చంద్రబాబు మోసగాడు
చీపురుపల్లి : ప్రతి ఒక్కరినీ మోసం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజమని, ప్రజలను మోసం చేస్తూనే అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తీవ్రంగా విమర్శించారు. మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. పట్టణంలోని రాధామాధవ ఫంక్షన్ హాల్‌లో చీపురుపల్లి మండల పార్టీ కార్యకర్తల సమావేశం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసగాడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలిసినా.. గడిచిన పదేళ్ల లో మారి ఉంటాడనే ఆలోచనతో ఓటు వేశారన్నారు. చంద్రబాబు తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ప్రజలు గమనించారని, దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత స్వల్ప కాలంలో ప్రజా వ్యతిరేకత రాలేదని చెప్పారు. అమలు కాని హామీలిచ్చి మరిన్ని మోసపూరిత హామీలు ఇస్తున్నారని విమర్శించారు.
మళ్లీ అధికారంలోకి రామనితెలిసి లేనిపోని హామీలు గుప్పిస్తునారని దుయ్యబట్టారు. నిరుద్యోగులు, రైతు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశాడని ఆరోపించారు. కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయూలన్నారు. పోలీసులను తీసుకుని జన్మభూమికి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారని.. గ్రామాల్లో ప్రజలు ఉన్నారో... రౌడీలు ఉన్నారో తెలుగుదేశం నేతలు చెప్పాలన్నారు. కార్యకర్తల కోసం అర్ధరాత్రి అరుునా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలు జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేదన్నారు. అందుకే లేనిపోని హామీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పిల్లనిచ్చిన మామను, ఓట్లేసిన ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశాడని విమర్శించారు.
బెల్టు దుకాణాలు నిషేధిస్తానని చెప్పి మొబైల్ బెల్టు దుకాణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంత్రి గారికి మధ్యాహ్న భోజనాలు చెక్ చేయడం తప్ప మరొక పని లేదని విమర్శించారు. టీడీపీ పాలనతో అభివృద్ధిని మరచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అంతకు ముందు దివంగత వైఎస్‌ఆర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించిన పార్టీ నేతలు నివాళులర్పించారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ కె. వి.సూర్యనారాయణరాజు, పార్టీ నాయకులు వాకాడ శ్రీను, మామిడి అప్పలనాయుడు, ఎస్.బంగారునాయుడు, నడిపేన శ్రీనివాసరావు, పైడితల్లి, రెడ్డి గురుమూర్తి, బండారు ఆనంద్, చీపురుపల్లి మండల నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కరిమజ్జి శ్రీనివాసరావు, చందక గురునాయుడు, కోరాడ నారాయణరావు, పిసిని శ్రీనివాసరావు, గొర్లె రమణ, పనస అప్పారావు, బవిరి రవిశంకర్, రేవల్ల సత్తిబాబు, పతివాడ రాజారావు, అప్పికొండ ఆదిబాబు, మహంతి ఉమ, ముజ్‌కీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ వసూళ్లకు టీడీపీ ధరల పట్టిక
చీపురుపల్లి : జిల్లాలో అక్రమ వసూళ్లకు తెరలేపిన తెలుగుదేశం నాయకులు ఏకంగా ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ ధరల పట్టిక పెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఇక్కడ విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి నుంచి గ్రామ స్థారుు నాయకుడు వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మద్యం సిండికేట్ల వద్ద టీడీపీ నాయకులు నెలవారీ మామూళ్లకు ఫిక్స్ కావడంతో అధిక ధరలకు మద్యం విక్రయూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన సంతకాల్లో ఏ సంతకం అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో పోలీసుల అండతో జన్మభూమి కార్యక్రమానికి తెలుగుదేశం నేతలు వెళ్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీని బలోపేతం చేసే దిశగా గ్రామ స్థారుు నుంచి కమిటీలు వేస్తున్నట్టు తెలిపారు. తొలి దశలో 20 మండలాల్లో కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చీపురుపల్లి నుంచి కార్యకర్తల సమావేశాలు ప్రారంభించామన్నారు. సమావేశంలో సీజీసీ సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుది మోసపూరిత చరిత్ర
గర్భాం (మెరకముడిదాం) : ముఖ్యమంత్రి చంద్రబాబుది మొదటి నుంచి మోసపూరితమైన చరిత్రేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి దుయ్యబట్టారు. గురువారం మండలంలోని గర్భాం గ్రామంలో మాజీ ఎంపీపీ తాడ్డె కృష్ణారావు మిల్లు వద్ద నిర్వహించిన మండల పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని, ఎన్‌టీఆర్‌ని ఒక్కసారి మోసం చేస్తే, ప్రజలను మాత్రం మూడుసార్లు మోసం చేశారని దుయ్యబట్టారు. మెరకముడిదాం మొదట్నుంచి రాజకీయ చరిత్ర గల మండలమని అన్నారు. జిల్లాలో ఏ ఒక్క కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానని మరిచిపోవద్దని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు, మహిళలు చంద్రబాబుకు ఓటు వేసి చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నార న్నారు పార్టీ మండలాధ్యక్షుడిగా తాడ్డె కృష్ణారావును నియమించినట్టు ఆయన ప్రకటించారు. జిల్లా పార్టీ కార్యదర్శులుగా బూర్లె న రేష్‌కుమార్‌ను, కర్రోతునాగేశ్వరరావును నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అనంతరం మండల పార్టీ తరఫున కోలగట్లను, బెల్లానను మండల పార్టీ నాయకులు దుశ్శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అవనాపువిజయ్, గొర్లె వెంకటరమణ, మామిడి అప్పలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తాడ్డె కృష్ణారావు, శనపతిసిమ్మినాయుడు, సర్పంచ్‌లు బూర్లెనరే ష్‌కుమార్, మండలసత్యనారాయణ, పిన్నింటిసుగణాకరరావు, నాయకులు పల్లేడబంగార్రాజు, కొమ్ముశంకర్రావు, గాంధీ, ఎంఎన్.అప్పలనాయుడు, రామకృష్ణ, రామస్వామి, సీతారామరాజు, సన్యాసినాయుడు, ఆదినారాయణ, మధు, పులిగుమ్మి సర్పంచ్ భర్త రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.