చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీరంగం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య వ్యవహారశైలి సొంత పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. వీధి రౌడీలా కంటే హీనంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను చూసి టీడీపీ నేతలే అదిరిపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ‘ఫైటింగ్’పై స్థానికులు మండిపడుతున్నారు.