చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9.30 లకు మంత్రి ఆరోగ్య కేంద్రానికి రాగా ఒక్క వైద్యుడూ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వైద్యులు రావాల్సి ఉంది. ఇక్కడ మొత్తం ఆరుగురు వైద్యులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మంత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంకు వెళ్లారు.
ఆస్పత్రిలో కేంద్రమంత్రి ఆకస్మిక తనిఖీలు
Published Sat, Sep 26 2015 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement