ఎంపీపీ భర్త రామా
వీరబల్లి: మండలంలో ఉపాధిహామీపనులు మొదలుకుని ఎలాంటి అభివృద్ధిపనులు వచ్చినా తాను చెప్పినవారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీచేస్తున్నాడని ఎంపీపీ స్వరూ స్వప్న భర్త రామా, తదితర టీడీపీ నాయకులు తెలుపుతున్నారని కొందరు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మండలంలో మామిడిమొక్కలు నాటుకునేందుకు మంజూరు కాగా ఈ విషయమై ఏపీవో హేమలతను రైతులు శివ, హరి, చంద్ర, బాబులతోపాటు మరికొందరు పలుమార్లు ఏపీవోను సంప్రదించగా నాయకుల వద్దకు వెళ్లి ఒక మాట అడగండి అని అంటున్నారని రైతులు వాపోతున్నారు. ఏపీవో కార్యాలయంలో నేరుగా రైతులే సంప్రదించగా ఏపీవోపై ఆగ్రహం చెందగా తమకు మామిడిమొక్కలు నాటుకునేందుకు మంజూరయ్యాయని సోమవారం నుంచి మొక్కలు నాటుకునేందుకు పనులు కల్పిస్తామని తెలిపారు. రైతులు ఉపాధి అధికారులపై ఆగ్రహం చెందిన విషయం ఎంపిపి భర్త రామాకు ఏపివో తెలుపగా అతను విలేకర్లపై మండిపడ్డాడు.
దీంతో ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ తాము ఎన్నికలలో ఎంతో ఖర్చుచేశామని ఎలాంటిపని వచ్చినా తమను సంప్రదించాల్సిందేకదా అంటూ విలేకర్లపై చిందులువేశారు. రైతులు కొందరు ఏపివోపై ఆగ్రహం చెందగా ఎంపీపీ భర్త న్యూస్‌లైన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఉపాధి అధికారులు కూలీల పట్ల పక్షపాతంలేకుండా పనులు కల్పించాలని పార్టీనాయకులకు తొత్తులుగా ఉండకూడదు అని పలువురు వారిపై మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ విషయం గమనించి అందరికీ సమ న్యాయం కల్పించేలా ఉపాధి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎంతైనా లేకపోలేదు.
తాను చెప్పినవారికే పనులు కల్పించాలి
Published Fri, Jul 22 2016 2:13 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement