అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే
సీపీఎం నేత బాబూరావు
విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులు, కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశాకే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రాజ ధాని ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోందని అన్నారు. రాజ దాని రైతులు, ప్రజల నోట్లో మట్టికొట్టి నీరు, మట్టి తెచ్చి వేసి ప్రభుత్వం విస్తత ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై ఉన్న సీఎం నివాసం పనుల నుంచి శంకు స్థాపన ఏర్పాట్ల వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
కనీసం రోడ్లు వేసే కూలీలుగా కూడా రాజధాని ప్రాంత పేదలకు ఉపాధి కల్పించడంలేదని ఆవేదన వక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి హామీ పనులు ఇప్పిస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ముగ్గురికి మాత్రమే వంద రోజుల పని కల్పించిందన్నారు. రాజధాని ప్రాంతంలో డ్వాక్రా రుణమాఫీ, ఎన్‌టీర్ క్యాంటీన్‌ల ఏర్పాటు, వద్ధాశ్రమాలు, ఇళ్లులేని వారికి ఇళ్లు, ఆక్రమణల క్రమబద్దీకరణ, ఇళ్లపట్టాలు, నిర్మాణాల్లో స్థానికులకు ప్రాధాన్యత, గ్రామ కంఠాల సమస్య పరిష్కారం వంటి హాలు ఇంకా అమలుకాలేదని బాబూరావు చెప్పారు.