babu rao
-
‘మతం మెలికను రద్దు చేయాలి’
ఢిల్లీ: మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్యాంగ ఫలాలను దళితులకు దూరం చేసిన 1950లో ఇచ్చిన షెడ్యూల్డు కులాల రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చెయ్యాలని కోరుతూ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబూరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి మేధావుల బృందం ఎంక్వైరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ను కలిసింది. ‘‘ డెబ్బై నాలుగు సంవత్సరాల గణతంత్ర దేశ చరిత్రలో దళితుల మెడకు బిగించిన మతం మెలికను ఎత్తి వేయడానికి తగిన సిఫారసు చెయ్యాలని కోరాం. ఈ ఉత్తర్వు వలన దళితులు మతపరంగా విభజించబడ్డారు. ఏ మతంలోని దళితులకైనా కులపరంగా వివక్ష ఉంది. ఆ వివక్ష రూపాలను , వివక్ష జరుగుతున్న తీరును తెలిచెప్పాం. ఈ ఉత్తర్వు వలన క్రైస్తవ దళితులు షెడ్యూల్డు కులాలకు కల్పించే ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారు. అంతే కాకుండా విద్య ఉద్యోగాలలో కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మతం, సంస్కృతి సంప్రదాయాలు ఆయా భౌగోళిక పరిస్థితుల ఆధారంగ వుంటాయి. సాంస్కృతిక విషయాలను గుర్తించాలి. అదే కోణంలో భారత దేశంలో క్రీస్తు పూర్వమే నెలకొన్న హిందూ మతాన్ని అందులోని కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ..ఎక్కడో ఇజ్రాయేలులో పుట్టిన క్రైస్తవ మతం లో కులం లేదు కాబట్టి భారత దేశంలో క్రైస్తవంలోకి చేరే దళితులకు కుల వివక్ష వుండదనే సూత్రీకరణల ఆధారంగా క్రైస్తవం తీసుకునే దళితులను షెడ్యూల్డు కులాల వారిగా గుర్తించనని చెప్పడం అర్థం లేనిలేదు. ఇజ్రాయెల్, ఇతర క్రైస్తవ దేశాలలో రంగు, జాతి వివక్ష అక్కడ ఉంది. ఆ దేశాలలో హిందూ మతం పుట్టలేదు. కాబట్టి అక్కడ కుల వివక్ష లేదు. భారత దేశంలో హిందూ మతం వుండడం వలన భారత దేశ మంతటా కుల వివక్ష విస్తరించింది. భారత్‌తో అన్ని మతాలలో కులం వుంటుందని అక్కడ అన్ని మతాలలో జాతి , రంగులను బట్టి వివక్ష వుంటుంది. భారత దేశంలో వుండే అన్ని రకాల మతాలలో కులం వుంటుందని భారతీయులు అధికంగా వలసపోతున్న అభివృద్ధిచెందిన దేశాలలో కుల వివక్ష ఆరంభమయ్యింది’ అని జస్టిస్ బాలకృష్ణన్ అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ బాబు రావు వివరణ ఇచ్చారు.‘‘ నాటి రాష్ట్రపతి ఉత్తర్వు నేటికీ దళితుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును , ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించే హక్కును దళితులు మాత్రమే కోల్పోతున్నారు. తద్వారా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పులుగుజ్జు సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘మాదిగ, మాల, పరయ, పులయ వంటి కులాల పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందనే ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రుజువు చేసింది’’ అని బ్రదర్ జోస్ డేనియల్ చెప్పారు. ‘‘పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఏ మతం వారికైనా కులం తప్పకుండా రికార్డు చేయాలని అటువంటప్పుడు దళితులు ఏ మతంలో వుంటే ఏముంది’’ అని తెలంగాణ హైకోర్టు లాయరు చాట్ల సుధీర్ అన్నారు. సామాజిక, ఆర్థిక , రాజకీయ రంగాల్లో దళితులు రాణించాలంటే అడ్డంకిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని విన్నవించారు. అనేక రకాల అభిప్రాయాలు విన్న తరువాత నవంబరు మాసంలో ఆంధ్ర తెలంగాణకు రాష్ట్రాలు పర్యటిస్తానని తమ వాదనలు క్షేత్ర స్థాయి పర్యటనలో తెలియజేయాలని జస్టిస్ బాలకృష్ణన్ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతినిధి బృందంలో ఫా. అంతోనిరాజ్ సీబీసీఐ సెక్రటరీ, బిషప్ వీరాజీ ఇజ్రాయెల్, గోనె సాల్మన్ రాజ్ , సిస్టర్ అనేయ ఫెర్నాండెజ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్స్ ఎలా అమ్ముతావో చూస్తా.. రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, బోథ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. బెదిరింపుల ఆడియో బయటకు లీక్ అవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బోథ్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాపురావు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మధ్యవర్తి సాయంతో కొంత భూమి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్.. సదరు మధ్యవర్తిని భూమికి సంబంధించి రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో, అతను ఎమ్మెల్యే బాపురావును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిరణ్‌కు బెదిరింపులకు గురిచేశాడు. వెంచర్ ఎలా వేశావ్.. ప్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఎమ్మెల్యే బెదిరింపుల అనంతరం రియల్ ఎస్టేట్ కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరినట్టు సమాచారం. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ నడుస్తోంది. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను జమ్మూకశ్మీర్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాబూరామ్‌కు, అలాగే, రెండో అత్యున్నత శౌర్యపతకం కీర్తి చక్రను కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్‌లకు కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరు వీరమరణం పొందారని కొనియాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయుధ బలగాలకు 144 శౌర్య పతకాలను ప్రకటించారు. ఇందులో 15 శౌర్య చక్ర, 120 సేనా పతకాలు, అశోక చక్ర, కీర్తి చక్ర ఒక్కోటి చొప్పున ఉన్నాయి. జమ్మూలోని పూంఛ్ జిల్లాకు చెందిన బాబూ రామ్ 1999లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారని పోలీసు శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారని పేర్కొంది. శ్రీనగర్‌లోని రత్‌పొరాకు చెందిన కానిస్టేబుల్ భట్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన గండేర్బల్లో విధుల్లో ఉండగా ఉగ్రవాదుల తూటాలకు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. మూడో అత్యున్నత సాహస పురస్కారం శౌర్యచక్రను ఆర్మీకి చెందిన ఆరుగురికి, వైమానిక దళానికి చెందిన ఇద్దరికి, ఒక నేవీ అధికారికి, ఆరుగురు పోలీస్ పారా మిలటరీ సిబ్బందికి కేంద్రం ప్రకటించింది. మొత్తం 15 పతకాల్లో నాలుగు మరణానంతరం ప్రకటించారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మేజర్ అరుణ్ కుమార్ పాండే, రవి కుమార్ చౌధరి, కెప్టెన్ అశుతోష్ కుమార్ (మరణానంతరం), కెప్టెన్ వికాస్ ఖత్రి, రైఫిల్ మ్యాన్ ముకేశ్ కుమార్, సిపాయి నీరజ్ అహ్లావత్లకు శౌర్యచక్ర ప్రకటించినట్లు ఆర్మీ తెలిపింది. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో నలుగురు మావోయిస్టులను చంపిన సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు కోబ్రా కమాండోలకు శౌర్యచక్ర ప్రకటించింది. 201వ బెటాలియన్‌కు చెందిన వీరు డిప్యూటీ కమాండెంట్ చితేశ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ మంజీందర్ సింగ్, కానిస్టేబుల్ సునీల్ చౌధరి. వీరు 2019 మార్చి 26వ తేదీన సుక్మా జిల్లా జగర్గుండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉన్న నలుగురు అగ్రశ్రేణి మావోయిస్టులను హత మార్చడంతోపాటు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మావోయిస్టులకు తీవ్ర నష్ట వాటిల్లింది. వీరితోపాటు, నేవీలో కెప్టెన్ సచిన్ రుబెన్ సెకిరాకు, వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ పర్మిందర్ అంటిల్, వింగ్ కమాండర్ వరుణ్ సింగ్‌లకు శౌర్య చక్రను ప్రకటించారు. -
నిబద్ధత.. నా నడత
సీపీఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టుగా మారిన డాక్టర్ మిడియం బాబూరావు ఇప్పటికీ అదే నిబద్ధతతో ప్రజా పోరాట పంథాలో పయనం సాగిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటైన భద్రాచలం స్థానం నుంచి 2004–2009 మధ్య ఎంపీగా సేవలందించిన మిడియం.. తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు.- తూమాటి భద్రారెడ్డి సాక్షి– కొత్తగూడెం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం పరిధిలోని వాజేడు నుంచి విశాఖపట్టణం జిల్లా అరకు వరకు విస్తరించి ఉన్న అప్పటి భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం 450 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండేది. ఈ నియోజకవర్గం పరిధిలో అప్పటి ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు, భద్రాచలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం (రంపచోడవరం), విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి, పాడేరు శాసనసభ సెగ్మెంట్లు ఉండేవి. ఈ ఏడు సెగ్మెంట్ల పరిధిలో తిరిగేందుకు మిడియం బాబూరావు ఒకే ఒక్క అద్దె వాహనాన్ని ఉపయోగించారు. మొత్తం ఎన్నికల ఖర్చు రూ.10 లక్షలు కూడా కాలేదని మిడియం ‘సాక్షి’కి తెలిపారు. 2004 ఎన్నికల్లో సీపీఎం తరపున సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మిడియం పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొమరం ఫణీశ్వరమ్మపై 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రూ.2కే వైద్యం.. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన మిడియం బాబూరావు 1951లో జన్మించారు. 1980లో కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అప్పట్లో భద్రాచలం ప్రాంతం నాన్ ముల్కీ పరిధిలో ఉండడంతో కర్నూలుకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెడిసిన్ చదువుతున్న సమయంలో సీపీఎం అనుబంధ ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో అందులో చేరారు. ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. సుందరయ్య కోరిక మేరకు అప్పటి సీపీఎం రాష్ట్ర నాయకుడు బాలాజీదాస్ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం రాజమండ్రిలో ప్రజా వైద్యశాల స్థాపించి కేవలం రెండు రూపాయలకే వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. అంతకన్నా ముందు పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు రామచంద్రారెడ్డి నెల్లూరులో నడిపే పీపుల్స్ పాలీ క్లినిక్‌లో మిడియం పని చేశారు. ఈ క్లినిక్ ఇప్పటికీ నెల్లూరులో నడుస్తుండడం గమనార్హం. ఈ ఆసుపత్రి స్ఫూర్తితోనే బాబూరావు రాజమండ్రిలో 1982లో ప్రజావైద్యశాల నెలకొల్పారు. 2006 వరకు దీనిని నడిపారు. వైద్యసేవలు అందజేస్తూనే సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. విధానాల ప్రాతిపదికన ప్రచారం.. అప్పట్లో ఎన్నికల్లో విధానాల ప్రాతిపదికన ప్రచారం సాగేదని, ప్రస్తుతం విచ్చలవిడి డబ్బు ప్రవాహం ప్రాతిపదికన ప్రచారం సాగుతోందని బాబూరావు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న మిడియం వైద్యసేవలు నిలిపేసి పూర్తి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అప్పుడూ, ఇప్పుడూ ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా పని చేయడం ఆనందంగా ఉందని మిడియం చెబుతున్నారు. ఇప్పుడన్నీ ‘కార్పొరేటీకరణ’రాజకీయాలు దేశంలో ఆర్థిక రంగంలో 1991లో ప్రారంభమైన నయా ఉదారవాద విధానాలు ప్రస్తుతం రాజకీయ రంగంలోకీ వచ్చాయని మిడియం చెబుతున్నారు. రాజకీయం పూర్తి కార్పొరేటీకరణ అయిందంటున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అవలంబిస్తున్న పాలకవర్గాలు అర్హత లేకున్నా తమకు సన్నిహితంగా ఉండేవారికే అవకాశాలిస్తూ, మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. పార్లమెంటులో ప్రైవేటుగాపలు బిల్లులు పార్లమెంటులో ప్రతి సభ్యునికి ప్రైవేటుగా బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్వోఎఫ్ఆర్ (రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్), పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో ప్రవేశపెట్టానన్నారు. తరువాత వీటిని ప్రభుత్వం చట్టం చేసింది. వన సంరక్షణ సమితి ద్వారా కేంద్రం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో ప్రపంచ బ్యాంకు పథకం ద్వారా ప్లాంటేషన్ చేపట్టింది. దీంతో గిరిజనులకు అన్యాయం జరిగింది. దీంతో ఆర్వోఎఫ్ఆర్ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. ప్రయోజకులైన వారు కన్నవారిని సాకేలా పెట్టిన బిల్లు సైతం చట్టం అయిందన్నారు. చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కాఫీ తోటలు వేసే రైతులకు గిట్టుబాటు ధర, రాయితీలు ఇచ్చేలా చేయడం సంతప్తిని ఇచ్చిందన్నారు. భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణం తన హయాంలోనే జరిగిందన్నారు. -
నవ చేతనా పాళి నార్ల
తెలుగుజాతిని కదిలించిన చేతనా పాళి నార్ల వెంకటేశ్వరరావు. గడుసుదనమే బాణిగా, వ్యంగ్య చమత్కారాలే పాళిగా, సూటిదనమే శైలిగా తెలుగు పత్రికా రంగాన్ని 5 దశాబ్దాలపాటు ఏలిన సంపాదక శిరోమణి నార్ల వెంకటేశ్వరరావు. 1940వ దశకంలో జాతి పిత మహాత్మాగాంధీ మాటకు తిరుగు లేదు. ఆయన బాటకు ఎదురు లేదు. అలాంటి సందర్భంలో గాంధీ నిర్ణయాన్ని సైతం ప్రశ్నించిన నిర్భీతికలిగిన పాత్రికేయుడు నార్ల. తెలుగు వారంటే చులకన బావమున్న చక్రవర్తుల రాజగోపాలాచారిని 1946లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు గాం«ధీ ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే గాంధీ నిర్ణయాన్ని, రాజాజీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నార్ల ప్రశ్నించి సంచలనం కలిగించారు. 1908 డిసెంబరు 1న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించిన నార్ల ప్రాథమిక విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. బాల్యం నుండి సామాజిక స్పృహ ఆధికంగా కలిగిన నార్ల వెంకటేశ్వరరావు తన కలంతో సామాజిక రుగ్మతలపై ఆలుపెరగని పోరుసల్పారు. పత్రికా రచనలో నూతన పోకడలకు శ్రీకారం చుట్టి వ్యక్తీకరణను అందులో చొప్పించారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల ద్వారా తెలుగు జాతిని జాగృతం చేసారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా తెలుగు పత్రికారంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కిం చారు. వాడుక భాషకు పట్టం కట్టిన నార్ల పత్రికల్లో ‘బడులు వాడే వాడు బడుద్దాయి’ అని చమత్కరించారు. సంపాదకుడు కాదు ఎడిటర్ అనాలని సరి దిద్దారు. వీఆర్ నార్లగా నాటికలు, కవితలు, చరిత్ర గ్రంథాలు రాశారు. మూఢ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ ‘సీతాజోస్యం’ అనే నవల రచిం చారు. జాబాలి, నరకంలో హరిశ్చం ద్రుడు, ద్రౌపది, హిరణ్యకశ్యప వధ అనేవి ఆయన ఇతర రచనలు. ‘మనం మన దాస్యబుద్ధి’ అనే శీర్షికతో ఆయన ఎమర్జెన్సీని విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌గాంధీలపై చేసిన సూటి విమర్శ సంచలనం కలిగించింది. 1985 ఫిబ్రవరి 16న ఈ కలం యోధుడు తెలుగు పత్రికా రంగానికి శాశ్వతంగా వీడ్కోలు పలికి తుదిశ్వాస విడిచారు. (నేడు నార్ల వెంకటేశ్వరావు వర్ధంతి) వ్యాసకర్త :డా‘‘ యస్. బాబురావు మొబైల్ : 95730 11844 -
ఆదివాసీలతో పెట్టుకుంటే పుట్టగతులుండవ్
నార్నూర్ (ఆదిలాబాద్): ఆదివాసీలతో పెట్టుకుంటే సీఎం కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదివాసీలది ఆకలి, సామాజిక న్యాయపోరాటమని పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ‘ఆదివాసీల అస్థిత్వం’ పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఐక్యంగా ఉండి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో ఉద్యమించాలన్నారు. మావ నాటే మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అంటూ తీర్మానం చేయాలన్నారు. మే 9న హన్మకొండలో 5 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామన్నారు. -
డీసీపీ బాబురావుపై డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నగర కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీగా పనిచేస్తున్న బాబురావుపై అతడి మొదటి భార్య వేదశ్రీ డీజీపీ మహేందర్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేసింది. తనతో 25ఏళ్ల పాటు కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయిన బాబురావు విడాకులివ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తమకు తెలియకుండానే మతం మార్చుకున్నాడని, చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ.5 లక్షలు తీసుకుని విడాకులకు ఒప్పుకోవాలని వేధిస్తున్నాడని తెలిపింది. విజయవాడలో తనకు సంబంధించిన రూ.కోటి విలువ చేసే భూమిని, తానే వేదశ్రీ అని చెప్పుకుని బాబురావు రెండో భార్య అమ్మకుందని ఆరోపించింది. బాబురావు వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. -
మావో’లతో సంబంధం లేదు
ఆదిలాబాద్ అర్బన్: ఆదివాసీల ఉద్యమానికి, మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు లంబాడీలు కుట్ర పన్నుతున్నారని, ఆదివాసీల వెనుక మావోయిస్టులు ఉన్నారన్న అభిప్రాయం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని.. లేని పక్షంలో అణచివేతకు గురవుతుందని సూచించారు. తాము ఎస్టీలమని చెప్పుకోవడానికి లంబాడీల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఆ జీవోలే మనకు తుపాకులని వివరించారు. జనవరి 4న తహసీల్దార్ కార్యాలయాల ముందు, 15న కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి జీవో కాపీలను అధికారులకు అందిస్తామన్నారు. సమావేశంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. -
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
హైదరాబాద్: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఉద్యమాన్ని ఆదివాసీలు తీవ్రతరం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక సంఘర్షణలు నెలకొన్నాయన్నారు. గత 40 సంవత్సరాలుగా రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలుగా చలామణి అవుతూ ఆదివాసీల రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లంబాడీలు కేవలం జీవో నం. 149 ద్వారా మాత్రమే ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, కబ్బాకుల రవి తదితరులు పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు
విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికలు సీఏం చంద్రబాబు నాయుడికి, లోకేశ్‌కు గుణపాఠం నేర్పాయని సీపీఎం నేత బాబురావు అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను చాలా తెలిగ్గా కొని విజయం సాధించారిని చెప్పారు. వందల మంది ఓటర్లు ఉన్న స్థానాల్లో టీడీపీ గెలిసింది. కానీ లక్షల మంది ఓటర్లు ఉన్న స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారని బాబురావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాల పై టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఏపీలో మీడియా చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు వత్తాసు పలుకుతోందిని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిందని అన్నారు. చంద్రబాబుకు రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తానే సీఎం అవుతాననే అహంభావం పనికిరాదని సీపీఎం నేత బాబురావు అన్నారు. అలాంటి భ్రమలు పనికిరవ్వాని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పుతారన్నారు. -
ఇంటిస్థలం విషయంలో ఘర్షణ
