79 వేల మందికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
Published Sat, Aug 24 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
చీపురుపల్లి,న్యూస్‌లైన్: జిల్లాలో గల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా(పీఏసీఎస్)ల పరిధిలో ఉన్న 79 వేల మంది రైతులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరిచే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ వంగపండు శివశంకరప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన చీపురుపల్లిలోని బ్రాంచ్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నాబార్డ్ సూచనల మేరకు తమ పీఏసీఎస్‌లలో రుణాలు పొంది ఉన్న ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ అకౌం ట్లు తెరిచే విధంగా తమ సిబ్బందికి సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ అకౌంట్లు తెరిచే ప్రక్రియను సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. అయితే రైతులందరికీ ఏటీఎం కార్డు ల మాదిరిగా ఉండే కార్డులను నాబార్డ్ మంజూరు చేయనుందన్నారు. దీంతోబాటు పీఏసీఎస్‌లలో మినీ ఏటీఎంలు కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఇకపై రైతులు తమ లావాదేవీలన్నీ మినీ ఏటీఎంల ద్వారా చేసుకోవచ్చునని చెప్పారు. రుణా లు, రాయితీలు, ఇన్‌పుట్ సబ్సిడీలు వంటి పథకాలు రైతులు నేరుగా పొందేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు.
అదే విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కాలానికి రూ.144 కోట్లు రుణలక్ష్యం కాగా ఇప్పటికే రూ.97 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పా రు. అలాగే దీర్ఘకాలిక రుణాలు రూ.4.50 కోట్లు లక్ష్యం కాగా, రూ.3కోట్లు ఇప్పటికే అందించడం జరిగిందన్నారు. డిపాజిట్లు రూ.50 కోట్లు లక్ష్యం గా పెట్టుకోగా, ఇప్పటికే రూ.40 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. సమావేశంలో ఆయన వెంట బ్రాంచ్ మేనేజర్ పి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement