పెనుగొండ ఎంపీపీ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
Published Mon, Feb 27 2017 1:29 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖను టీడీపీ నుంచి బహిష్కరిస్తూ ఎంపీపీ పదవిపై ఏర్పడిన వివాదానికి తెరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. జూలి సురేఖను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటిస్తారని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు. పెనుగొండ మండల పరిషత్‌లో ఎంపీపీ వివాదం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఎంపీపీగా తొలుత పల్లి జూలీ సురేఖకు రెండున్నర సంవత్సరాలు, అనంతరం చీకట్ల భారతి కొనసాగేవిధంగా అంగీకరించారు. రెండున్నరేళ్లు పూరై్తనా తాను రాజీనామా చేసేది లేదంటూ సురేఖ తేల్చిచెప్పడంతో టీడీపీలో వివాదం రాజుకుంది. కొందరు నేతలు సురేఖకు మద్దతు ప్రకటిస్తున్నారన్న అనుమానాలు ఉండడంతో ఎంపీటీసీలతో చర్చించారు. టీడీపీకి చెందిన 17 మంది ఎంపీటీసీలు ఏకతాటిపైకి రావడంతో జిల్లా నాయకత్వానికి ఎంపీపీ వివాదాన్ని తెలియచెప్పారు. ఎమ్మెల్యే పితాని ఆధ్వర్యంలో మండలానికి చెందిన కొందరు నాయకులు ఎంపీపీ వివాదాన్ని నారా లోకేష్‌కు వివరించడంతో జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎంపీపీతో చర్చించి నిర్ణయం తీసుకోమని ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై శనివారం ఏలూరులో జరిగిన సమావేశంలో చర్చించినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో చివరకు ఎంపీపీని సస్పెండ్ చేయడానికి నిర్ణయించారు.
వైస్ ఎంపీపీగా చీకట్ల భారతి
కాగా ఎంపీపీగా ఆఖరి రెండున్నర సంవత్సరాలు కొనసాగాల్సిన చీకట్ల భారతిని వైస్ ఎంపీపీగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం దేవ ఎంపీటీసీ మన్నే శ్రీహరి విశ్వేశ్వరరావు పెండ్లికొడుకు వైస్ ఎంపీపీగా ఎన్నిక కావాల్సి ఉన్నా భారతికి అన్యాయం జరిగిందన్న కారణంతో పాటు ఎంపీపీకి చెక్ పెట్టేందుకు ఆమెను ఎంపిక చేశారు. ఇదిలా టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు ఎటువంటి సమాచారం అందలేదని పల్లి జూలీసురేఖ చెప్పారు.
Advertisement
Advertisement