చీపురుపల్లి: చీపురుపల్లి, గరివిడి మండల అధ్యక్షుల ఎంపికలో రాజకీయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీపీలు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే కొందరిని ఎంపీపీలుగా ఎంపిక చేసినప్పటికీ అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు శనివారం చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి తెరతీసాయి. దీనిపై చీపురుపల్లి, గరివిడి మండలాల్లోని టీడీపీ వర్గీయుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి మెజార్టీతో పాటు మంత్రి ఆశీస్సులు ఉండడంతో చీపురుపల్లి, గరివిడి మండలాలకు చెందిన ఎంపీపీ అభ్యర్థులు ముహూర్తం పెట్టుకు ని సీటులో కూడా కూర్చున్నారు.
కానీ గద్దే ఝలక్‌తో ఇప్పుడు వారంతా ఖంగు తింటున్నారు. గద్దే మాటల తో ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మె రకముడిదాం, గుర్ల మండలాల ఎంపీపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఇప్పటికే రౌతు కాంత మ్మ, పైల సింహాచలం వారం రోజులు క్రితమే ము హూర్తం కోసం ఎంపీపీ సీటులో అనధికారికంగా కూ ర్చున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీన ఎంపీపీ ఎన్ని క జరగనున్న నేపథ్యంలో..శనివారం గద్దే బాబూరావు విలేకరులతో మాట్లాడుతూ చీపురుపల్లి, గరివిడి మం డల అధ్యక్షుల ఎంపికపై అస్పష్టంగా మాట్లాడడంతో సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే ముహూర్తానికి ఈ రెండు మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు కూర్చొన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా కూర్చొంటే అయిపోతుందా అంటూ ఎదురు ప్రశ్న వే శార. అయితే చివరకు ఆ ఇద్దరినే కూర్చోబెట్టొచ్చు కా ని....పనితీరు బాగా లేకపోతే నెల రోజుల్లో దింపేయవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తన మాట ల్లో ఎంపీపీ అభ్యర్థి పైల బలరామ్‌కు కూడా ఝలక్ ఇచ్చారు. గరివిడి వైస్ ఎంపీపీగా తన అనుచరుడు రవి పేరును ప్రకటించడంతో టీడీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇది నచ్చని ఆ పార్టీలో మరికొంతమం ది వైస్ ఎంపీపీ పేరు ప్రకటించడానికి ఆయనకు ఉన్న అధికారమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు బ యటకు పొక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గీయుల్లో చర్చ ప్రారంభమవ్వగా.. ఎంపీపీ అభ్యర్థుల్లో గుబు లు మొదలైంది.
ఎంపీపీ ఎంపికలో రాజకీయం
Published Sun, Jun 29 2014 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement