ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతిపురం వివేకానంద కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అదే కాలనీకి చెందిన బాబురావు(60) ఆమెను ఎత్తుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు.
రక్తపు మరకలతో ఇంటికి వచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. చిన్నారి అసలు విషయం చె ప్పింది. దీంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. గతంలో లైంగిక దాడి కేసులో బాబురావు ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించి ఈ మధ్యే బయటకు వచ్చాడు.