పెట్టుబడుల కోసం పలు షేర్ల సిఫారసు | 2073 Samvat Epoch Trading | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల కోసం పలు షేర్ల సిఫారసు

Published Sun, Oct 30 2016 2:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

పెట్టుబడుల కోసం పలు షేర్ల సిఫారసు - Sakshi

పెట్టుబడుల కోసం పలు షేర్ల సిఫారసు

 ఏడాదిలో 15- 40 శాతం లాభం వచ్చే అవకాశం
 పెరుగుదలకు చక్కని అవకాశాలున్నాయంటున్న నిపుణులు
 వివిధ బ్రోకరేజీ సంస్థల సిఫారసులివీ...

 
 స్టాక్ మార్కెట్లకు కొత్త సంవత్సరం వచ్చేసింది. సంవత్-2073 ముహూర్త ట్రేడింగ్ ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా జరగబోతోంది. నిజం! దీపావళి అంటే స్టాక్ మార్కెట్లకు వెలుగులు తెచ్చే పండుగ. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మరింత పెంచే పండుగ. అందుకే... ఇన్వెస్టర్లు దీపావళి రోజున దీర్ఘకాల లాభాలకు కొన్ని షేర్లయినా కొంటారు. నిజానికి సంవత్ 2072లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. రాబడులు ఒక మోస్తరుగానే ఉన్నాయి. అయితే మెరుగైన వర్షపాతం, ఇన్‌ఫ్రా సంస్కరణల్లో పురోగతి, వస్తు సేవల పన్నులు (జీఎస్‌టీ) అమల్లోకి రానుండటం, ద్రవ్యోల్బణం తగ్గుదల... ఇవన్నీ మార్కెట్లను పరుగు తీయిస్తాయనేది పరిశ్రమ వర్గాల అంచనా.
 
  వచ్చే దీపావళి కల్లా సెన్సెక్స్ పాత గరిష్ట స్థాయిలను అధిగమించి 32,000 - 36,000 స్థాయికి దూసుకెళ్లగలదని పలు బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏయే స్టాక్స్ కొనుక్కోవచ్చు? వేటికి దూరంగా ఉండాలి? ఏ రంగాలు బాగుంటాయి? అనే అంశాలపై ‘సాక్షి’ పలు బ్రోకరేజీ సంస్థల్ని సంప్రదించింది. దాదాపు ఏడాది వ్యవధి కోసం వారిచ్చిన సూచనలు, సిఫారసులు ఈ దీపావళి ప్రత్యేకం...    - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 ఎంఅండ్‌ఎం ఫిన్
 ప్రస్తుత ధర (రూ.)    361
 లక్ష్యం (రూ.)    428
 వృద్ధి శాతం    18
 ఎందుకంటే..!
 మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణాల్లో 80 శాతం ఆటోమొబైల్ ఫైనాన్సింగ్‌దే. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన సంస్థ నికర వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరగ్గా.. మొండిబకాయిల పెరుగుదలతో నికర లాభంపై ప్రతికూల ప్రభావం పడింది. కుటుంబ ఆదాయాలు పెరుగుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరగవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే రవాణా, నిర్మాణ కార్యకలాపాలు మెరుగుపడనున్న దాఖలాలు.. వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్‌కు ఊతమివ్వొచ్చు. గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడనుండటం హౌసింగ్ ఫైనాన్స్ విభాగానికి తోడ్పడవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, పాలసీపరమైన రిస్కులు ఉంటాయి.
 
 బెర్జర్ పెయింట్స్
 ప్రస్తుత ధర (రూ.)    257
 లక్ష్యం (రూ.)    307
 వృద్ధి శాతం    19
 ఎందుకంటే..!
 దేశీ డెకొరేటివ్ పెయింట్ విభాగంలో 18 శాతం పైగా వాటా గల రెండో అతి పెద్ద కంపెనీ బెర్జర్. డెకరేటివ్, ఇండస్ట్రియల్ కోటింగ్ విభాగాల వృద్ధితో కంపెనీ తొలి త్రైమాసికంలో మంచి పనితీరు కనబరిచింది. రుతుపవనాలు, ఏడో వేతన కమిషన్ సిఫార్సులు పెయింట్ పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతాయి. స్మార్ట్ సిటీలు, అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్లాంట్లను విస్తరించడంతో పాటు అసోంలో కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది బెర్జర్. వచ్చే 4-5 సంవత్సరాల్లో బెర్జర్ దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అయితే ముడి వస్తువుల ధరల పెరుగుదల, పోటీ, డెకరేటివ్ పెయింట్స్ విభాగంలో అమ్మకాలు తగ్గే అవకాశాల వంటి రిస్కులున్నాయి.
 
 సీఏపీఎఫ్
 ప్రస్తుత ధర (రూ.)    705
 లక్ష్యం (రూ.)    882
 వృద్ధి శాతం    25
 ఎందుకంటే..!
 క్యాపిటల్ ఫస్ట్ (సీఏపీఎఫ్) ప్రస్తుతం రియల్టీ, వ్యాపార, వాహన, వ్యక్తిగత తదితర రుణాలిస్తోంది. రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా నిలకడైన వృద్ధి  కనబరుస్తోంది. 2011-16 మధ్య చక్రగతిన కంపెనీ దాదాపు 62 శాతం వృద్ధి నమోదు చేసింది. నిధుల సమీకరణ సామర్ధ్యం, గట్టి ప్రమోటరు, పటిష్ఠమైన వ్యూహాలు  ఈ కంపెనీ బలాలు.

 భారత్‌లో దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌కి సంబంధించి ఏఏప్లస్ రేటింగ్ పొందిన అతి కొద్ది ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్లో ఇదొకటి. 2015 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్లు 2016 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పెరిగాయి.
 
 రాడికో ఖైతాన్
 ప్రస్తుత ధర (రూ.)    141
 లక్ష్యం (రూ.)    166
 వృద్ధి శాతం    18
 ఎందుకంటే..!
 మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, కంటెసా రమ్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ వంటివి రాడికో లిక్కర్ బ్రాండ్స్‌లో పేరున్నవి. ఏప్రిల్ నుంచి యూపీలో ఎక్సైజ్ సుంకాన్ని 20-25 శాతం మేర తగ్గించారు. కర్ణాటకలో కొన్ని బ్రాండ్స్ ధరలు 6-7 శాతం పెరిగాయి. కొత్త ఉత్పత్తి ఎలక్ట్రా అమ్మకాలు మెరుగ్గా ఉండటం వంటివి సంస్థపై సానుకూల ప్రభావాలు చూపుతున్నాయి.
 ఆదాయాలు పెరుగుతుండటం, ప్రీమియం బ్రాండ్స్‌కి ఆదరణ వంటివి అనుకూలాంశాలు. మరోవైపు, ప్రభుత్వపరమైన నియంత్రణలు, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) ధరల పెరుగుదల వంటివి లాభదాయకతపై ప్రభావం చూపవచ్చని అంచనా.
 
 గ్యాబ్రియెల్ ఇండియా
 ప్రస్తుత ధర (రూ.)    126
 లక్ష్యం (రూ.)    151
 వృద్ధి శాతం    19
 ఎందుకంటే..!
 వాణిజ్య వాహనాలు, ప్యాసెంజర్, ద్వి..త్రిచక్ర వాహనాలు మొదలైన వాటికి షాక్ అబ్జార్బర్స్, ఫ్రంట్ ఫోర్క్స్ ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఎకానమీ మెరుగుపడుతుందన్న దాఖలాలు, స్థూల ఆర్థిక సంస్కరణలతో కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో 2016-2019 మధ్య చక్రగతిన 11 శాతం వృద్ధితో రూ.1,966 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా. ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవడం ద్వారా కంపెనీ అధిక ఆదాయాలు ఆర్జించే అవకాశాలున్నాయి. అయితే, ముడివస్తువుల ధర భారీగా పెరిగిన పక్షంలో దాన్ని బదలాయించలేకపోతే.. కంపెనీ మార్జిన్లు, ఆదాయాలపై ప్రభావాలు చూపించవచ్చు.
 
 జీఎస్‌ఎఫ్‌సీ
 ప్రస్తుత ధర (రూ.)    95
 లక్ష్యం (రూ.)    115
 వృద్ధి శాతం    21
 ఎందుకంటే..!
 పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల్ని తయారు చేస్తోందీ సంస్థ. గతేడాది జూలైలో ఏర్పాటు చేసిన నైలాన్ 6 ప్లాంట్లు, త్వరలో నెలకొల్పబోయే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్లాంటు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. 2018 ఆఖర్లో అందుబాటులోకి వచ్చే మూడో మెలామిన్ ప్లాంటు కూడా దీర్ఘకాలంలో వృద్ధికి ఉపయోగపడుతుంది. దేశీ మార్కెట్లో కాప్రోలాక్టమ్, మెలానిన్ తయారు చేసే అతి కొద్ది కంపెనీల్లో ఇదొకటి. రాబోయే ఏడాదిన్నర కాలంలో సంస్థకు కొత్తగా రూ.1,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నాయి. కమోడిటీ ధరల తగ్గుదల జీఎస్‌ఎఫ్‌సీకి లాభించగలదు. అయితే, క్రూడ్‌లో హెచ్చుతగ్గులు, కరెన్సీపరమైన ఒడిదుడుకులు.. చైనా నుంచి చౌక  దిగుమతుల వంటి రిస్కులు ఎదురవ్వొచ్చు.
 
 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
 బజాజ్ ఎలక్ట్రికల్స్
 ప్రస్తుత ధర (రూ.)    259
 లక్ష్యం (రూ.)       322349
 వృద్ధి శాతం    2434
 ఎందుకంటే..!
 ఫ్యాన్లు, లైట్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాల తయారు చేస్తోందీ సంస్థ. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ  రూ.2,500 కోట్లుగా ఉంది. పోటీ సంస్థలతో పోలిస్తే దేశవ్యాప్తంగా అమ్మకాలు విస్తరించడం కంపెనీకి సానుకూలం. బలమైన నెట్‌వర్క్ తోడ్పాటుతో సంస్థ మళ్లీ మార్కెట్ వాటా దక్కించుకోగలదని అంచనా.
 
 ఇండియా సిమెంట్స్
 ప్రస్తుత ధర (రూ.)    157
 లక్ష్యం (రూ.)       211263
 వృద్ధి శాతం    3467
 ఎందుకంటే..!
 దేశంలో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థల్లో ఒకటి.  స్పోర్ట్స్ వంటి ఇతర వ్యాపకాలను కాస్త పక్కన పెట్టి ప్రమోటర్లు మళ్లీ కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు కొన్నాళ్లుగా దిద్దుబాటు చర్యలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సిమెంటుకు డిమాండ్ పెరిగి, రాబడులు మెరుగుపడగలవని అంచనా.
 
 రిలయన్స్ ఇండస్ట్రీస్
 ప్రస్తుత ధర (రూ.)    1,053
 లక్ష్యం (రూ.)    1,225
 వృద్ధి శాతం    16
 ఎందుకంటే..!
 పెట్రో-కెమికల్స్, రిఫైనింగ్ తదితర కార్యకలాపాల్లో దాదాపు రూ.3 లక్షల కోట్ల టర్నోవర్‌తో అతి పెద్ద ప్రైవేట్ దిగ్గజాల్లో ఒకటి. గడిచిన కొన్నాళ్లలో ప్రధాన వ్యాపార విస్తరణ, టెక్నాలజీ ఆధునీకరణ మొదలైన వాటిపై సుమారు రూ.2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రాబోయే 12 నెలల్లో వీటి ఫలితాలు క్రమంగా కనిపిం చడం మొదలవుతుంది. ఇక జియో వెంచర్ విజయవంతమైతే స్టాక్ రీ-రేటింగ్‌కు దోహదపడవచ్చు.
 
 లుపిన్
 ప్రస్తుత ధర (రూ.)    1,490
 లక్ష్యం (రూ.)    2,050
 వృద్ధి శాతం    37
 ఎందుకంటే..!
 ఈ ఫార్మా సంస్థ షేరు గరిష్ట స్థాయి నుంచి 25-28 శాతం మేర పడిపోయింది. ప్రతికూల అంశాల న్నింటినీ మార్కెట్ ఇప్పటికే పరిగణనలోకి తీసేసుకుంది. ఆ మేరకు షేరు ధర తగ్గింది కూడా. అందుకని ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలోనే ఉన్నట్లు భా వించొచ్చు. గ్లూమెట్జా, ఫోర్టామెట్ వంటి జనరిక్ ఔషధాలు కంపెనీ లాభాలకు దోహదపడగలవు. 2017-18లో సంస్థ 40కి పైగా ఉత్పత్తులు ప్రవేశపెట్టొచ్చు
 
 ఏంజెల్ బ్రోకింగ్
 యాక్సిస్ బ్యాంక్
 ప్రస్తుత ధర (రూ.)    486
 లక్ష్యం (రూ.)    630
 వృద్ధి శాతం    29
 ఎందుకంటే..!
 రిటైల్ లోన్స్ ఊతంతో యాక్సిస్ బ్యాంక్ రుణాల మంజూరీలో బ్యాంకింగ్ పరిశ్రమ సగటును మించిపోయింది. 2012-16 ఆర్థిక సంవత్సరాల మధ్య చక్రగతిన ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో లోన్ బుక్ 20 శాతానికి పైగా పెంచుకునేందుకు తగిన సామర్థ్యం బ్యాంక్‌కుంది. మొండి బకాయిలు పెద్దగా పెరిగే అవకాశాలు లేనట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. మధ్యకాలికంగా 16-17 శాతం మేర నిలకడగా రిటర్న్ ఆన్ ఈక్విటీ నమోదు చేయవచ్చని అంచనా.
 
 ఈక్విటాస్ హోల్డింగ్స్
 ప్రస్తుత ధర (రూ.)    178
 లక్ష్యం (రూ.)    235
 వృద్ధి శాతం    32
 ఎందుకంటే..!
 కొత్తగా చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన సంస్థల్లో ఇదొకటి. సంస్థ ఇచ్చిన రుణాలన్నీ కూడా ప్రాధాన్యతా రంగ రుణాల పరిధిలోకి చేర్చేందుకు అర్హమైనవే. దీంతో 75 శాతం పీఎస్‌ఎల్ లక్ష్యం దీనికి పెద్ద సమస్యేమీ కాదు. డిపాజిట్లు సమీకరించవచ్చు గనుక ఆ మేరకు నిధుల సమీకరణ వ్యయాలు దాదాపు 250 బేసిస్ పాయింట్ల దాకా తగ్గి వ్యాపార నిర్వహణ మెరుగ్గా ఉండగలదన్న అంచనాలున్నాయి. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ 11 శాతం స్థాయిలో ఉండొచ్చు.
 
 అమర రాజా బ్యాటరీస్
 ప్రస్తుత ధర (రూ.)    1,014
 లక్ష్యం (రూ.)    1,218
 వృద్ధి శాతం    20
 ఎందుకంటే..!
 దేశీయంగా యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీలు తయారు చేసే రెండో అతిపెద్ద సంస్థ అమర రాజా. మార్కెట్ లీడర్ ఎక్సైడ్‌ను మించి వృద్ధి చెందుతోంది. 2010 ఆర్థిక సంవత్సరంలో పాతిక శాతంగా ఉన్న మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 35 శాతం స్థాయిలో ఉంది. డక్ట్‌ల తయారీకి సంబంధించి అంతర్జాతీయ దిగ్గజం జాన్సన్ కంట్రోల్‌తో భాగస్వామ్యం కూడా అమర రాజాకు తోడ్పడనుంది. ఆర్థిక రికవరీ, మార్కెట్ వాటా దక్కించుకోవడం తదితర అంశాల ఊతంతో కంపెనీ వచ్చే రెండేళ్లలో చక్రగతిన 18 శాతం స్థాయిలో వృద్ధి చెందవచ్చని అంచనా.
 
 భారత్ ఎలక్ట్రానిక్స్...
 ప్రస్తుత ధర (రూ.)    1,301
 లక్ష్యం (రూ.)    1,414
 వృద్ధి శాతం    9
 ఎందుకంటే..!
 కంపెనీకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దాదాపు 35 శాతం వాటా ఉంది. ప్రభుత్వం దేశీయంగా రక్షణ పరికరాల తయారీకి ప్రాధాన్యమిస్తుండటం, ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం, గడిచిన 26 నెలల్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సుమారు 50 బిలియన్ డాలర్ల విలువ చేసే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడం తదితర అంశాలు డిఫెన్స్ రంగ వృద్ధికి తోడ్పడనున్నాయి. తద్వారా రాబోయే కొన్నేళ్లలో బీఈఎల్ కూడా లబ్ధి పొందగలదనే అంచనాలున్నాయి.
 
 చాయిస్ బ్రోకింగ్
 టెక్ మహీంద్రా
 ప్రస్తుత ధర (రూ.)    435
 లక్ష్యం (రూ.)    580
 వృద్ధి శాతం    33
 ఎందుకంటే..!
 సాంకేతికంగా చూస్తే రూ.748 స్థాయి నుంచి గణనీయంగా రూ.407 స్థాయికి పడిపోయిన ఈ షేరు క్షీణత ఇక్కడితో ఆగిందని అంచనా. ఆకర్షణీయమైన ఈ ధరలో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా స్టాక్ మళ్లీ కోలుకోగలదు. టెక్నికల్ అంశాల ప్రకారం సమీప భవిష్యత్‌లో ఇది రూ.580కి చేరొచ్చు.
 
 చాయిస్ బ్రోకింగ్
 అశోక్ లేలాండ్
 ప్రస్తుత ధర (రూ.)    90
 లక్ష్యం (రూ.)    132
 వృద్ధి శాతం    46
 ఎందుకంటే..!
 టెక్నికల్ అంశాల ప్రాతిపదికన చూస్తే.. ఇది బుల్ ట్రెండ్‌ను సూచిస్తోంది. పైకి వెళ్లిన ప్రతిసారీ స్టాక్ మధ్యమధ్యలో స్వల్ప కరెక్షన్‌కి లోనవుతుండ టం బుల్ పట్టును తెలియజేసేలా ఉంది. రూ.75 స్థాయి దగ్గర ఇటీవలి క్షీణతకు అడ్డుకట్టపడినట్లేనని భావించవచ్చు.  
 
 నేషనల్ అల్యూమినియం
 ప్రస్తుత ధర (రూ.)    53
 లక్ష్యం (రూ.)    80
 వృద్ధి శాతం    51
 ఎందుకంటే..!
 సాంకేతికాంశాలను బట్టి చూస్తే ఈ స్టాక్‌లో అమ్మకాల కన్నా కొనుగోలు లావాదేవీలపైనే ఎక్కువగా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. తగ్గుదల ఆగి.. రివర్స్‌లో పైకి వెళ్లే క్రమంలో ఉన్న ట్లు తెలుస్తోంది. బుల్స్ కంట్రోల్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న ఈ షేరు సమీప భవిష్యత్‌లో మరిం త పైకి వెళ్లగలదని అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement