
సాక్షి, హైదరాబాద్ : నగర కమిషనరేట్ ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీగా పనిచేస్తున్న బాబురావుపై అతడి మొదటి భార్య వేదశ్రీ డీజీపీ మహేందర్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేసింది. తనతో 25ఏళ్ల పాటు కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయిన బాబురావు విడాకులివ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
తమకు తెలియకుండానే మతం మార్చుకున్నాడని, చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ.5 లక్షలు తీసుకుని విడాకులకు ఒప్పుకోవాలని వేధిస్తున్నాడని తెలిపింది. విజయవాడలో తనకు సంబంధించిన రూ.కోటి విలువ చేసే భూమిని, తానే వేదశ్రీ అని చెప్పుకుని బాబురావు రెండో భార్య అమ్మకుందని ఆరోపించింది. బాబురావు వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment