సీహెచ్ బాబురావు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : పన్నులు పెంచమని అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దొడ్డిదారిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్మించారు. ఆస్తి పన్ను కట్టకపోతే రెండు రూపాయలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలు వసూలు చేస్తామని నోటీసులు పంపడం అనైతికమన్నారు. నగరపాలక సంస్థతో పాటు ఇతర పాంత్రాల్లో వాటర్, డ్రైనేజీ, చెత్త ఇతర సర్వీసు ఛార్జీలతో పాటు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నరని తెలిపారు. నగర పాలక సంస్థ మరుగు దొడ్ల మీద కూడా వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు.
నగర ప్రజలకు పన్నుల చెల్లింపులో నోటీసులు సీడీఎమ్‌ఎ తరుఫున ప్రభుత్వమే ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. టీడీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పన్నులు రెట్టింపు చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన మంచినీటి, డ్రైనేజి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 దాటితే వడ్డీ వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ చివరి వరకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వడ్డీల భారాన్ని తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment