్లో షేరు పరిమితి శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఇన్వెస్టెక్ బ్రోకరేజ్ సంస్థ గతంలో టీసీఎస్ కంపెనీ షేరుకు హోల్డ్ రేటింగ్‌ను కేటాయించింది. ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ‘‘సెల్’’ రేటింగ్‌కు కుదించింది. మాక్వేరీ బ్రోకరేజ్ సంస్థ ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ రేటింగ్ నుంచి ‘‘న్యూటల్’’ రేటింగ్‌కు తగ్గించింది. సీఎల్‌ఎస్‌ఈ అవుట్‌ఫెర్‌ఫామ్ రేటింగ్‌ను కేటాయించింది. ఎడెల్వీజ్ ‘‘బై’’ రేటింగ్ కొనసాగించింది. మోర్గాన్ స్టాన్లీ ఈక్విల్ వెయిట్ రేటింగ్ కొనసాగించింది. మోతీలాల్ ఓస్వాల్, నోమురాలు ‘‘న్యూట్రల్’’ రేటింగ్‌ను కొనసాగించగా, కోటక్ ఈక్విటీస్ బ్రోకరేజ్ ‘‘తగ్గింపు’’ రేటింగ్‌ను కొనసాగించింది. (టీసీఎస్ షేరుపై వివిధ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్, టార్గెట్ ధరల మార్పులు చేర్పులు కింది టేబుల్లో చూడవచ్చు) -
పెట్టుబడుల కోసం పలు షేర్ల సిఫారసు
ఏడాదిలో 15- 40 శాతం లాభం వచ్చే అవకాశం పెరుగుదలకు చక్కని అవకాశాలున్నాయంటున్న నిపుణులు వివిధ బ్రోకరేజీ సంస్థల సిఫారసులివీ... స్టాక్ మార్కెట్లకు కొత్త సంవత్సరం వచ్చేసింది. సంవత్-2073 ముహూర్త ట్రేడింగ్ ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా జరగబోతోంది. నిజం! దీపావళి అంటే స్టాక్ మార్కెట్లకు వెలుగులు తెచ్చే పండుగ. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మరింత పెంచే పండుగ. అందుకే... ఇన్వెస్టర్లు దీపావళి రోజున దీర్ఘకాల లాభాలకు కొన్ని షేర్లయినా కొంటారు. నిజానికి సంవత్ 2072లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. రాబడులు ఒక మోస్తరుగానే ఉన్నాయి. అయితే మెరుగైన వర్షపాతం, ఇన్ఫ్రా సంస్కరణల్లో పురోగతి, వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) అమల్లోకి రానుండటం, ద్రవ్యోల్బణం తగ్గుదల... ఇవన్నీ మార్కెట్లను పరుగు తీయిస్తాయనేది పరిశ్రమ వర్గాల అంచనా. వచ్చే దీపావళి కల్లా సెన్సెక్స్ పాత గరిష్ట స్థాయిలను అధిగమించి 32,000 - 36,000 స్థాయికి దూసుకెళ్లగలదని పలు బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏయే స్టాక్స్ కొనుక్కోవచ్చు? వేటికి దూరంగా ఉండాలి? ఏ రంగాలు బాగుంటాయి? అనే అంశాలపై ‘సాక్షి’ పలు బ్రోకరేజీ సంస్థల్ని సంప్రదించింది. దాదాపు ఏడాది వ్యవధి కోసం వారిచ్చిన సూచనలు, సిఫారసులు ఈ దీపావళి ప్రత్యేకం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఎంఅండ్ఎం ఫిన్ ప్రస్తుత ధర (రూ.) 361 లక్ష్యం (రూ.) 428 వృద్ధి శాతం 18 ఎందుకంటే..! మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణాల్లో 80 శాతం ఆటోమొబైల్ ఫైనాన్సింగ్దే. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన సంస్థ నికర వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరగ్గా.. మొండిబకాయిల పెరుగుదలతో నికర లాభంపై ప్రతికూల ప్రభావం పడింది. కుటుంబ ఆదాయాలు పెరుగుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరగవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే రవాణా, నిర్మాణ కార్యకలాపాలు మెరుగుపడనున్న దాఖలాలు.. వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్‌కు ఊతమివ్వొచ్చు. గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడనుండటం హౌసింగ్ ఫైనాన్స్ విభాగానికి తోడ్పడవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, పాలసీపరమైన రిస్కులు ఉంటాయి. బెర్జర్ పెయింట్స్ ప్రస్తుత ధర (రూ.) 257 లక్ష్యం (రూ.) 307 వృద్ధి శాతం 19 ఎందుకంటే..! దేశీ డెకొరేటివ్ పెయింట్ విభాగంలో 18 శాతం పైగా వాటా గల రెండో అతి పెద్ద కంపెనీ బెర్జర్. డెకరేటివ్, ఇండస్ట్రియల్ కోటింగ్ విభాగాల వృద్ధితో కంపెనీ తొలి త్రైమాసికంలో మంచి పనితీరు కనబరిచింది. రుతుపవనాలు, ఏడో వేతన కమిషన్ సిఫార్సులు పెయింట్ పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతాయి. స్మార్ట్ సిటీలు, అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్లాంట్లను విస్తరించడంతో పాటు అసోంలో కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది బెర్జర్. వచ్చే 4-5 సంవత్సరాల్లో బెర్జర్ దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అయితే ముడి వస్తువుల ధరల పెరుగుదల, పోటీ, డెకరేటివ్ పెయింట్స్ విభాగంలో అమ్మకాలు తగ్గే అవకాశాల వంటి రిస్కులున్నాయి. సీఏపీఎఫ్ ప్రస్తుత ధర (రూ.) 705 లక్ష్యం (రూ.) 882 వృద్ధి శాతం 25 ఎందుకంటే..! క్యాపిటల్ ఫస్ట్ (సీఏపీఎఫ్) ప్రస్తుతం రియల్టీ, వ్యాపార, వాహన, వ్యక్తిగత తదితర రుణాలిస్తోంది. రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా నిలకడైన వృద్ధి కనబరుస్తోంది. 2011-16 మధ్య చక్రగతిన కంపెనీ దాదాపు 62 శాతం వృద్ధి నమోదు చేసింది. నిధుల సమీకరణ సామర్ధ్యం, గట్టి ప్రమోటరు, పటిష్ఠమైన వ్యూహాలు ఈ కంపెనీ బలాలు. భారత్‌లో దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌కి సంబంధించి ఏఏప్లస్ రేటింగ్ పొందిన అతి కొద్ది ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్లో ఇదొకటి. 2015 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్లు 2016 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పెరిగాయి. రాడికో ఖైతాన్ ప్రస్తుత ధర (రూ.) 141 లక్ష్యం (రూ.) 166 వృద్ధి శాతం 18 ఎందుకంటే..! మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, కంటెసా రమ్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ వంటివి రాడికో లిక్కర్ బ్రాండ్స్‌లో పేరున్నవి. ఏప్రిల్ నుంచి యూపీలో ఎక్సైజ్ సుంకాన్ని 20-25 శాతం మేర తగ్గించారు. కర్ణాటకలో కొన్ని బ్రాండ్స్ ధరలు 6-7 శాతం పెరిగాయి. కొత్త ఉత్పత్తి ఎలక్ట్రా అమ్మకాలు మెరుగ్గా ఉండటం వంటివి సంస్థపై సానుకూల ప్రభావాలు చూపుతున్నాయి. ఆదాయాలు పెరుగుతుండటం, ప్రీమియం బ్రాండ్స్‌కి ఆదరణ వంటివి అనుకూలాంశాలు. మరోవైపు, ప్రభుత్వపరమైన నియంత్రణలు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) ధరల పెరుగుదల వంటివి లాభదాయకతపై ప్రభావం చూపవచ్చని అంచనా. గ్యాబ్రియెల్ ఇండియా ప్రస్తుత ధర (రూ.) 126 లక్ష్యం (రూ.) 151 వృద్ధి శాతం 19 ఎందుకంటే..! వాణిజ్య వాహనాలు, ప్యాసెంజర్, ద్వి..త్రిచక్ర వాహనాలు మొదలైన వాటికి షాక్ అబ్జార్బర్స్, ఫ్రంట్ ఫోర్క్స్ ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఎకానమీ మెరుగుపడుతుందన్న దాఖలాలు, స్థూల ఆర్థిక సంస్కరణలతో కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో 2016-2019 మధ్య చక్రగతిన 11 శాతం వృద్ధితో రూ.1,966 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా. ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవడం ద్వారా కంపెనీ అధిక ఆదాయాలు ఆర్జించే అవకాశాలున్నాయి. అయితే, ముడివస్తువుల ధర భారీగా పెరిగిన పక్షంలో దాన్ని బదలాయించలేకపోతే.. కంపెనీ మార్జిన్లు, ఆదాయాలపై ప్రభావాలు చూపించవచ్చు. జీఎస్ఎఫ్సీ ప్రస్తుత ధర (రూ.) 95 లక్ష్యం (రూ.) 115 వృద్ధి శాతం 21 ఎందుకంటే..! పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల్ని తయారు చేస్తోందీ సంస్థ. గతేడాది జూలైలో ఏర్పాటు చేసిన నైలాన్ 6 ప్లాంట్లు, త్వరలో నెలకొల్పబోయే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్లాంటు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. 2018 ఆఖర్లో అందుబాటులోకి వచ్చే మూడో మెలామిన్ ప్లాంటు కూడా దీర్ఘకాలంలో వృద్ధికి ఉపయోగపడుతుంది. దేశీ మార్కెట్లో కాప్రోలాక్టమ్, మెలానిన్ తయారు చేసే అతి కొద్ది కంపెనీల్లో ఇదొకటి. రాబోయే ఏడాదిన్నర కాలంలో సంస్థకు కొత్తగా రూ.1,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నాయి. కమోడిటీ ధరల తగ్గుదల జీఎస్ఎఫ్సీకి లాభించగలదు. అయితే, క్రూడ్‌లో హెచ్చుతగ్గులు, కరెన్సీపరమైన ఒడిదుడుకులు.. చైనా నుంచి చౌక దిగుమతుల వంటి రిస్కులు ఎదురవ్వొచ్చు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రస్తుత ధర (రూ.) 259 లక్ష్యం (రూ.) 322349 వృద్ధి శాతం 2434 ఎందుకంటే..! ఫ్యాన్లు, లైట్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాల తయారు చేస్తోందీ సంస్థ. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. పోటీ సంస్థలతో పోలిస్తే దేశవ్యాప్తంగా అమ్మకాలు విస్తరించడం కంపెనీకి సానుకూలం. బలమైన నెట్వర్క్ తోడ్పాటుతో సంస్థ మళ్లీ మార్కెట్ వాటా దక్కించుకోగలదని అంచనా. ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ధర (రూ.) 157 లక్ష్యం (రూ.) 211263 వృద్ధి శాతం 3467 ఎందుకంటే..! దేశంలో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థల్లో ఒకటి. స్పోర్ట్స్ వంటి ఇతర వ్యాపకాలను కాస్త పక్కన పెట్టి ప్రమోటర్లు మళ్లీ కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు కొన్నాళ్లుగా దిద్దుబాటు చర్యలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సిమెంటుకు డిమాండ్ పెరిగి, రాబడులు మెరుగుపడగలవని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర (రూ.) 1,053 లక్ష్యం (రూ.) 1,225 వృద్ధి శాతం 16 ఎందుకంటే..! పెట్రో-కెమికల్స్, రిఫైనింగ్ తదితర కార్యకలాపాల్లో దాదాపు రూ.3 లక్షల కోట్ల టర్నోవర్‌తో అతి పెద్ద ప్రైవేట్ దిగ్గజాల్లో ఒకటి. గడిచిన కొన్నాళ్లలో ప్రధాన వ్యాపార విస్తరణ, టెక్నాలజీ ఆధునీకరణ మొదలైన వాటిపై సుమారు రూ.2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రాబోయే 12 నెలల్లో వీటి ఫలితాలు క్రమంగా కనిపిం చడం మొదలవుతుంది. ఇక జియో వెంచర్ విజయవంతమైతే స్టాక్ రీ-రేటింగ్‌కు దోహదపడవచ్చు. లుపిన్ ప్రస్తుత ధర (రూ.) 1,490 లక్ష్యం (రూ.) 2,050 వృద్ధి శాతం 37 ఎందుకంటే..! ఈ ఫార్మా సంస్థ షేరు గరిష్ట స్థాయి నుంచి 25-28 శాతం మేర పడిపోయింది. ప్రతికూల అంశాల న్నింటినీ మార్కెట్ ఇప్పటికే పరిగణనలోకి తీసేసుకుంది. ఆ మేరకు షేరు ధర తగ్గింది కూడా. అందుకని ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలోనే ఉన్నట్లు భా వించొచ్చు. గ్లూమెట్జా, ఫోర్టామెట్ వంటి జనరిక్ ఔషధాలు కంపెనీ లాభాలకు దోహదపడగలవు. 2017-18లో సంస్థ 40కి పైగా ఉత్పత్తులు ప్రవేశపెట్టొచ్చు ఏంజెల్ బ్రోకింగ్ యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర (రూ.) 486 లక్ష్యం (రూ.) 630 వృద్ధి శాతం 29 ఎందుకంటే..! రిటైల్ లోన్స్ ఊతంతో యాక్సిస్ బ్యాంక్ రుణాల మంజూరీలో బ్యాంకింగ్ పరిశ్రమ సగటును మించిపోయింది. 2012-16 ఆర్థిక సంవత్సరాల మధ్య చక్రగతిన ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో లోన్ బుక్ 20 శాతానికి పైగా పెంచుకునేందుకు తగిన సామర్థ్యం బ్యాంక్కుంది. మొండి బకాయిలు పెద్దగా పెరిగే అవకాశాలు లేనట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. మధ్యకాలికంగా 16-17 శాతం మేర నిలకడగా రిటర్న్ ఆన్ ఈక్విటీ నమోదు చేయవచ్చని అంచనా. ఈక్విటాస్ హోల్డింగ్స్ ప్రస్తుత ధర (రూ.) 178 లక్ష్యం (రూ.) 235 వృద్ధి శాతం 32 ఎందుకంటే..! కొత్తగా చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన సంస్థల్లో ఇదొకటి. సంస్థ ఇచ్చిన రుణాలన్నీ కూడా ప్రాధాన్యతా రంగ రుణాల పరిధిలోకి చేర్చేందుకు అర్హమైనవే. దీంతో 75 శాతం పీఎస్ఎల్ లక్ష్యం దీనికి పెద్ద సమస్యేమీ కాదు. డిపాజిట్లు సమీకరించవచ్చు గనుక ఆ మేరకు నిధుల సమీకరణ వ్యయాలు దాదాపు 250 బేసిస్ పాయింట్ల దాకా తగ్గి వ్యాపార నిర్వహణ మెరుగ్గా ఉండగలదన్న అంచనాలున్నాయి. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ 11 శాతం స్థాయిలో ఉండొచ్చు. అమర రాజా బ్యాటరీస్ ప్రస్తుత ధర (రూ.) 1,014 లక్ష్యం (రూ.) 1,218 వృద్ధి శాతం 20 ఎందుకంటే..! దేశీయంగా యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీలు తయారు చేసే రెండో అతిపెద్ద సంస్థ అమర రాజా. మార్కెట్ లీడర్ ఎక్సైడ్ను మించి వృద్ధి చెందుతోంది. 2010 ఆర్థిక సంవత్సరంలో పాతిక శాతంగా ఉన్న మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 35 శాతం స్థాయిలో ఉంది. డక్ట్‌ల తయారీకి సంబంధించి అంతర్జాతీయ దిగ్గజం జాన్సన్ కంట్రోల్‌తో భాగస్వామ్యం కూడా అమర రాజాకు తోడ్పడనుంది. ఆర్థిక రికవరీ, మార్కెట్ వాటా దక్కించుకోవడం తదితర అంశాల ఊతంతో కంపెనీ వచ్చే రెండేళ్లలో చక్రగతిన 18 శాతం స్థాయిలో వృద్ధి చెందవచ్చని అంచనా. భారత్ ఎలక్ట్రానిక్స్... ప్రస్తుత ధర (రూ.) 1,301 లక్ష్యం (రూ.) 1,414 వృద్ధి శాతం 9 ఎందుకంటే..! కంపెనీకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దాదాపు 35 శాతం వాటా ఉంది. ప్రభుత్వం దేశీయంగా రక్షణ పరికరాల తయారీకి ప్రాధాన్యమిస్తుండటం, ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం, గడిచిన 26 నెలల్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సుమారు 50 బిలియన్ డాలర్ల విలువ చేసే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడం తదితర అంశాలు డిఫెన్స్ రంగ వృద్ధికి తోడ్పడనున్నాయి. తద్వారా రాబోయే కొన్నేళ్లలో బీఈఎల్ కూడా లబ్ధి పొందగలదనే అంచనాలున్నాయి. చాయిస్ బ్రోకింగ్ టెక్ మహీంద్రా ప్రస్తుత ధర (రూ.) 435 లక్ష్యం (రూ.) 580 వృద్ధి శాతం 33 ఎందుకంటే..! సాంకేతికంగా చూస్తే రూ.748 స్థాయి నుంచి గణనీయంగా రూ.407 స్థాయికి పడిపోయిన ఈ షేరు క్షీణత ఇక్కడితో ఆగిందని అంచనా. ఆకర్షణీయమైన ఈ ధరలో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా స్టాక్ మళ్లీ కోలుకోగలదు. టెక్నికల్ అంశాల ప్రకారం సమీప భవిష్యత్‌లో ఇది రూ.580కి చేరొచ్చు. చాయిస్ బ్రోకింగ్ అశోక్ లేలాండ్ ప్రస్తుత ధర (రూ.) 90 లక్ష్యం (రూ.) 132 వృద్ధి శాతం 46 ఎందుకంటే..! టెక్నికల్ అంశాల ప్రాతిపదికన చూస్తే.. ఇది బుల్ ట్రెండ్‌ను సూచిస్తోంది. పైకి వెళ్లిన ప్రతిసారీ స్టాక్ మధ్యమధ్యలో స్వల్ప కరెక్షన్‌కి లోనవుతుండ టం బుల్ పట్టును తెలియజేసేలా ఉంది. రూ.75 స్థాయి దగ్గర ఇటీవలి క్షీణతకు అడ్డుకట్టపడినట్లేనని భావించవచ్చు. నేషనల్ అల్యూమినియం ప్రస్తుత ధర (రూ.) 53 లక్ష్యం (రూ.) 80 వృద్ధి శాతం 51 ఎందుకంటే..! సాంకేతికాంశాలను బట్టి చూస్తే ఈ స్టాక్‌లో అమ్మకాల కన్నా కొనుగోలు లావాదేవీలపైనే ఎక్కువగా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. తగ్గుదల ఆగి.. రివర్స్‌లో పైకి వెళ్లే క్రమంలో ఉన్న ట్లు తెలుస్తోంది. బుల్స్ కంట్రోల్లోకి వచ్చినట్లు కనిపిస్తున్న ఈ షేరు సమీప భవిష్యత్‌లో మరిం త పైకి వెళ్లగలదని అంచనా. -
వడ్డీ రేట్లు అరశాతం కోత?
ప్రథమార్ధంలో తగ్గవచ్చంటున్న నిపుణులు న్యూఢిల్లీ: ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కఠిన పరపతి విధానాన్ని మరింతగా సరళతరం చేసే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో పాలసీ రేట్లను మరో అరశాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, బార్క్లేస్, సిటీగ్రూప్, హెచ్ఎస్బీసీ తదితర అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థల అంచనాల ప్రకారం 2015లో వర్షపాతం ఎలా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం సానుకూల స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. కమోడిటీల ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణం. దీంతో ఆర్బీఐ పాలసీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని భావిస్తున్నట్లు బార్క్లేస్ ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు, ఆర్బీఐ రెపో రేటును మార్చి/ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్లు, జూన్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణ చర్యలు మొదలైన వాటి కారణంగా రిజర్వ్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల దాకా రేట్లను తగ్గించవచ్చని తాము ముందుగా వేసిన అంచనాలను యథాప్రకారంగా కొనసాగిస్తున్నట్లు సిటీగ్రూప్ వివరించింది. డిమాండు పెరిగేందుకు, తద్వారా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ ప్రస్తుత కీలక రేట్లు రెపో రేటు: 7.75 శాతం (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) రివర్స్ రెపో: 6.75 శాతం (బ్యాంకులు తన వద్ద ఉంచే డిపాజిట్లపై ఆర్బీఐ చెల్లించే రేటు) -
దళారీల నుంచి రైతులకు రక్షణ
రాష్ట్ర మంత్రి మృణాళిని చీపురుపల్లి : రైతులను దళారీల నుంచి రక్షించేందుకే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమి డి మృణాళిని తెలిపారు. గురువారం పట్టణంలోని వెలు గు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏవిధంగా మద్దతు ధర ఇస్తారు? కొనుగోలు విషయంలో ఏ నిబంధనలు పాటిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దళారీలు వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నే రుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే రైతుల నుంచి ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు ద్వారా కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క బస్తాకు స్వయం సహాయక సంఘాలకు రూ. 35 ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 61 కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. ఎ గ్రేడ్ వంద కిలోల ధాన్యానికి రూ. 1400, కామన్ వైరైటీకి రూ. 1360 మద్దతు ధర చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే ఆ ధర లభిస్తుందన్నారు. వరి పండించే రైతుకు కచ్చితంగా మద్దతు ధర లభించాలన్న ఆశయంతో ప్రభుత్వమే ధాన్యం కొ నుగోలు చేస్తుందన్నారు. రైతులు మోసపోకుండా ఉం డేందుకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మిల్లులు వద్ద కూడా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చునని, మద్దతు ధర మాత్రం మి ల్లర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి ఇదే జిల్లాలోని రేష న్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజ నం తక్కువగా ఉంటుందని, ప్రైవేటు వర్తకులు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని స్థానిక విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న పలువురు సర్పం చులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై స్పందిం చిన మంత్రి రైతులకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ బి. రామారావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావు, తహశీల్దార్పెంటయ్య, జెడ్పీటీసీ వరహాలనాయుడు, ఎంపీపీ కాంతమ్మ, పాల్గొన్నారు. -
సర్వేతో అక్రమార్కులకు చెక్ పడే అవకాశం
మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేతో మంచిర్యాల మండలం గుడిపేట వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో అనర్హులు, బినామీల బండారం బయటపడే అవకాశం కన్పిస్తోంది. సర్వే సిబ్బంది పక్కాగా వ్యవహరిస్తే ముంపు గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు ఎంత మంది? బినామీ పేర్లతో పరిహారం పొందిన వారు ఎవరు? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు చేతివాటం చూపించడంతో, ముంపునకు గురయ్యే తొమ్మిది గ్రామాల్లో 300లకు పైగా అనర్హులు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వీరిని గుర్తించేందుకు అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. స్థానికంగా ఉన్న ఇబ్బందులతో అనర్హత వేటు పడలేదు. గతేడాది డిసెంబర్ వరకు పరిహారం పంపిణీ సమయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఐరిష్ సేకరణను చేపట్టగా 129 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమగ్రంగా సర్వే చేస్తే 300లకు పైగా అనర్హులను గుర్తించొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చూసినా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అనంతరం ఎన్నికల హడావుడి, రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బినామీల గుర్తింపు, వారిపై చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అనర్హుల గుర్తింపునకు ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. అర్హులకు నిరాశ 2006లో ముంపు గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వే(ఎస్ఈఎస్) చేపట్టారు. గ్రామాల్లో ఉన్న వారి పేర్లు, వివరాలు సర్వే ద్వారా నమోదు చేసి నిర్వాసితులను గుర్తించారు. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో కొందరు అర్హుల పేర్లు ఎస్‌ఈఎస్‌లో నమోదు చేయించుకోలేదు. ఆలస్యంగా మేల్కొన్న అర్హులైన వారు ఎస్‌ఈఎస్‌లో పేర్లు మిస్సయ్యాయని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామంలో దళారులు పుట్టుకొచ్చారు. అర్హుల పేర్లు ఎస్‌ఈఎస్‌లో నమోదు కాలేదంటూ, వారి పేర్లు అడ్డుపెట్టుకుని, ఒక్కో గ్రామం నుంచి 50కి పైగా బినామీ పేర్లు తెరపైకి తెచ్చారు. పేర్లు మిస్సయిన అర్హులు గ్రామానికి 10 నుండి 30 మంది వరకు ఉండగా, వారిని ఇంత వరకు అర్హులుగా అధికారులు గుర్తించలేదు. అధికారులకు ముడుపులు అందించిన వారి పేర్లు మాత్రమే ఎస్‌ఈఎస్‌లో నమోదు చేసి, ముడుపులు ఇవ్వని వారి పేర్లు నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. బినామీలకు కూలీ డబ్బులు, ఇంటి డబ్బులు, పునరావాస కాలనీలో ప్లాట్లు లభించాయి. దీంతో తమకు పరిహారం అందించకుండా, అనర్హులకు పరిహారం అందించారంటూ బాధితులు అప్పటి ఆర్ఆర్ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా, సర్వేతో మేలు జరుగుతుందని నిర్వాసితులైన అర్హులు భావిస్తున్నారు. బినామీల్లో ఆందోళన బయోమెట్రిక్ విధానంతో ముంపు గ్రామాల్లోని 129 మంది బినామీలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సమగ్ర సర్వే ద్వారా ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు, సంక్షేమ పథకాల వివరాలు, వారికి ఉన్న ఆస్తుల వివరాలు రికార్డు కానున్నాయి. దీంతో మిగిలిన బినామీలను గుర్తించేందుకు కుటుంబ సమగ్ర సర్వేఉపయోగపడనుండడంతో బినామీల్లో గుబులు మొదలైంది. ప్రతి గ్రామంలో బినామీలు అధికంగా ఉండడం, వారిపై చర్యలు తీసుకోవాలంటే రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు మరోసారి గ్రామానికి వచ్చి సర్వేలో పాల్గొనే అవకాశం లేదు. ఒకవేళ సర్వేలో పాల్గొన్న గ్రామంలోని ఇతరులు గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు ఉంటున్న ఊర్లలో సర్వేలో పాల్గొనాలో, ముంపు గ్రామాల్లో పరిహారం పొందడంతో ఇక్కడికి రావాలోననే ఆందోళన బినామీల్లో నెలకొంది. మరికొందరు రెండు గ్రామాల్లో పరిహారం పొందారు. వారిని కూడా సర్వే ద్వారా గుర్తించే వీలుంది. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేతో అనర్హులను గుర్తించడం, అర్హులకు న్యాయం జరుగుతుందని ముంపు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోస్టుకు రూ.3 లక్షలట !
వినుకొండ, న్యూస్‌లైన్: జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీతో జిల్లాలోని పలు విద్యుత్ ఉప కేంద్రాల్లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు భారీగా ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్లగా విధులు నిర్వహిస్తున్న వారికి 20 శాతం రిజర్వేషన్ ప్రకారం జేఎల్‌యం పోస్టులు దక్కడంతో జిల్లాలో సుమారు 100 వరకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇదే అదనుగా భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ వినుకొండ ప్రాంతంలో పలువురు నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వినుకొండ, మాచర్ల ప్రాంతాల్లో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి 2010లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కోర్టు ఆదేశాలతో నియామకాలకు బ్రేక్ పడింది. రెండు రోజుల క్రితం తిరిగి కోర్టు అదేశాలతో ఆ పోస్టులను భర్తీ చేశారు. జిల్లాలో సుమారు 230 మందికి జేఎల్‌యం పోస్టులు దక్కగా వీరిలో సగం మంది షిష్ట్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా ఈనెల 18న విధుల్లో చేరారు. దీంతో వినుకొండ ప్రాంతంలోని నమాజ్కుంట విద్యుత్ ఉపకేంద్రంలో-1, చీకటీగలపాలెం సబ్ స్టేషన్లో-2, రేమిడిచర్ల-1. పమిడిపాడు-1, నూజెండ్ల-2, వెల్లటూరు-1 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్‌కు నెలకు రూ. 8150ల వేతనంతో పాటు ఈపీఎఫ్ కింద రూ. 799లు చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలను ట్రాన్స్‌కో సీఎండి మార్గదర్శకాల మేర భర్తీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు తప్పని సరిగా ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి. స్తంభం ఎక్కగలగాలి. రిజర్వేషన్ ప్రకారం నియామకం ఉంటుంది. సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆరోపణలు వస్తున్నాయి... షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో వినుకొండ ప్రాంతంలో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. - ఏడీఈ విశ్వేశ్వరప్రసాదు, వినుకొండ.