గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు | cpm leader criticize the tdp government | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు

Published Tue, Mar 21 2017 8:29 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు - Sakshi

గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు

విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికలు సీఏం చంద్రబాబు నాయుడికి, లోకేశ్‌కు గుణపాఠం నేర్పాయని సీపీఎం నేత బాబురావు అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను చాలా తెలిగ్గా కొని విజయం సాధించారిని చెప్పారు. వందల  మంది ఓటర్లు ఉన్న స్థానాల్లో టీడీపీ గెలిసింది. కానీ లక్షల మంది ఓటర్లు ఉన్న స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారని బాబురావు పేర్కొన్నారు. ఈ  ఎన్నికల ఫలితాల పై టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

ఏపీలో మీడియా చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు వత్తాసు పలుకుతోందిని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిందని అన్నారు. చంద్రబాబుకు రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తానే సీఎం అవుతాననే అహంభావం పనికిరాదని సీపీఎం నేత బాబురావు అన్నారు. అలాంటి భ్రమలు పనికిరవ్వాని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పుతారన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement