చీపురుపల్లి : నియోజవర్గంలోని అధికార పార్టీలో ము సలం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు పెత్తనాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు రెండు గ్రూపులుగా ఉన్న పార్టీ నేతలు..ఎన్నికల తరువాత ఒక్కటయ్యూరు. అయితే గద్దే వ్యాఖ్యలతో మళ్లీ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. గతంలో పరిస్థితిని పక్కన పెడితే తాజాగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మృణాళినిని గద్దే ఓవర్ టేక్ చేస్తూ పలు ప్రకటనలు చేస్తుండడం తాజా వివాదానికి దారి తీసింది. వాస్తవానికి మంత్రి మృణాళిని ఆదేశాలతోనే గద్దే ఇలా వ్యవహరిస్తున్నారా లేదా అంతాతానై వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎంపీపీ, వైస్ ఎంపీపీల పేర్లును ప్రకటించి గద్దే పార్టీలో గందరగోళానికి తెర తీసారు.
రెండు రోజులుగా గద్దే ప్రకటనలతో విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు సోమవారం బయటపడ్డారు. గద్దే తీరుపై తీ వ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో తెలుగుదేశం నాయకులు ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ గద్దే వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాకుండా ఎంపీపీ వైస్ ఎంపీపీలను నియమించడానికి ఆయన ఎవరంటూ మండిపడ్డారు. మండల స్థాయిలో తీసుకునే నిర్ణ యాన్ని చెప్పడానికి ఆయన ఎవరంటూ గుర్ల మండల నాయకులు ప్రశ్నించారు. అంతేకాకుండా గద్దే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లు భోగట్టా. ఏదిఏమైనప్పటికీ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న మృణాళిని సొంత నియో జకవర్గంలోనే పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ప్రెస్‌మీట్లు పెట్టుకుని రోడ్డెక్కి, పార్టీ పరువు బజారు కీడుస్తుండడంతో చర్చనీయమైంది.
చీపురుపల్లి టీడీపీలో ముసలం
Published Tue, Jul 1 2014 4:01 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
Advertisement