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి ప్రహరీ స్థలం విషయంలో బంధువులైన మందా బాబూరావు, మందా వీరాంజనేయులు కుటుంబాల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు దాడి చేసుకోగా ఆరుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం
ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతిపురం వివేకానంద కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అదే కాలనీకి చెందిన బాబురావు(60) ఆమెను ఎత్తుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. రక్తపు మరకలతో ఇంటికి వచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. చిన్నారి అసలు విషయం చె ప్పింది. దీంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. గతంలో లైంగిక దాడి కేసులో బాబురావు ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించి ఈ మధ్యే బయటకు వచ్చాడు. -
ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు
నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయనను అరెస్టు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి ఇండియాకు వచ్చిన ఆయనను గుంటూరులోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని రెండు వారాల రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
బాలికపై కాంట్రాక్టర్ అకృత్యం, కేసు నమోదు
విశాఖ: విశాఖ జిల్లాలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్లో బుధవారం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామ్మూర్తి పంతులపేటలో ఆరేళ్ల బాలికపై ఓ కాంట్రాక్టర్ అకృత్యానికి ఒడిగట్టాడు. కాంట్రాక్టర్ బాబురావు (50)పై బాధితురాలి తల్లిదండ్రులు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కాంట్రాక్టర్ బాబురావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాపారి దారుణ హత్య
-
వ్యాపారి దారుణ హత్య
నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. చంపాపేటలో ఫ్రెండ్స్ క్లబ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న బాబురావు అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం భాస్కర వైన్స్ సమీపంలో కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శంకుస్థాపన ముందే హామీలు నెరవేర్చాలి
సీపీఎం నేత బాబూరావు విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రాజ ధాని ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోందని అన్నారు. రాజ దాని రైతులు, ప్రజల నోట్లో మట్టికొట్టి నీరు, మట్టి తెచ్చి వేసి ప్రభుత్వం విస్తత ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై ఉన్న సీఎం నివాసం పనుల నుంచి శంకు స్థాపన ఏర్పాట్ల వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే ఉపయోగించుకుంటున్నారని అన్నారు. కనీసం రోడ్లు వేసే కూలీలుగా కూడా రాజధాని ప్రాంత పేదలకు ఉపాధి కల్పించడంలేదని ఆవేదన వక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి హామీ పనులు ఇప్పిస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ముగ్గురికి మాత్రమే వంద రోజుల పని కల్పించిందన్నారు. రాజధాని ప్రాంతంలో డ్వాక్రా రుణమాఫీ, ఎన్టీర్ క్యాంటీన్ల ఏర్పాటు, వద్ధాశ్రమాలు, ఇళ్లులేని వారికి ఇళ్లు, ఆక్రమణల క్రమబద్దీకరణ, ఇళ్లపట్టాలు, నిర్మాణాల్లో స్థానికులకు ప్రాధాన్యత, గ్రామ కంఠాల సమస్య పరిష్కారం వంటి హాలు ఇంకా అమలుకాలేదని బాబూరావు చెప్పారు. -
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
దర్జాగా తిరుగుతున్న ప్రిన్సిపాల్బాబురావు
-
’ప్రిన్సిపాల్‌కు శిక్ష పడాల్సిందే’
-
'రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి'
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో తన ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. ఏడాదికాలంగా ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునుందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టారని బాబూరావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షపై టీడీపీ ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. -
మీ పదజాలం పరిధి పరీక్షించడానికి
SYNONYMS AND ANTONYMS Synonyms means that words that have the SAME meaning. Antonyms means that words that have the OPPOSITE meaning. Almost all the competitive tests will have these items. It is to test your vocabulary range in English. You may have done similar tests in your school too. However, there is always a possibility of testing your vocabulary in a given context. In other words, your ability to use words appropriately will be tested. If a word is given in a passage, you should have the ability to identify its use in a meaning. Isolated words can be different from context based words. Look at the following examples: 1) He found a chair to sit and rest. 2) He was denied the chair in spite of his achievements. 3) Though he was requested to chair the meeting, he politely declined the offer. In sentence 1, the meaning is: "a piece of furniture" In sentence 2, the meaning is: "the position of headship, top position etc." In sentence 3, the meaning is: "to preside over" We can also learn words singly and for this test, that level may be adequate. But in language proficiency testing, anything or everything can be tested. Model questions Directions (Q.No. 1 - 3): Select the words which have almost the SAME meaning to the words given. 1. principal a) chief b) important c) outstanding d) distinguished 2. hoard a) save b) stock c) pile d) add 3. ultimate a) final b) true c) single d) real Directions (Q.No. 4 - 6): Find words that have almost the OPPOSITE meaning to the given word. 4. immature a) experienced b) old c) cautious d) thoughtful 5. stiff a) sympathetic b) supple c) soft d) humble 6. avoid a) greet b) fight c) face d) like Answers: 1) a; 2) b; 3) a; 4) a; 5) b; 6) a. SPELLINGS In the following tests some of the words that are frequently given in competitive tests are given. Try to learn them. Simultaneously, learn their meanings too. It will help you. Find the word that is spelt wrongly, in the following set of words. 1. (a) hilarous (b) abstinence (c) abrasive (d) absence 2. (a) cereal (b) vacum (c) ceremony (d) ceramic 3. (a) damage (b) dainty (c) virtuel (d) dairy 4. (a) lier (b) hammer (c) slimmer (d) drummer 5. (a) vilify (b) rabit (c) hillock (d) mileage 6. (a) awkword (b) humane (c) virtuous (d) calendar 7. (a) vivacious (b) rustic (c) annul (d) twelth 8. (a) awkward (b) millionair (c) memorable (d) pacify 9. (a) Eskimos (b) stable (c) pityable (d) miserly 10. (a) eradicate (b) exuberant (c) stallion (d) magnificient 11. (a) animation (b) suspision (c) vaporization (d) erosion 12. (a) animosity (b) advercity (c) opportunity (d) velocity 13. (a) mangoes (b) flamingos (c) geckoes (d) Eskimoes 14. (a) wretched (b) wrestle (c) wreath (d) wreckless 15. (a) awkward (b) viceous (c) wicked (d) majestic Answers: 1) a; 2) b; 3) c; 4) a; 5) b; 6) a; 7) d; 8) b; 9) c; 10) d; 11) b; 12) b; 13) d; 14) d; 15) b. Some more spellings.... Here are some more words that have tricky spellings. These are words which are difficult to spell even for native speakers - Americans and the English. In India we follow in our text books, newspapers, office correspondence British spellings. In software industry, American English is more common. 1. (a) leasure (b) leisure (c) liesure (d) leasure 2. (a) maintainance (b) mentainance (c) maintenance (d) maintinance 3. (a) restuarant (b) restaurant (c) restaurent (d) restarent 4. (a) sargeant (b) sergeant (c) saurgent (d) sargent 5. (a) acomodate (b) accomodate (c) accammodate (d) accommodate 6. (a) inagurate (b) inaugurate (c) inaugurete (d) inagarate 7. (a) beleive (b) belive (c) believe (d) beleeve 8. (a) garanty (b) garenty (c) guarantee (d) guarentee 9. (a) manouver (b) manoeuvre (c) manoeuver (d) manover 10. (a) supercede (b) supersede (c) superceed (d) superseed 11. (a) conscientious (b) conccienscious (c) consentious (d) consciontious 12. (a) heirachy (b) hairarchy (c) hierarchy (d) hiearky 13. (a) questionaire (b) questionnair (c) questionnaire (d) questioneer 14. (a) colectable (b) collectible (c) collactable (d) collectble 15. (a) personel (b) parsonnel (c) persannel (d) personnel 16. (a) privlage (b) privilage (c) privilege (d) privlege 17. (a) indispensabl (b) indispenseble (c) indespensable (d) indispensible 18. (a) embarass (b) embarrass (c) embracces (d) embrass 19. (a) emature (b) amature (c) imature (d) amateur 20. (a) schidule (b) schedule (c) shedule (d) skedule Answers: 1) b 2) c 3) b 4) d 5) d 6) b 7) c 8) d 9) c 10) b 11) a 12) c 13) c 14) b 15) d 16) c 17) d 18) b 19) d 20) b. Previous Questions Directions (Q.No.1 - 4): Choose the closest meaning of the given words: 1. agony: a) collect b) care c) mad d) pain 2. govern: a) amplify b) rule c) catch d) sable 3. obstacle: a) penalty b) revenge c) crime d) barrier 4. magnitude: a) attitude b) logic c) size d) progress Directions (Q.No. 4 - 8): Choose the word that has almost opposite meaning of the given words: 5. brave: a) worse b) timid c) destroy d) clean 6. domestic: a) foreign b) problem c) comfort d) fear 7. guilty: a) punishment b) enemy c) ignore d) innocent 8. voluntary: a) powerful b) gentle c) compulsory d) poor Directions (Q.No. 9 - 11): Find the correct SPELLING of the word from among the given variants. 9. a) presumption b) pressumption c) prejumption d) presumpsion 10. a) tetotlar b) teetotaler c) teetotlar d) tetoller 11. a) repercassion b) repercasson c) repercussion d) repercussion KEY: 1) d; 2) b; 3) d; 4) c; 5) b; 6) a; 7) c; 8) c; 9) a; 10) b; 11) c. Practice Test -1 Directions (Q.No. 1 - 10): Fill in the blanks in the following sentences with suitable prepositions. 1. I am not familiar ___ this part of the city. (a) of (b) to (c) for (d) with 2. He was angry __ her behaviour. (a) at (b) with (c) on (d) about 3. Some people are suspicious ___ everyone. (a) about (b) of (c) with (d) to 4. We ordered ___ several copies of that grammar book. (a) for (b) to (c) with (d) none 5. Priyanka Gandhi resembles ___ her father. (a) with (b) to (c) for (d) none 6. He alighted ____ the train quickly as she has to catch another train. (a) from (b) with (c) into (d) none 7. The demands of RTC staff were looked ___ by the management. (a) for (b) at (c) into (d) after 8. He slowly got ___ the misery and resumed his routine work. (a) into (b) for (c) over (d) with 9. The CM congratulated Sania Mirza ___ her achievement. (a) on (b) to (c) for (d) with 10. Mahesh took ___ the new job in Noida very happily. (a) into (b) to (c) after (d) up Key: 1) d; 2)a; 3) b; 4) d; 5) d; 6) a; 7) c; 8) c; 9) a; 10) d. * But we should say "Her name is familiar to all the people in Telugu states and T Nadu." * "We are all angry with him for his conduct at the party." Also we should not use any preposition after "beckon". Eg. "The customer beckon to the waiter." Practice Test -2 Exercise on phrasal words 1. Some people came to look ___ the house, but I don't think they'll buy it. (a) over (b) for (c) out (d) upon 2. Could you look ____ her complaint and make sure that everything's OK. (a) after (b) up (c) into (d) out 3. "Look _____ that fan's going to fall over!" (a) over (b) through (c) out (d) up 4. I had to look ____ my sister's child while she was in hospital. (a) into (b) up (c) after (d) for 5. If you don't know a word, better look it ___ in a dictionary. (a) after (b) up (c) into (d) over 6. The minister promised to look _____ the complaints and find out what has gone wrong. (a) after (b) for (c) up (d) into 7. Resources have really began to look ____ since a new MD has taken over and we hope a surplus situation this year. (a) down (b) up (c) down (d) for 8. Ever since he is graduated, he is looking ____ a job. (a) after (b) by (c) to (d) for 9. While Abdul Kalam was the President, people, especially the youth looked ____ him. (a) upon (b) after (c) for (d) up 10. After the Board exams, the children are looking forward _____ the holiday promised by their parents. (a) to (b) for (c) into (d) through Key: 1) a; 2) c; 3) c; 4) c; 5) b; 6) d; 7) b; 8) d; 9) a; 10) a. -
సంపూర్ణ అక్షరాస్యతకు సహకరించాలి
ఖమ్మం : జిల్లాలో ప్రతీ ఒక్కరు అక్షరాస్యులు కావాలని, జిల్లాను నిరక్షరాస్యులు లేని జిల్లాగా తీర్చిదిద్దే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖమ్మం అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబూరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మంనగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏజేసీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లాలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో నిరక్షరాస్యత అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు, విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు ముందుకు రావాలని అన్నారు. ప్రధానంగా మహిళల అక్షరాస్యతను పెంచితే కుటుంబంలో అందరూ అక్షరాస్యులుగా మారే అవకాశం ఉందని అన్నారు. జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు ఎంఏ. రత్నకుమార్ మాట్లాడుతూ అన్నిదానాల కంటే విద్యాదానం గొప్పదని అన్నారు. ప్రతీ ఒక్కరు తమకున్న జ్ఞాన్నాన్ని ఇతరులకు పంచాలని అన్నారు. జిల్లాలో ఐదు దశలుగా జరిగిన అక్షరాస్యతా కార్యక్రమాల ద్వారా 67,300 మంది నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని అన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్యా వలెంటీర్లు, ఇతర ఉద్యోగులతోపాటు సమాజంలోని చదువుకున్న ప్రతీ ఒక్కరు సహకరిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ వేణుమానోహర్రావు, సెట్‌కం సీఈఓ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్య అన్నింటికి మూలం అన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, అందుకు వయస్సుతో సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సమతా మహిళా సొసైటీ నిర్వాహకులు సామ్యూల్ శైలజ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కనకయ్య పాల్గొన్నారు. -
చీపురుపల్లి టీడీపీలో ముసలం
చీపురుపల్లి : నియోజవర్గంలోని అధికార పార్టీలో ము సలం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు పెత్తనాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు రెండు గ్రూపులుగా ఉన్న పార్టీ నేతలు..ఎన్నికల తరువాత ఒక్కటయ్యూరు. అయితే గద్దే వ్యాఖ్యలతో మళ్లీ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. గతంలో పరిస్థితిని పక్కన పెడితే తాజాగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మృణాళినిని గద్దే ఓవర్ టేక్ చేస్తూ పలు ప్రకటనలు చేస్తుండడం తాజా వివాదానికి దారి తీసింది. వాస్తవానికి మంత్రి మృణాళిని ఆదేశాలతోనే గద్దే ఇలా వ్యవహరిస్తున్నారా లేదా అంతాతానై వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎంపీపీ, వైస్ ఎంపీపీల పేర్లును ప్రకటించి గద్దే పార్టీలో గందరగోళానికి తెర తీసారు. రెండు రోజులుగా గద్దే ప్రకటనలతో విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు సోమవారం బయటపడ్డారు. గద్దే తీరుపై తీ వ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో తెలుగుదేశం నాయకులు ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి మరీ గద్దే వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాకుండా ఎంపీపీ వైస్ ఎంపీపీలను నియమించడానికి ఆయన ఎవరంటూ మండిపడ్డారు. మండల స్థాయిలో తీసుకునే నిర్ణ యాన్ని చెప్పడానికి ఆయన ఎవరంటూ గుర్ల మండల నాయకులు ప్రశ్నించారు. అంతేకాకుండా గద్దే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లు భోగట్టా. ఏదిఏమైనప్పటికీ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న మృణాళిని సొంత నియో జకవర్గంలోనే పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ప్రెస్మీట్లు పెట్టుకుని రోడ్డెక్కి, పార్టీ పరువు బజారు కీడుస్తుండడంతో చర్చనీయమైంది. -
ఎంపీపీ ఎంపికలో రాజకీయం
చీపురుపల్లి: చీపురుపల్లి, గరివిడి మండల అధ్యక్షుల ఎంపికలో రాజకీయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీపీలు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే కొందరిని ఎంపీపీలుగా ఎంపిక చేసినప్పటికీ అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు శనివారం చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి తెరతీసాయి. దీనిపై చీపురుపల్లి, గరివిడి మండలాల్లోని టీడీపీ వర్గీయుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి మెజార్టీతో పాటు మంత్రి ఆశీస్సులు ఉండడంతో చీపురుపల్లి, గరివిడి మండలాలకు చెందిన ఎంపీపీ అభ్యర్థులు ముహూర్తం పెట్టుకు ని సీటులో కూడా కూర్చున్నారు. కానీ గద్దే ఝలక్‌తో ఇప్పుడు వారంతా ఖంగు తింటున్నారు. గద్దే మాటల తో ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మె రకముడిదాం, గుర్ల మండలాల ఎంపీపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఇప్పటికే రౌతు కాంత మ్మ, పైల సింహాచలం వారం రోజులు క్రితమే ము హూర్తం కోసం ఎంపీపీ సీటులో అనధికారికంగా కూ ర్చున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీన ఎంపీపీ ఎన్ని క జరగనున్న నేపథ్యంలో..శనివారం గద్దే బాబూరావు విలేకరులతో మాట్లాడుతూ చీపురుపల్లి, గరివిడి మం డల అధ్యక్షుల ఎంపికపై అస్పష్టంగా మాట్లాడడంతో సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ముహూర్తానికి ఈ రెండు మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు కూర్చొన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా కూర్చొంటే అయిపోతుందా అంటూ ఎదురు ప్రశ్న వే శార. అయితే చివరకు ఆ ఇద్దరినే కూర్చోబెట్టొచ్చు కా ని....పనితీరు బాగా లేకపోతే నెల రోజుల్లో దింపేయవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తన మాట ల్లో ఎంపీపీ అభ్యర్థి పైల బలరామ్‌కు కూడా ఝలక్ ఇచ్చారు. గరివిడి వైస్ ఎంపీపీగా తన అనుచరుడు రవి పేరును ప్రకటించడంతో టీడీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇది నచ్చని ఆ పార్టీలో మరికొంతమం ది వైస్ ఎంపీపీ పేరు ప్రకటించడానికి ఆయనకు ఉన్న అధికారమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు బ యటకు పొక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గీయుల్లో చర్చ ప్రారంభమవ్వగా.. ఎంపీపీ అభ్యర్థుల్లో గుబు లు మొదలైంది. -
నల్లమలలో అలజడి
ఆత్మకూరు: నల్లమల అడవిలో మళ్లీ అలజడి రేగింది. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో మావోయిస్టునేత ఆర్కే అనుచరుడు బాబురావుతో పాటు విమల, భారతి అనే ముగ్గురు హతమవ్వగా, ఒకరు తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం, కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్తగా సున్నిపెంట పోలీస్ ఔట్‌పోస్ట్‌ను శ్రీశైలానికి తరలించింది.మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన ఉన్న నల్లమలలో గతంలో పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీ ముమ్మరంగా కార్యకలాపాలను సాగించింది. దాదాపు 15 ఏళ్ల పాటు పోలీస్, నక్సల్స్ మధ్య నల్లమలలో యుద్ధం సాగింది. గతంలో కర్నూలు పరిధిలోని నల్లమల నక్సల్స్ షెల్టర్‌జోన్‌గా ఉండేది. మహబూబునగర్ జిల్లా పరిధిలోని పోలీసుల నిఘా అధికమైతే కర్నూలు వైపు, జిల్లా పరిధిలో కూంబింగ్ జరిగితే మహబూబ్‌నగర్ జిల్లా వైపు తమ కార్యకలాపాలను నక్సల్స్ మార్చుకునేవారు. కర్నూలు జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి శ్రీశైలం అటవీ పరిధి వర కు అప్పట్లో నక్సల్స్‌కు షెల్టర్ జోన్‌గా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయినా భౌగోళికంగా ఒకే పరిధి కావడంతో జిల్లా మళ్లీ షెల్టర్‌జోన్ గా వారికి ఉపయోగ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారిగా 1984లో అప్పటి పీపుల్స్‌వార్‌గ్రూప్ జానాల గూడెంలో జెండా ఎగురవేసి కార్యకలాపాలను ప్రారంభించింది. జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ, అహోబిలం, రుద్రవరం మండలాల్లో పీపుల్స్‌వార్ అప్పట్లో కార్యక లాపాలను కొనసాగించింది. అప్పట్లో ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్, అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, మాట్టా రవికుమార్‌లు ఎన్కౌంటర్లో బలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులు నల్లమల నుంచి ఏఓ బీ, చత్తీస్‌ఘడ్‌కు మకాం మార్చారు. మావోల రిక్రూట్మెంట్: ప్రస్తుతం నల్లమల అటవీపరిధిలోని మహ బూబ్‌నగర్, కర్నూలు జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ భారీగా జరుగుతున్నట్లు విశ్వనీయ సమాచారం. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయినా మావోలు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో న ల్లమల అటవీ పరిధిలోని అన్ని జిల్లాల్లో వీరు తమ రిక్రూట్మెంట్ కార్యక్రమాలు అధికం చేసి కేడర్ బలపరుచుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ల కేంద్రంగా ఆత్మకూరు డివిజన్: ఆత్మకూరు డివిజన్లో 2002లో భానుముక్కుల మలుపు వద్ద తొలి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో వడ్లరామాపురం గ్రామానికి చెందిన లింగస్వామి మృతి చెందారు. అలాగే 2003లో బావాపురం గ్రామం వద్ద శ్రీధర్, 2004లో నల్లకాలువ సమీపంలో వేణు అనే మావోలు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మావోల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో మావోల కార్యకలాపాలు ఏమీ లేవని పోలీసు వర్గాలు పేర్కొంటున్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో వారు అప్రమత్తమయ్యారు. -
ఫలించిన ఉమ పోరాటం..!
పలాస, న్యూస్‌లైన్: పలాస కాపువీధికి చెందిన జామి ఉమ న్యాయపోరాటం ఫలించింది. కులపెద్దల జోక్యంతో ఆమె భర్త ఎట్టకేలకు దిగివచ్చాడు. భార్యతో కాపురం చేసేందుకు అంగీకరించాడు. ఈ మేరకు కాశీబుగ్గలో తెలగకుల సంఘం పెద్దల సమక్షంలో ఇరుకుటుంబాలు అంగీకరిస్తూ రాజీపత్రంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇవీ..విజయనగరం సారిక గ్రామానికి చెం దిన ఉమకు, పలాసకు చెందిన జామి బాబూరావుతో 2010 జూన్ 24న వివాహం జరిగింది. వారికి హేమలత అనే పాప జన్మించింది. ఉమ కాన్పుకోసం కన్నవారింటికి వెళ్లింది. బిడ్డపుట్టి రెండేళ్లయినా..భర్త నుంచి పిలుపు రాకపోవడంతో..భర్తను వెతక్కుంటూ.. పలాస చేరుకుంది. ఈనెల 4న కాపువీధిలోని బాబూరావు ఇంటికి వెళ్లగా కుటుం బీకులు ఆ ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్లిపోయారు. దీంతో ఉమ ఇరుగుపొరుగు వారి సహకారంతో కాపువీధిలోని భజన మందిరంలో ఉంటూ న్యాయపోరాటానికి దిగింది. ఈ విష యం పోలీసులకు తెలిసినా..ఉమ వారికి తన భర్తపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా తనకు న్యాయం చేయాలని, తన భర్తతో కలిసి కాపురం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కులపెద్దలు రంగప్రవేశం చేశారు. పలాస తెలగకుల సంక్షేమ సంఘానికి చెందిన కుల పెద్దలు సీహెచ్ శ్యామలరావు, పుట్టా లోకనాథం, జి.వెంకటరమణ, బాబ్జి, బుదిరెడ్డి ప్రతాప్, టి.వెంకటరమణ, జి.వెంకటరమణ, వాసు తదితరులు సమక్షంలో ఉమ తల్లి పద్మావతి, ఉమ భర్త బాబూరావుతో పాటు సోదరులు జామి రామారావు, భాస్కరరావు తది తరులు సమస్యను పరిశీలించి పరిష్కరించారు. విడిపోవడానికి కావలసిన విభేదాలు వారి మధ్య లేవని, చిన్న చిన్న లోపాల కారణంగా ఇటువంటి తేడాలు వచ్చాయని గమనించిన పెద్ద లు, కుటుంబీకులు వారిని ఒక ఆరునెలలు పాటు ప్రత్యేకంగా ఒక అద్దె ఇంట్లో కాపురం చేయాలని సూచిం చారు. ఈ ప్రతిపాదనకు ఇరువర్గాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా ఉమ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తన భర్త చాలా మంచివాడని, ఆయనతో బతకాలన్నదే తన ఆశ అని పేర్కొంది. తమను కలిపిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపింది. -
డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించొద్దు
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఏపీఐఐసీ స్థలంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ లైఫ్ సెన్సైస్, వరుణ్ కంపెనీల ఆధ్వర్యంలో అన్నారుగూడెంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలప్పేట గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. గో బ్యాక్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటూ నినాదాలు చేస్తూ సభావేదిక వద్దకు వచ్చారు. తొలుత సభలోని స్థానికేతరులను బయటకు పంపించాలని పట్టుబట్టారు. ఫ్యాక్టరీ బాధిత ప్రజలకే మాట్లాడే ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికారులు అంగీకరించడంతో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ కాలుష్యం పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ ప్రాంతంలో కాటన్ పార్క్ పేరుతో భూములు సేకరించి డ్రగ్ ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గోవింద్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులకు అవసరమైన జిన్నింగ్ మిల్ నిర్మిస్తామని చెప్పి రైతుల నుంచి 48 ఎకరాలు సేకరిస్తే చివరకు అది రైతులకు నష్టం కలిగించేదిగా తయారైందని అన్నారు. భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోక పోవటంతో దివాళా తీశారన్నారు. సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు దొడ్డా శ్రీనువాసరావు మాట్లాడుతూ అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాళ్లవాపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే మిల్లుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనల మధ్య ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం అసంపూర్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసనాయక్, కాలుష్య నియంత్రణ ఈఈ ఎం.నారాయణ, తహశీల్దార్ టి.సుదర్శన్‌రావు, ఈఓఆర్డీ కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
అటవీ అధికారులకు త్వరలో తుపాకులు
రామాయంపేట, న్యూస్‌లైన్: అటవీ సంరక్షణ కోసం రేంజ్ అధికారులకు త్వరలో తుపాకులు పంపిణీ చేస్తున్నట్టు సామాజిక అడవుల నిజామాబాద్, మెదక్ జిల్లాల అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు తెలిపారు. శుక్రవారం ఆయన రామాయంపేటకు వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి రేంజ్ కార్యాలయానికి ఆరు తుపాకుల చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. మెదక్ డివిజన్లో 22 శాతం భూమి కబ్జాలకు గురైందన్నారు. అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారెందరు? ఎన్ని ఎకరాలు ఆక్రమించారనే విషయంపై నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టామని, అక్రమాలకు చెక్ పెడతామన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అక్రమంగా అడవులను నరికి సాగు చేస్తున్న 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెదక్- రామాయంపేట ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి అడవిలోంచి రోడ్డు వేయడం అనుమతి లేదన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించామన్నారు. అలాగే వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్వార్టర్ నిర్మాణం కోసం భూమి పూజ రామాయంపేట అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ నిర్మాణం కోసం శుక్రవారం బాబురావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్వార్టర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 19 లక్షల రూపాయలు యంజూరు చేసిందన్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు, మెదక్ డీఎఫ్ఓ హరికుమార్, సబ్ డీఎఫ్ఓ సత్య నారాయణలను రామాయంపేట రేంజ్ ఆఫీసర్ మురళీధర్ పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామాయంపేట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ విద్యా సాగర్, రేంజ్ పరిధిలోని సెక్షన్, బీట్ ఆపీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రేంజ్ ఆఫీసర్ మురళీధర్ మాట్లాడుతూ రామాయంపేట రేంజ్ పరిధిలో 18 బీట్లు ఉన్నాయని తెలిపారు. ఏడుగురు బీట్ ఆపీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెదక్ మండలం పాతూర్ సెక్షన్లో బీట్ ఆఫీసర్ లేరని తెలిపారు. రామాయంపేట రేంజ్ కార్యాలయానికి వాహనాన్ని మంజూరు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న బీట్లలో అధికారులను నియమించాలని ఆయన కోరారు. -
దాడి చేస్తే చంపేయండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : ‘మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అడవి దొంగలు దాడి చేస్తే చంపేయండి. నేను మీ వెనక కాదు.. ముందుంటా. అటవీ సంపద రక్షణకు కలసికట్టుగా కృషి చేద్దాం’ అని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బాబూరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. భూ ఆక్రమణదారుల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగయ్యను అతికిరాతకంగా హత్య చేసిన వారిని అక్కడే చంపేయాల్సిందన్నారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండడం, ఆయుధాలు లేకపోవడంతో దుండగుల ఆటలు సాగుతున్నాయన్నారు. దుండగులు గంగయ్య కంట్లో కారం చల్లి, దాడికి పాల్పడ్డారని పేర్కొన్నా రు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సూచించారు. సిబ్బందికి ఆయుధాలు కావాలని ఉన్నతాధికారులతో పేర్కొన్నానన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆయుధాల విషయం చర్చిస్తానన్నారు. రేంజ్‌కు ఆరు ఆయుధాల చొప్పున తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. వీటి వినియోగంపై అటవీశాఖలోని యువ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తానని పేర్కొన్నారు. సిబ్బందిలో మనోధైర్యం నింపడానికి యత్నించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తానని, 24 గంటలు సిబ్బందికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవసరమైతే పోలీసు రక్షణ తీసుకోవాలని టెరిటరియల్ డీఎఫ్ఓ భీమ సూచించారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ వేణుబాబు, టెరిటోరియల్ సబ్ డీఎఫ్ఓ గోపాల్‌రావు, నిజామాబాద్ రేంజ్ ఎఫ్ఆర్ఓ గంగాధర్, నిజామాబాద్ డివిజన్లోని అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు.